Featured
ఈటీవీ విన్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌స్తున్న మొట్ట మొద‌టి థియేట్రిక‌ల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ‘90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్‌’తో యువతకు చేరువైన మౌళి త‌నూజ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య హ‌స‌న్ దీనికి నిర్మాత కావ‌డం విశేషం. అఖిల్ (మౌళి త‌నూజ్‌) చ‌దువుల్లో అంతంత మాత్ర‌మే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాల‌నుకుంటాడు. కానీ, తండ్రి గోపాల‌రావు (రాజీవ్ క‌న‌కాల‌) మాత్రం లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయ‌ని (శివానీ నాగారం)ది కూడా అదే క‌థే. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే. తమ కూతురిని కూడా డాక్ట‌ర్‌గా చూడాల‌నేది వాళ్ల ల‌క్ష్యం. అందుకే కాత్యాయ‌ని కూడా ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్క‌డే అఖిల్‌, కాత్యాయ‌ని ప‌రిచ‌యమవుతారు. ఆ ప‌రిచ‌యం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ త‌న మ‌న‌సులో మాటని బ‌య‌ట పెడ‌తాడు. అప్పుడు కాత్యాయ‌ని త‌నకు సంబంధించిన ఓ విష‌యాన్ని బ‌య‌ట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమ‌క‌థ‌లో ఓ పెద్ద మ‌లుపు. ఇంత‌కీ కాత్యాయ‌ని చెప్పిన ఆ విష‌యం ఏమిటి?వీళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌కి ఎదురైన స‌మ‌స్య ఏమిటి? ఆ ప్రేమ‌క‌థ కంచికి చేరిందా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్‌ హార్ట్స్‌ – సినిమా రివ్యూలు – లింకులు
సిద్ధార్థ్ (నారా రోహిత్‌) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. మూడు ప‌దుల వ‌య‌సు దాటిపోతున్నా స‌రే... అమ్మాయిల్లో త‌నకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ పెళ్లి సంబంధాల్ని తిర‌స్క‌రిస్తుంటాడు. స్కూల్‌లో త‌న‌కు సీనియ‌ర్ అయిన వైష్ణ‌వి (శ్రీదేవి విజ‌య్‌కుమార్‌)లో చూసిన ఆ ఐదు క్వాలిటీస్‌ తనకు కాబోయే భార్య‌లో ఉండాలనేది సిద్ధార్థ్ కోరిక‌. స్నేహితులు, కుటుంబ స‌భ్యులు ఎంత చెప్పినా అందులో రాజీప‌డ‌డు. తీరా ఉద్యోగరీత్యా విదేశాల‌కు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ఐరా (వృతి వాఘాని) సిద్ధార్థ్‌కి ఎదుర‌వుతుంది (Sundarakanda Review). తొలి ప‌రిచ‌యంలోనే ఆమెలో త‌న‌కు న‌చ్చే కొన్ని లక్షణాలను గ‌మ‌నిస్తాడు. దాంతో త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకొని మ‌రీ ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు త‌న కుటుంబంతో క‌లిసి ఐరా ఇంటికి వెళ్లాక అక్క‌డ ఎవరూ ఊహించని విషయం తెలుస్తుంది (Sundarakanda Story). అదేంటీ? చిన్న‌ప్పుడు స్కూల్‌లో తాను ఎంత‌గానో ఆరాధించిన వైష్ణ‌వికి సిద్ధార్థ్ ఎందుకు దూర‌మ‌య్యాడు? మ‌ళ్లీ ఆమె త‌న జీవితంలోకి తిరిగొచ్చాక ఏం జ‌రిగింది? అస‌లు సిద్ధార్థ్‌, ఐరా పెళ్లి జ‌రిగిందా? లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.
డతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. తాను ఆచారాన్ని తప్పలేదని వేడుకున్నా... ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. ఆచారం ప్రకారం ప్రాణాలైనా వదలాలి, లేదంటే తప్పు చేయలేదనైనా నిరూపించుకోవాలని కోరతారు ఊరి ప్రజలు. దాంతో సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సి వస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి?సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?  
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి... పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.

ఓటీటీ స్ట్రీమింగ్‌ / సెప్టెంబర్ 4,2025 : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్‌). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్‌) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? అన్నది కీలకం.

Showing all 5 results