మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే.
ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది.
IMDb రేటింగ్: 7/10
Rotten Tamatoes : 64%
రహస్యం, డైనమిక్స్ మరియు ఇతిహాసాల స్ఫూర్తితో నిండిన యాక్షన్-అడ్వెంచర్. ప్రధాన పాత్రధారి, పురావస్తు శాస్త్రవేత్త జాక్ వైల్డర్, పురాతన కళాఖండాల కోసం అన్వేషణలో సంభవించే ఒక మర్మమైన పేలుడులో తన సన్నిహిత స్నేహితుడిని కోల్పోతాడు. ఈ విషాదాన్ని అంగీకరించలేక, జాక్ దక్షిణ అమెరికాకు గోల్డెన్ క్యాలెండర్ టాబ్లెట్‌ను కనుగొనడానికి ప్రమాదకరమైన యాత్రకు బయలుదేరాడు - పురాణాలు మరియు సాహసికుల దురాశతో కప్పబడిన ఎల్ డొరాడో నగరాన్ని కనుగొనడానికి ఇది కీలకం.
అతని మార్గం అడవి, ఉచ్చులు, దేశద్రోహులు మరియు పురాతన శిథిలాల గుండా ఉంది. ప్రతి అడుగులోనూ అతను మనుగడ కోసం పోరాడటమే కాకుండా, తాను ఎవరిని విశ్వసించవచ్చో కూడా కనుగొనాలి. పురాణ బంగారం కోసం అన్వేషణలో, అతను చాలా విలువైనదాన్ని కనుగొంటాడు - స్నేహం, గౌరవం మరియు గతం గురించి నిజం. ఇండియానా జోన్స్ సాహసాల స్ఫూర్తితో, ఉద్రిక్త వాతావరణం, వేగవంతమైన సంఘటనలు మరియు పురాతన నాగరికతల దృశ్యపరంగా గొప్ప ప్రపంచంతో నిధి కోసం శోధించడం గురించి ఇది ఒక క్లాసిక్ కథ.
IMDB రేటింగ్: 5/10

స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10

 

గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్‌గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు. ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్‌గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్‌ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు.
IMDb రేటింగ్ : 6.3/10

పూరీ మాస్‌ ట్రీట్‌మెంట్‌కి మహేష్‌ క్లాస్‌ యాక్షన్‌ కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్‌'పోకిరి'సినిమా.పండు(మహేష్‌బాబు)కిరాయి గుండా.'నేనెంత వెధవనో నాకే తెలియదు' అని అంటూ ఒప్పుకున్న పనులను ఎంద మంది ఎదురొచ్చినా సునాయసంగా పూర్తి చేస్తూ వుంటాడు హీరో.శృతి(ఇలియానా) ఎరోబిక్‌ టీచర్‌.తండ్రిలేని కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొస్తూ వుంటుంది.పశుపతి(ఆశీష్‌ విద్యార్థి) అనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆమెపై కన్నేసి వెంటపడుతూ వుంటే పండు అండతో తప్పించుకుంటుంది. తర్వాత ప్రేమలో పడి పాటలు పాడుతూ వుంటుంది. మరో పక్క పండు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరించి లోకల్‌ మాఫియా దగ్గర పనిచేస్తూ పక్క గ్రూప్‌తో తగువు పడతాడు. వాళ్లు అతనిపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా సిటీకి కొత్తగా వచ్చిన పోలీసు అధికారి (సాయాజి షిండే) ఈ గ్రూప్‌లను అణచేయాలని అనుకుంటూ వుంటాడు. పండు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు,ఎలా రియాక్ట్‌ అయ్యాడు అన్నది తెరపై చూడాల్సిందే.ప్రత్యేకంగా పోకిరిగా మహేష్‌ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.
సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో ఎమ్మెస్ చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. రాజీకి ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రతో పెళ్ళి నిశ్చయం అవుతుంది. రాజీ కూడా బావను కాదని రవీంద్ర వైపే మొగ్గు చూపుతుంది. అందరూ కలిసి పడవలో గోదావరి నది మీద భద్రాచలం ప్రయాణమవుతారు. పెళ్ళి సంబంధం కుదరకపోవడంతో సీత కూడా అదే పడవలో బయలు దేరుతుంది. అక్కడ రాము పద్ధతిని చూసి అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. రాజీ మీద అతనికున్న అభిమానాన్ని తెలుసుకుంటుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఆమె సరిపోదని, తానే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో రవీంద్ర ధోరణిని గమనించిన రాజీ, మళ్ళీ రామునే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రాము ఒప్పుకుంటున్నట్లుగా నటించి సీతను తాను ఒక చోటుకి తీసుకురమ్మని చెబుతాడు. కానీ రాము మాత్రం అక్కడికి రాడు. రాజీ రవీంద్రనే పెళ్ళి చేసుకుంటానని మనసు మార్చుకుంటుంది. సీత మాత్రం రాము మనసులో తాను లేనని తెలుసుకుని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుంది. రాము సీత పడవలో మరిచిపోయిన డైరీ చదివి ఆమె తనను ప్రేమించిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
IMDb రేటింగ్: 7.9/10
శ్రీను(నాగార్జున) ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు(టబు) అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.
శ్రీరామ్ (వెంకటేష్) మరియు సీత (సౌందర్య) లకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. తన భార్య పిల్లలను కనలేదని డాక్టర్ ద్వారా శ్రీరామ్ తెలుసుకుంటాడు, అతను తన భార్య మనోభావాలను దెబ్బతీయడానికి ఇష్టపడడు, తనపైనే నిందలు వేస్తాడు. శ్రీరామ్ తండ్రి (కోట శ్రీనివాసరావు) పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి, శ్రీరామ్‌ను రెండవ వివాహం చేసుకోవాలని ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. నేపాల్ వ్యాపార పర్యటనలో ఉన్నప్పుడు, అతను నేపాలీ అమ్మాయి మనీషా (వినీత)ను కొన్ని అనివార్య పరిస్థితులలో వివాహం చేసుకుంటాడు. ఆమె తన బిడ్డను మోస్తున్నట్లు తెలుసుకున్న శ్రీరామ్, ఆమె స్నేహితుడు గిరి (బ్రహ్మానందం) ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తాడు. మనీషా ఒక అబ్బాయిని ప్రసవిస్తుంది మరియు శ్రీరామ్ తన భార్య అనుమతితో అతన్ని దత్తత తీసుకుంటాడు, అతనికి నిజం తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామ్ తండ్రి గిరి ద్వారా నిజం తెలుసుకుంటాడు, శ్రీరామ్ మనీషాను తిరిగి తీసుకురావాలని మరియు సీతకు విషయాలు చెప్పాలని కోరుకుంటాడు. కానీ సీత స్పందనకు భయపడిన శ్రీరామ్ తన తండ్రిని ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచమని వేడుకుంటాడు మరియు అతను మనీషాను తన ఇంటికి వంటమనిషిగా తీసుకువస్తాడు. సీత వంటగదిలో జరుగుతున్న పనులతో సంతోషంగా లేదు, ఆమె మనీషాను వేరొకరితో వివాహం చేయడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు శ్రీరామ్ రహస్యాన్ని వెల్లడిస్తుంది, సీత కూడా పరిస్థితులను మరియు పరిస్థితులను అర్థం చేసుకుంటుంది మరియు ఆమె సంతోషంగా మనీషాను వారి జీవితాల్లోకి స్వాగతిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడాలనుకుంటే లింక్
వాల్మీకి రామాయణం ఆధారంగా, ఈ చిత్రం జపాన్ నుండి మాంగా, యుఎస్ నుండి డిస్నీ మరియు భారతదేశం నుండి రవివర్మ అనే మూడు వేర్వేరు యానిమేషన్ పాఠశాలలను కలిగి ఉన్న ఫ్యూజన్ యానిమేషన్ శైలితో రూపొందించబడింది. ఇది "రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ" యొక్క అసలు ఇంగ్లీష్ వెర్షన్ యొక్క డిజిటల్ కాని రీమాస్టర్డ్ వీడియో, ఇది 1992 లో నిర్మించడానికి పూర్తయింది మరియు 1993 లో విడుదలైంది. డిజిటల్ గా రీమాస్టర్డ్ వెర్షన్ ఉన్న దేశాలకు ఈ వీడియో క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటుంది. ఈ యానిమేషన్ చిత్రం జపాన్ దేశం మరియు భారతదేశపు సంయుక్తంగా నిర్మించబడింది.
దర్శకులు : యుగో సాకో, రామ్ మోహన్, కోయిచి ససాకి
IMDb రేటింగ్ 9.1/10
అమెజాన్ ప్రైమ్ రేటింగ్ : 4.6/5
రోటెన్ టమోటాస్ రేటింగ్ : 96%
1462లో, ఒట్టోమన్ సామ్రాజ్యంపై తన పోరాటంలో విజయం సాధించిన వ్లాడ్ డ్రాక్యులా తిరిగి వచ్చి, తన ప్రియమైన భార్య ఎలిసబెటా ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొంటాడు, అతని శత్రువులు అతని మరణాన్ని తప్పుగా నివేదించిన తర్వాత. రొమేనియన్ ఆర్థోడాక్స్ చర్చికి చెందిన ఒక పూజారి అతనితో ఆత్మహత్య చేసుకున్నందుకు తన భార్య ఆత్మ నరకానికి పంపబడిందని చెబుతాడు. కోపంతో, వ్లాడ్ ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేసి, దేవుడిని త్యజించి, చీకటి శక్తులన్నింటినీ ఉపయోగించి ఎలిసబెటాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సమాధి నుండి లేస్తానని ప్రకటిస్తాడు. తరువాత అతను తన కత్తిని ప్రార్థనా మందిరంలోని రాతి శిలువపైకి గుచ్చుకుని, దాని నుండి ప్రవహించే రక్తాన్ని తాగుతాడు,రక్త పిశాచిగా మారుతాడు.
IMDb రేటింగ్: 7.4/10
Rotten Tomatoes: 69%
శ్రీనగర్ లో కల్నల్ రాయప్ప నేతృత్వంలో వాసిం ఖాన్ అనే కాశ్మీరీ తీవ్రవాదిని పట్టుకుంటారు. తమిళనాడులో తెన్‌కాశి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరిలో రోజా అనే 18 ఏళ్ళ అమాయకమైన యువతి నివసిస్తూ ఉంటుంది. ఆమె అక్కకు భారత నిఘా సంస్థ అయిన రా లో క్రిప్టాలజిస్టుగా పనిచేసే రిషికుమార్ అనే వ్యక్తితో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్ళి చూపులు నిర్విఘ్నంగా జరిగిపోవాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. కానీ రోజా అక్క మాత్రం తన మామ కొడుకునే ప్రేమిస్తూ ఉంటుంది. పెళ్ళి చూపుల్లో ధైర్యం చేసి రిషి కుమార్ కి తన ప్రేమ విషయం చెప్పి అందరి ముందు తను నచ్చలేదని చెప్పమంటుంది. అందుకు రిషి కుమార్ కూడా అంగీకరిస్తాడు. రిషికుమార్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ రోజాను పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అక్క ప్రేమ గురించి తెలియని రోజా అయిష్టంగానే పెళ్ళికి అంగీకరిస్తుంది. ఆమె అక్కకి తన బావతో పెళ్ళి చేస్తారు. రిషి కుమార్, రోజా కలిసి మద్రాసులో కాపురం పెడతారు. మొదట్లో రిషి చేసిన పని ఆమెకు నచ్చకపోయినా, తర్వాత అక్క ప్రేమకథ గురించి తెలుసుకుని, రిషిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది.
రిషికుమార్ కి ఒక ఆర్మీ కమ్యూనికేషన్ సెంటర్‌లో ఉద్యోగం కేటాయించబడుతుంది. రిషిని ఉగ్రవాదులు అపహరించినప్పుడు రోజా (మధుబాల) ప్రపంచం ముక్కలైపోతుంది.రోజా ఎలా పోరాడి తన భర్తను తిరిగి పొందుతుంది అనేది మిగిలిన కథ.
IMDb రేటింగ్: 8.1/10
సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.
ప్రముఖ రచయిత అకిరా కురోసావా రచించి దర్శకత్వం వహించిన డ్రీమ్స్ (1990), ఒక పౌరాణిక వాస్తవిక సంకలన చిత్రం, ఇది దర్శకుడి స్వంత పునరావృత దర్శనాలు మరియు జపనీస్ జానపద కథల అంశాల నుండి ప్రేరణ పొందిన ఎనిమిది మంత్రముగ్ధులను చేసే విగ్నేట్‌లను కలిపి అల్లుతుంది. ప్రతి భాగం అకిరా టెరావ్, మార్టిన్ స్కోర్సెస్, చిషు ర్యు, మీకో హరాడా మరియు మిత్సుకో బైషో వంటి ప్రతిభావంతులైన తారాగణం ద్వారా ప్రాణం పోసుకున్న ఒక అధివాస్తవిక ప్రపంచంలోకి దూసుకుపోతుంది. కురోసావా కలలలాంటి రాజ్యాలు విప్పుతున్నప్పుడు, అవి వెంటాడే అందాన్ని మరియు మానవ స్వభావం, సంప్రదాయం మరియు మనిషి మరియు ప్రకృతి మధ్య సున్నితమైన సమతుల్యతపై లోతైన ప్రతిబింబాలను సంగ్రహిస్తాయి.

IMDb రేటింగ్: 7.7/10
అమెజాన్ ప్రైమ్ లో చూడాలనుకుంటే లింక్
ఈ చిత్రంలో, ఒక అవినీతిపరుడైన మేయర్ తన "విశ్వసనీయ" సహాయకుడు మరియు అతని ఉంపుడుగత్తె చాలా కాలంగా తనపై కుట్ర చేస్తున్నారని తెలుసుకుని భ్రమపడిపోతాడు. తన సహాయకుడి నేర కార్యకలాపాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినప్పుడు, సహాయకుడు హఠాత్తుగా మేయర్‌ను హత్య చేస్తాడు. ఆ తర్వాత అతను మేయర్‌లా కనిపించే వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా నటించమని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అతని అనుకూలమైన తోలుబొమ్మ పాలకుడికి తనకంటూ ఒక ఎజెండా ఉంటుంది మరియు అతని కొత్త యజమానిపై క్రమం తప్పకుండా కుట్రలు పన్నుతూ ఉంటాడు.
IMDb రేటింగ్: 7.3/10

టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పూర్తి కథ కోసం లింక్
IMDb రేటింగ్: 8/10

రవితేజ ఒక పారిశ్రామికవేత్త, అతనికి వస్త్ర కంపెనీ ఉంది. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి, కానీ అతని వ్యక్తిగత జీవితంలో సామరస్యం మరియు శాంతి లేదు. అతని భార్య మరియు ఆమె తల్లి హింసించడంతో, అతను జీవితాన్ని దుర్భరంగా భావిస్తాడు. అతను నెమ్మదిగా తన అందమైన పర్సనల్ అసిస్టెంట్ ప్రియంవదను ప్రేమిస్తాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాన్ని తట్టుకోలేరు మరియు అతను మరొక వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడ, అతను చిన్న దొంగ అయిన నాగరాజును కలుస్తాడు. నాగరాజు రవితేజను కాపాడతాడు మరియు అతను వారి స్థానాలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తాడు, తద్వారా అతని సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడతాయి. నాగరాజు దీనికి అంగీకరిస్తాడు మరియు మాధవికి, ఆమె తల్లికి మరియు రవితేజ శత్రువులకు ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ దొంగ జీవనశైలిని నడిపించే వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను సీతను ఎదుర్కొంటాడు, ఆమె కూడా చిన్న దొంగ. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు మరియు కథను సంతోషంగా ముగించారు.
మౌన రాగం సినిమా దివ్య (రేవతి) అనే కాలేజీ విద్యార్థిని కథను అనుసరిస్తుంది, ఆమె స్వేచ్ఛాయుత వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పటికీ ఆమె మాజీ ప్రేమికుడు మనోహర్ (కార్తీక్) మరణంతో ఇప్పటికీ దుఃఖంలో ఉంది. ఆమె కుటుంబం చంద్రకుమార్ (మోహన్) తో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుంది. తన కొత్త వివాహంతో రాజీ పడటానికి మరియు తన గతాన్ని వదులుకోలేక పోతున్న దివ్య అంతర్గత సంఘర్షణను ఈ సినిమా అన్వేషిస్తుంది. IMDb రేటింగ్ : 8.4/10
Featured
ఈ చిత్రం స్వతంత్ర జీవితాన్ని గడిపే అంధ వయోలిన్ విద్వాంసుడు రఘు (కమల్ హాసన్) పై కేంద్రీకృతమై ఉంది. అతను నాన్సీ (మాధవి) అనే స్త్రీని కలుస్తాడు, ఆమె అతని కథకు ఆకర్షితురాలై అతని గురించి రాయాలని నిర్ణయించుకుంటుంది. వారి సంబంధం ప్రేమగా మారుతుంది, కానీ వారు కలిసి ఉండటానికి కుటుంబ మరియు సామాజిక అడ్డంకులను అధిగమించాలి.
అమావాస్య చంద్రుడు 1981లో విడుదలైన తెలుగు భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం, దీనిని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. దీనిని ఏకకాలంలో తమిళంలో "రాజా పార్వై" పేరుతో చిత్రీకరించి విడుదల చేశారు, ఇది కమల్ హాసన్ నటుడిగా 100వ చిత్రం మరియు నిర్మాతగా అతని మొదటి చిత్రం.
Featured
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
IMDb రేటింగ్: 8.8/10
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది. క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్‌గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.
Featured
షోలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది! భారతదేశంలో అత్యంత పురాణ చిత్రంగా నిలిచిన ఐదు దశాబ్దాల వేడుక! షోలే (1975) మనకు ఐకానిక్ పాత్రలు, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు నేటికీ ఉదహరించబడే సంభాషణలను అందించింది. బాలీవుడ్ కథను రూపొందించిన ఈ చిత్రం, తరతరాలుగా చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిస్తూ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రామ్‌గఢ్ గ్రామంలో,రిటైర్డ్ పోలీస్ చీఫ్ ఠాకూర్ బల్దేవ్ సింగ్(సంజీవ్ కుమార్)పేరుమోసిన బందిపోటు గబ్బర్ సింగ్(అమ్జాద్ ఖాన్)ను అంతం చేయడానికి పథకం వేసి ఇద్దరు చిన్న నేరస్థులు, జై(అమితాబ్ బచ్చన్) మరియు వీరు(ధర్మేంద్ర) సహాయం తీసుకుంటాడు. అయితే, గబ్బర్ గ్రామంపై దాడి చేసినప్పుడు, జై మరియు వీరు ఇద్దరు ఠాకూర్ తమకు సహాయం చేయడానికి ఎందుకు ఏమీ చేయలేదని ఆశ్చర్యపోతారు. అతని వద్ద ఆయుధాలు లేవని, గబ్బర్ నరికివేశాడని వారు త్వరలోనే తెలుసుకుంటారు.దీనితో ఆగ్రహించిన వారు, సహాయం చేయడానికి తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు, విజయం సాధిస్తారు. అమెజాన్ ప్రైమ్ లింక్
Featured
భాను చందర్ మరియు అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ తెలుగు చిత్రం "నిరీక్షణ" అనే కాలాతీత రొమాంటిక్ డ్రామాను చూడండి. లెజెండరీ బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ భావోద్వేగ ప్రేమకథ అద్భుతమైన నేపథ్యంలో సెట్ చేయబడింది.దాని మనోహరమైన సంగీతం, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు హత్తుకునే కథాంశానికి ప్రసిద్ధి చెందింది.
రఘునందన్ (బొమన్ ఇరానీ) ఇటలీలో ఒక పెద్ద వ్యాపారవేత్త. లక్ష కోట్ల పైచిలుకు ఆస్తి ఉన్నా తన కూతురు సునంద (నదియా) తనతో ఉండకపోవటం రఘునందన్ మనసుని కలచివేస్తుంటుంది. సునంద రఘు ఇష్టానికి వ్యతిరేకంగా రాజశేఖర్ (రావు రమేశ్) అనే ప్లీడరుని పెళ్ళి చేసుకుంటుంది. అందుకు ప్రతీకారచర్యగా రఘు వారిద్దరినీ ఇంటినుంచి వెళ్ళగొడతాడు. రఘు మనవడు గౌతం నందా (పవన్ కళ్యాణ్) ఇదంతా గమనించి రఘు రాబోయే పుట్టినరోజు సునంద, శేఖర్ మరియూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటావని మాటిస్తాడు.

Showing 49–72 of 78 results