Popular Movies
to Watch Now

Most watched movies by days

శ్రీను(నాగార్జున) ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు(టబు) అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.
ఈ చిత్రం 1989 లో జితేంద్ర (జగపతి బాబు), అతని తండ్రి, కర్నూలులో నిర్దాక్షిణ్యమైన డాన్ స్థానిక MLA కుమార్తె అయిన కల్యాణిని పెళ్ళిచుపులు కోసం వైజాగ్ వస్తాడు.తిరిగి వెళ్ళెడప్పుడు, జితేంద్ర కారుతో ఒక వ్యక్తిని గుద్ది, కారు నుంచి బయటకు రావాలని అడిగిన ఒక వ్యక్తిని కల్చేస్తాడు.దానితో చుట్టు ఉన్న వ్యక్తులు అతనని ఆ ప్రాంతపు పెద్ద మనిషి (సుమన్) దగ్గరకు తీసుకు వెల్తారు.అతని కుటుంబంలో, అతని తల్లి; భార్య (సుహాసిని) ఒక కళాశాల లెక్చరర్; సోదరి (ఈశ్వరి రావు); బావ (రావు రమేశ్); వారి పిల్లలు; యువకుడైన కుమారుడు జైదేవ్, కుమార్తె;, అతని విశ్వసనీయ భాగస్వామి రఘవియా (చలపతి రావు).ఆ పెద్ద మనిషి గాయపడినవారికి క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించమని జితేంద్రను అడుగుతాడు. ఇది జితేంద్ర అహాన్ని దెబ్బతీస్తుంది, ప్రజలను పేదలుగా పిలిచి వారిని అవమానిస్తాడు. ఆ పెద్ద మనిషి కోపంగా అతన్ని కొట్టి అతన్ని అరెస్టు చేస్తాడు, అందుచే జితేంద్ర పగ పడతాడు.

జితేంద్ర తండ్రి (రామరాజు) భూస్వామి భార్య, జైదేవ్ను కిడ్నాప్ చేసి, ఫిర్యాదును తిరిగి తీసుకోవాలని అతన్ని బలవంతం చేస్తాడు.జితేంద్ర విడుదలయ్యారు, వారు బంధించి ఉన్న ప్రదేశానికి వెళతారు.అతను తన తండ్రి చనిపొయి ఉండతం చూస్తాడు, వారిలో చాలామంది హంతకులు చంపబడ్డారు. జమీదేవ్ తల్లిని చంపినందువల్ల రామరాజు హత్య చేసినట్లు వెల్లడించారు. అందువలన వారి శత్రుత్వం శాశ్వతమైనది.తిరిగి జయదేవ్ ఇంటిలో, జైదేవ్ నానమ్మ (సుజాత కుమార్) తన ముత్తాత, తాత, మామయ్య లాగ హత్యకు గురవుతాడని భయపడుతుంది, అందువల్ల అమె వారి కుటుంబ సభ్యులందరిని విదేశాలు పంపుతుంది.జితేంద్ర విశాఖపట్నమ్లో పలుకుబడిగల వ్యక్తిగా మారతాడు.

కృష్ణ (నందమూరి బాలకృష్ణ) దుబాయ్లో ఉంటాదు, ఇక్కడ అతను వ్యబిచారమ్లో విక్రయించబడే కొంతమంది భారతీయ బాలికలను రక్షిస్తాడు, అతని ప్రియరాలు స్నేహ (సోనాల్ చౌహాన్), గురు మాణిక్యం (బ్రహ్మానందం)తో కలిసి వైజాగ్ లో తిరిగి రావాలని ప్రణాళిక చేస్తున్నాడు భారతదేశంలో వారి వివాహం గురించి పెద్దలకు చెప్పటానికి.అప్పుడు అతను స్నేహ తండ్రి జితేంద్ర యొక్క వ్యాపార భాగస్వామి (ఆహుతి ప్రసాద్) తో కలస్తాడు.అతను విమానాశ్రయం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను జితేంద్ర పెద్ద కుమారుడు చోటు (శారవణన్), అతని అనుచరులను అతనిని చంపాలని కోరుకునే మాజీ ఎమ్మెల్యేని రక్షిస్తాడు.కృష్ణ వాటిని తీవ్రంగా కొడతాడు, ఇది జైదీవ్ యొక్క మాజీ సహచరుల అది గుర్తిస్తారు. ఇంతలో, చోటు, మాజీ MLA ఇద్దరూ అదే ఆసుపత్రిలో చెరతారు. చొటు ఆ ఎం.ఎల్.ఎ.ని చంపటానికి వెల్తాడు కాని రహస్యకర పరిస్థితులలో అతను చనిపొతాడు.జయదెవ్ పొలిసులతో కలసి హాస్పటల్ సి.సి. ఫుతేజ్లో కృష్ణని చుసి అతనని చంపాలని చుస్తాడు.ఆలయం వద్ద అతను కృష్ణని కాల్చి తన రెండవ కుమారుడు, అతని సహచరులను స్నేహతో సహా మొత్తం కుటుంబాన్ని చంపడానికి ఆదేశిస్తాడు, కాని సరైన సమయంలో జైదేవ్ (నందమూరి బాలకృష్ణ), కృష్ణుడి అన్నయ్య) వారిని రక్షిస్తాడు.

జైదేవ్ జితేంద్ర రెండవ కుమారుడు,అతని అనుచరులు, ఎసిపిని హత్య చేస్తాడు, జితేంద్ర నియంత్రణలో లేకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రస్తుత MLA (జయప్రకాష్ రెడ్డి) ను బెదిరిస్తాడు. జితేంద్ర కుమారులు అంత్యక్రియల అప్పుడు, జితేదేవ్ యొక్క చిన్న కుమారుడికి జైదేవ్ కథను ఎమ్మెల్యే చెప్పి, అతను ప్రమాదకరమైన గతంతో ఉన్నాడని చెబుతాడు.ఈ కథ 1999 కి మారిపోతుంది, అక్కడ జితేంద్ర తన సోదరుడు అజయ్ (అజయ్) ఎమ్మెల్యేని చేయాలని కోరుకున్నాడు, అతని నేర స్వభావం కారణంగా పార్టీ టికెట్ ఇవ్వని స్థానిక MP ని హత్య చేశాడు.జైదెవ్ వారిని కొట్టి జితేంద్రను అరెస్టు చెయిస్తాడు. జైదెవ్ కుటుంబం అతనికి దూరంగ ఉంతుంది.తన మరదలు రాధిక (రాధిక ఆప్టే) అతన్ని ప్రేమించి పెళ్ళి చెసుకుంటుంది.అజయ్ జైలు నుండి బయటికి వచ్చి కృష్ణని ఎత్తుకెల్తాడు.జైదేవ్ అతన్ని చంపి జితేంద్రని వైజగ్ వదిలి వెల్లిపొమ్మంటాడు.కర్నూలు రైల్వే స్టేషన్లో తన మనుషుల ప్రేరణతో వైజగ్ వచ్చి రాధికను రైల్వయ్ యార్డుకు ఎత్తుకెల్తాడు.అక్కడికి జైదెవ్ వచ్చి జితేంద్ర మనుషులను చంపుతాడు.జితేంద్ర రాధికను కత్తితో పొడుస్తాడు.జైదెవ్ జితేంద్రని తెవ్రంగా గాయపరుస్తాడు.రాధిక జైదెవ్ చెతుల్లో చనిపొతుంది.దానితో జైదెవ్ నానమ్మ తన వారి కుటుంబన్ని కలవకూడదని లెకపొతే తను చనిపొతానని హెచ్చరిస్తుంది.

ప్రస్తుతం జయదేవ్ నుండి రక్షించటానికి జితేంద్ర యొక్క మూడవ కుమారుడు అమెరికాకు వెళ్లడానికి ఎమ్మెల్యే సలహా ఇస్తాడు.జైదెవ్ తన కుటుంబ సభ్యులతో కలుస్తాడు.జితేంద్ర రాష్త్రానికి ముఖ్యమంత్రి అవ్వటానికి ఎం.ఎల్.ఎ.లకు లంచం ఇవ్వటానికి సిద్దపదతాడు.కాని జైదెవ్ వారిని హెచ్చరించి ప్రజల కోసం పని చెయ్యలని చెబుతాడు.జితేంద్ర వారిని చంపటానికి వస్తాడు కాని జైదెవ్ జితేంద్రని చంపటంతో కథ ముగుస్తుంది.


బాలకృష్ణ నందమూరి, జగపతి బాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్, కమల్ కామరాజు, రావు రమేష్, సమీర్, పృధ్వీరాజ్, హంస నందిని, చలపతి రావు, సుమన్, సుజాత కుమార్, సుహాసిని తారాగణం, సెయింట్, దేవిస్ & ఇతర సంగీతం స్క్రీన్ ప్లే & దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట & అనిల్ సుంకర, సమర్పణ: సాయి కొర్రపాటి.
ఒక అమెరికన్ పారానార్మల్ బృందం వేల్స్‌లోని అపఖ్యాతి పాలైన మార్గమ్ కోటను పరిశోధిస్తుంది, కానీ దాని వెంటాడే గోడలలో దాగి ఉన్న ప్రతీకార ఆత్మలను మేల్కొల్పినప్పుడు వారి పరిశోధన ఒక పీడకలగా మారుతుంది.
బొలీవియన్ అడవిలోకి ట్రెక్కింగ్ కోసం గైడ్‌తో స్నేహితుల బృందం లోతైన అడవిలోకి గైడ్‌ను అనుసరిస్తుంది.కానీ వారి సాహసం ప్రకృతిని, భయాన్ని తట్టుకుని నిలబడటానికి పోరాటంగా మారుతుంది మరియు సహాయం లేకుండా పోతుంది.
IMDb రేటింగ్: 6.7/10
Featured
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
IMDb రేటింగ్: 8.8/10
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది. క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్‌గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. “బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను.” అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) — అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.
సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.
శ్రీనగర్ లో కల్నల్ రాయప్ప నేతృత్వంలో వాసిం ఖాన్ అనే కాశ్మీరీ తీవ్రవాదిని పట్టుకుంటారు. తమిళనాడులో తెన్‌కాశి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరిలో రోజా అనే 18 ఏళ్ళ అమాయకమైన యువతి నివసిస్తూ ఉంటుంది. ఆమె అక్కకు భారత నిఘా సంస్థ అయిన రా లో క్రిప్టాలజిస్టుగా పనిచేసే రిషికుమార్ అనే వ్యక్తితో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్ళి చూపులు నిర్విఘ్నంగా జరిగిపోవాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. కానీ రోజా అక్క మాత్రం తన మామ కొడుకునే ప్రేమిస్తూ ఉంటుంది. పెళ్ళి చూపుల్లో ధైర్యం చేసి రిషి కుమార్ కి తన ప్రేమ విషయం చెప్పి అందరి ముందు తను నచ్చలేదని చెప్పమంటుంది. అందుకు రిషి కుమార్ కూడా అంగీకరిస్తాడు. రిషికుమార్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ రోజాను పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అక్క ప్రేమ గురించి తెలియని రోజా అయిష్టంగానే పెళ్ళికి అంగీకరిస్తుంది. ఆమె అక్కకి తన బావతో పెళ్ళి చేస్తారు. రిషి కుమార్, రోజా కలిసి మద్రాసులో కాపురం పెడతారు. మొదట్లో రిషి చేసిన పని ఆమెకు నచ్చకపోయినా, తర్వాత అక్క ప్రేమకథ గురించి తెలుసుకుని, రిషిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది.
రిషికుమార్ కి ఒక ఆర్మీ కమ్యూనికేషన్ సెంటర్‌లో ఉద్యోగం కేటాయించబడుతుంది. రిషిని ఉగ్రవాదులు అపహరించినప్పుడు రోజా (మధుబాల) ప్రపంచం ముక్కలైపోతుంది.రోజా ఎలా పోరాడి తన భర్తను తిరిగి పొందుతుంది అనేది మిగిలిన కథ.
IMDb రేటింగ్: 8.1/10
రవితేజ ఒక పారిశ్రామికవేత్త, అతనికి వస్త్ర కంపెనీ ఉంది. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి, కానీ అతని వ్యక్తిగత జీవితంలో సామరస్యం మరియు శాంతి లేదు. అతని భార్య మరియు ఆమె తల్లి హింసించడంతో, అతను జీవితాన్ని దుర్భరంగా భావిస్తాడు. అతను నెమ్మదిగా తన అందమైన పర్సనల్ అసిస్టెంట్ ప్రియంవదను ప్రేమిస్తాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాన్ని తట్టుకోలేరు మరియు అతను మరొక వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడ, అతను చిన్న దొంగ అయిన నాగరాజును కలుస్తాడు. నాగరాజు రవితేజను కాపాడతాడు మరియు అతను వారి స్థానాలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తాడు, తద్వారా అతని సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడతాయి. నాగరాజు దీనికి అంగీకరిస్తాడు మరియు మాధవికి, ఆమె తల్లికి మరియు రవితేజ శత్రువులకు ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ దొంగ జీవనశైలిని నడిపించే వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను సీతను ఎదుర్కొంటాడు, ఆమె కూడా చిన్న దొంగ. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు మరియు కథను సంతోషంగా ముగించారు.
సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో ఎమ్మెస్ చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. రాజీకి ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రతో పెళ్ళి నిశ్చయం అవుతుంది. రాజీ కూడా బావను కాదని రవీంద్ర వైపే మొగ్గు చూపుతుంది. అందరూ కలిసి పడవలో గోదావరి నది మీద భద్రాచలం ప్రయాణమవుతారు. పెళ్ళి సంబంధం కుదరకపోవడంతో సీత కూడా అదే పడవలో బయలు దేరుతుంది. అక్కడ రాము పద్ధతిని చూసి అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. రాజీ మీద అతనికున్న అభిమానాన్ని తెలుసుకుంటుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఆమె సరిపోదని, తానే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో రవీంద్ర ధోరణిని గమనించిన రాజీ, మళ్ళీ రామునే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రాము ఒప్పుకుంటున్నట్లుగా నటించి సీతను తాను ఒక చోటుకి తీసుకురమ్మని చెబుతాడు. కానీ రాము మాత్రం అక్కడికి రాడు. రాజీ రవీంద్రనే పెళ్ళి చేసుకుంటానని మనసు మార్చుకుంటుంది. సీత మాత్రం రాము మనసులో తాను లేనని తెలుసుకుని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుంది. రాము సీత పడవలో మరిచిపోయిన డైరీ చదివి ఆమె తనను ప్రేమించిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
IMDb రేటింగ్: 7.9/10
మౌన రాగం సినిమా దివ్య (రేవతి) అనే కాలేజీ విద్యార్థిని కథను అనుసరిస్తుంది, ఆమె స్వేచ్ఛాయుత వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పటికీ ఆమె మాజీ ప్రేమికుడు మనోహర్ (కార్తీక్) మరణంతో ఇప్పటికీ దుఃఖంలో ఉంది. ఆమె కుటుంబం చంద్రకుమార్ (మోహన్) తో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుంది. తన కొత్త వివాహంతో రాజీ పడటానికి మరియు తన గతాన్ని వదులుకోలేక పోతున్న దివ్య అంతర్గత సంఘర్షణను ఈ సినిమా అన్వేషిస్తుంది. IMDb రేటింగ్ : 8.4/10
Featured
ఈ చిత్రం స్వతంత్ర జీవితాన్ని గడిపే అంధ వయోలిన్ విద్వాంసుడు రఘు (కమల్ హాసన్) పై కేంద్రీకృతమై ఉంది. అతను నాన్సీ (మాధవి) అనే స్త్రీని కలుస్తాడు, ఆమె అతని కథకు ఆకర్షితురాలై అతని గురించి రాయాలని నిర్ణయించుకుంటుంది. వారి సంబంధం ప్రేమగా మారుతుంది, కానీ వారు కలిసి ఉండటానికి కుటుంబ మరియు సామాజిక అడ్డంకులను అధిగమించాలి.
అమావాస్య చంద్రుడు 1981లో విడుదలైన తెలుగు భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం, దీనిని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. దీనిని ఏకకాలంలో తమిళంలో “రాజా పార్వై” పేరుతో చిత్రీకరించి విడుదల చేశారు, ఇది కమల్ హాసన్ నటుడిగా 100వ చిత్రం మరియు నిర్మాతగా అతని మొదటి చిత్రం.

Featured TV Series

Featured
, 2015 to 2016 – 2016

Chicago Med

An emotional thrill ride through the day-to-day chaos of the city’s most explosive hospital and the courageous team of doctors who hold it together.

Featured

Almost two years after a virus wiped out most of the human race, Phil Miller only wishes for some company, but soon gets more than he bargained for when that company shows up in the form of other survivors.

Hot Premieres