పొలిటికల్
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే చేతన్‌ని ఎన్.ఎన్.సి ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!





