థ్రిల్లర్
అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందని, వాటిని సొంతం చేసుకోవడానికి హిట్లర్ కూడా ప్రయత్నించాడనే ఓ ప్రచారం ఉంది. అందుకు చారిత్రక ఆధారాలైతే లేవు. అలాంటి విలువైన జ్ఞాన గ్రంథాలు దుష్ట ఆలోచనలు ఉన్న ఒక మనిషి చేతిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుంది? మన ఇతిహాసాల సాయంతో అలాంటి వ్యక్తిని ఆపగలమా? అనే అంశాలతో సాగే కథే ‘మిరాయ్’ అంటున్నారు యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా , మంచు మనోజ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
IMDb రేటింగ్ :
IMDb రేటింగ్: 6.4/10
IMDb రేటింగ్: 7.3/10
IMDb రేటింగ్ : 6.2/10
విక్రమ్ వెతుక్కొంటూ వచ్చిన డాక్టర్ అను ఎవరు? డాక్టర్ అను ఎలా మరణించింది? గ్రామానికి అను ఎందుకు వచ్చింది? ఎస్ఐ కూతురు అనుతో విక్రమ్ ఎలా ప్రేమలో పడ్డాడు? మారేడుకోనలో పెద్దిరెడ్డి అధిపత్యం, అక్రమాలు ఎలా కొనసాగాయి? అను మరణం వెనుక అసలు కారణాన్ని విక్రమ్ తెలుసుకొన్నాడా? అను మృతికి కారణమైన వ్యక్తికి విక్రమ్ ఎలాంటి శిక్షను వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే అన్వేషి సినిమా కథ.
IMDb రేటింగ్: 6.3 / 10
ఈ భావోద్వేగ థ్రిల్లర్ ప్రేమ, మానసిక సంఘర్షణ మరియు రహస్యం యొక్క అంశాలను అందంగా మిళితం చేస్తుంది. పొరలు తొలగిపోతున్నప్పుడు, వీక్షకుడు ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడు: నిజమైన మనిషి ఎవరు - లూకా లేదా జానీ?
IMDb రేటింగ్ : 6.9/10
IMDb రేటింగ్: 6.7/10
గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్‌గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు. ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్‌గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్‌ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు.
IMDb రేటింగ్ : 6.3/10
రిషికుమార్ కి ఒక ఆర్మీ కమ్యూనికేషన్ సెంటర్‌లో ఉద్యోగం కేటాయించబడుతుంది. రిషిని ఉగ్రవాదులు అపహరించినప్పుడు రోజా (మధుబాల) ప్రపంచం ముక్కలైపోతుంది.రోజా ఎలా పోరాడి తన భర్తను తిరిగి పొందుతుంది అనేది మిగిలిన కథ.
IMDb రేటింగ్: 8.1/10
అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక ఓ పెద్ద నెట్‌వర్క్ ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు బిహార్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్తాడు. ఆ కేస్ కొలిక్కి వచ్చేలోపు అర్జున్ విశాఖకి బదిలీ అవుతాడు. అక్కడికి వచ్చాక కూడా ఈ కేస్‌ని ఛేదించేందుకు ఏం చేశాడు? వరుసగా జరుగుతున్న ఈ హత్యల వెనుక దాగిన చీకటి కోణాలేమిటి?వాటిని చేయిస్తున్నది ఎవరు? ఆయనకీ మృదుల (శ్రీనిధి)కీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. IMDb రేటింగ్: 6.9/10

















