Pratinidhi 2
నిజాన్ని నిర్భ‌యంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్ట్ చే అలియాస్ చేత‌న్ (నారా రోహిత్‌). చిన్న‌ప్పుడు త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆయ‌న గ‌మ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసే చేత‌న్‌ని ఎన్‌.ఎన్‌.సి ఛాన‌ల్ ఏరికోరి సీఈఓగా నియ‌మిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ని చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్ర‌భావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
శ్రీనగర్ లో కల్నల్ రాయప్ప నేతృత్వంలో వాసిం ఖాన్ అనే కాశ్మీరీ తీవ్రవాదిని పట్టుకుంటారు. తమిళనాడులో తెన్‌కాశి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరిలో రోజా అనే 18 ఏళ్ళ అమాయకమైన యువతి నివసిస్తూ ఉంటుంది. ఆమె అక్కకు భారత నిఘా సంస్థ అయిన రా లో క్రిప్టాలజిస్టుగా పనిచేసే రిషికుమార్ అనే వ్యక్తితో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్ళి చూపులు నిర్విఘ్నంగా జరిగిపోవాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. కానీ రోజా అక్క మాత్రం తన మామ కొడుకునే ప్రేమిస్తూ ఉంటుంది. పెళ్ళి చూపుల్లో ధైర్యం చేసి రిషి కుమార్ కి తన ప్రేమ విషయం చెప్పి అందరి ముందు తను నచ్చలేదని చెప్పమంటుంది. అందుకు రిషి కుమార్ కూడా అంగీకరిస్తాడు. రిషికుమార్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ రోజాను పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అక్క ప్రేమ గురించి తెలియని రోజా అయిష్టంగానే పెళ్ళికి అంగీకరిస్తుంది. ఆమె అక్కకి తన బావతో పెళ్ళి చేస్తారు. రిషి కుమార్, రోజా కలిసి మద్రాసులో కాపురం పెడతారు. మొదట్లో రిషి చేసిన పని ఆమెకు నచ్చకపోయినా, తర్వాత అక్క ప్రేమకథ గురించి తెలుసుకుని, రిషిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది.
రిషికుమార్ కి ఒక ఆర్మీ కమ్యూనికేషన్ సెంటర్‌లో ఉద్యోగం కేటాయించబడుతుంది. రిషిని ఉగ్రవాదులు అపహరించినప్పుడు రోజా (మధుబాల) ప్రపంచం ముక్కలైపోతుంది.రోజా ఎలా పోరాడి తన భర్తను తిరిగి పొందుతుంది అనేది మిగిలిన కథ.
IMDb రేటింగ్: 8.1/10
సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.

Showing all 3 results