అభి(రాహుల్ విజయ్) ఒక సాధారణమైన, నిష్కపటమైన వ్యక్తి, అతను సూర్యకాంతం (నిహారిక) అనే ముద్దుగుమ్మను ప్రేమిస్తాడు. అతను ఆమెకు ప్రేమను ప్రపోజ్ చేస్తాడు.కానీ నిబద్ధత-భయం ఉన్న సూర్యకాంతం అభిని అన్నింటికీ మధ్యలో వదిలేసి కనిపించకుండా పోతుంది.ఒక సంవత్సరం గడిచిపోతుంది, అభి తన జీవితాన్ని కొనసాగించి పూజను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, సూర్యకాంతం అభి జీవితంలోకి తిరిగి వచ్చి పరిస్థితులను తలక్రిందులు చేస్తుంద.అభి ఇప్పుడు ఏమి చేస్తాడు? చివరికి అతను ఎవరిని వివాహం చేసుకుంటాడు? సమాధానాలు తెలుసుకోవడానికి సినిమా చూడండి. IMDb రేటింగ్: 5.2/10
విడుదల తేదీ: 02 జూన్,2016
అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో బతికే అనసూయకు ఈ జీవితం బోరింగ్‌గా కనిపిస్తూంటుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది.
కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. IMDb రేటింగ్ : 6.8/10
రఘునందన్ (బొమన్ ఇరానీ) ఇటలీలో ఒక పెద్ద వ్యాపారవేత్త. లక్ష కోట్ల పైచిలుకు ఆస్తి ఉన్నా తన కూతురు సునంద (నదియా) తనతో ఉండకపోవటం రఘునందన్ మనసుని కలచివేస్తుంటుంది. సునంద రఘు ఇష్టానికి వ్యతిరేకంగా రాజశేఖర్ (రావు రమేశ్) అనే ప్లీడరుని పెళ్ళి చేసుకుంటుంది. అందుకు ప్రతీకారచర్యగా రఘు వారిద్దరినీ ఇంటినుంచి వెళ్ళగొడతాడు. రఘు మనవడు గౌతం నందా (పవన్ కళ్యాణ్) ఇదంతా గమనించి రఘు రాబోయే పుట్టినరోజు సునంద, శేఖర్ మరియూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటావని మాటిస్తాడు.
There are no reviews yet.