Telugu film
టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పూర్తి కథ కోసం లింక్
IMDb రేటింగ్: 8/10
మౌన రాగం సినిమా దివ్య (రేవతి) అనే కాలేజీ విద్యార్థిని కథను అనుసరిస్తుంది, ఆమె స్వేచ్ఛాయుత వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పటికీ ఆమె మాజీ ప్రేమికుడు మనోహర్ (కార్తీక్) మరణంతో ఇప్పటికీ దుఃఖంలో ఉంది. ఆమె కుటుంబం చంద్రకుమార్ (మోహన్) తో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుంది. తన కొత్త వివాహంతో రాజీ పడటానికి మరియు తన గతాన్ని వదులుకోలేక పోతున్న దివ్య అంతర్గత సంఘర్షణను ఈ సినిమా అన్వేషిస్తుంది.
IMDb రేటింగ్ : 8.4/10
Featured
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
IMDb రేటింగ్: 8.8/10

నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.
క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్‌గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.