పోకిరి
పూరీ మాస్ ట్రీట్‌మెంట్‌కి మహేష్ క్లాస్ యాక్షన్ కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్'పోకిరి'సినిమా.పండు(మహేష్‌బాబు)కిరాయి గుండా.'నేనెంత వెధవనో నాకే తెలియదు' అని అంటూ ఒప్పుకున్న పనులను ఎంద మంది ఎదురొచ్చినా సునాయసంగా పూర్తి చేస్తూ వుంటాడు హీరో.శృతి(ఇలియానా) ఎరోబిక్ టీచర్.తండ్రిలేని కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొస్తూ వుంటుంది.పశుపతి(ఆశీష్ విద్యార్థి) అనే పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆమెపై కన్నేసి వెంటపడుతూ వుంటే పండు అండతో తప్పించుకుంటుంది. తర్వాత ప్రేమలో పడి పాటలు పాడుతూ వుంటుంది. మరో పక్క పండు రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి లోకల్ మాఫియా దగ్గర పనిచేస్తూ పక్క గ్రూప్‌తో తగువు పడతాడు. వాళ్లు అతనిపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా సిటీకి కొత్తగా వచ్చిన పోలీసు అధికారి (సాయాజి షిండే) ఈ గ్రూప్‌లను అణచేయాలని అనుకుంటూ వుంటాడు. పండు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు,ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది తెరపై చూడాల్సిందే.ప్రత్యేకంగా పోకిరిగా మహేష్ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.
Cast & Crew
Directing
పూరీ జగన్నాధ్
Camera
శ్యామ్ కె నాయుడు
Sound
మణిశర్మ
Editing
మార్తాండ్ కె వెంకటేష్
Fun Facts of Movie
- ‘పోకిరి’ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.10కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం.. రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
- పూరి తన తొలి చిత్రం ‘బద్రి’ కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్‌ను రాసుకున్నారట. తొలుత ఈ కథకు హీరోగా అనుకున్నది మహేష్‌ను కాదు.. రవితేజని. ఈ చిత్రాన్ని ఆయనతోనే ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ’ అనే టైటిల్‌తో తెరపైకి తీసుకొద్దామని అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు
- ఈ చిత్రంలో కథానాయిక పాత్రకి తొలుత అనుకున్నది అయేషా టకియాని. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ పాత్రను వదులుకుంది. తర్వాత ఆ అవకాశాన్ని కంగనా రనౌత్ దక్కించుకుంది. ఈ చిత్ర ఆడిషన్స్ ముంబయిలో జరుగుతున్న సమయంలో.. అక్కడే బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’కూ ఆడిషన్స్ జరిగాయట. దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగన.. పనిలో పనిగా ‘పోకిరి’ చిత్రానికీ ఆడిషన్స్ ఇచ్చింది. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ, కంగనాకు ఈ రెండు చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో ఆ అవకాశం కాస్తా ఇలియానాకు దక్కింది.
- ‘పోకిరి’ చిత్రంతో మహేష్‌ను తొలిసారి ఊర మాస్ యాంగిల్‌లో చూపించారు పూరి. ఆయన మహేష్‌కు కథ చెబుతున్నప్పుడే జుత్తు బాగా పెంచాలి.. లైట్‌గా మీసం, గెడ్డంతో ఉండాలని చెప్పేశారట. జుత్తు కత్తిరించుకోకుండా సరికొత్త లుక్‌లోకి మారారు ఆయన.
- ఈ చిత్రంలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో కొత్త ట్రెండ్ అయింది.
- ఇక పూరి రాసిన సంభాషణలు మహేశ్ చెబుతుంటే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ నరనరాల్లోకి ఎక్కేశాయి.
- మణిశర్మ పాటలు ఓ ఊపు ఊపేశాయి.
- అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ టీవీ వచ్చిన ప్రతిసారి ‘పోకిరి’ ప్రసారమవుతుంటే ఛానల్ మార్చకుండా చూసేవాళ్లు కచ్చితంగా ఉన్నారు.. ఉంటారు..! దటీజ్ ‘పండుగాడు’
IMDb రేటింగ్ : 8.0/10







There are no reviews yet.