బాబు (నాని) ఒక అదృష్టవంతుడు, అతను కీర్తి (కీర్తి సురేష్) తో ప్రేమలో పడతాడు. అతను ఆమెను ఆకర్షించడం ప్రారంభించాడు మరియు చాలా ప్రయత్నించిన తర్వాత చివరికి ఆమెను ఆకట్టుకోగలిగాడు. అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, కీర్తి తండ్రి (సచిన్ ఖడేకర్) మరియు ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ వర్మ (నవీన్ చంద్ర) రూపంలో పెద్ద గొడవ జరుగుతుంది. ఈ పోలీసు ఎవరు? కీర్తి తండ్రి ఏమి చేస్తున్నాడు? మరియు బాబు తన సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించుకుంటాడు మరియు చివరికి కీర్తిని ఎలా వివాహం చేసుకుంటాడు? అదే మిగిలిన కథ.
ఆత్రేయపురం అనే ఊర్లోని రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడితే, రాజుగారు మాత్రం తన ఊర్లోనే భార్య జానకమ్మ, మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయి ఎప్పుడూ తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు ఎప్పుడూ కలత చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఓ పథకం వేసి, తన పిల్లలంతా సంక్రాంతికి వచ్చేలా చేస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్), రాజుతో పరిచయం పెంచుకొని అతడితో ప్రేమలో కూడా పడిపోతుంది. సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతుండగానే, రాజుగారు వేసిన పథకం ఆయన భార్యకు తెలిసి గొడవ జరుగుతుంది. కుటుంబంలోనూ పలు విబేధాలు వస్తాయి. రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి? అసలు ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకొని ఆ పథకం వేశాడు? రాజు, నిత్యాల ప్రేమకథ ఏమైంది? అన్నదే సినిమా.

Showing all 2 results