Featured

అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందని, వాటిని సొంతం చేసుకోవడానికి హిట్లర్‌ కూడా ప్రయత్నించాడనే ఓ ప్రచారం ఉంది. అందుకు చారిత్రక ఆధారాలైతే లేవు. అలాంటి విలువైన జ్ఞాన గ్రంథాలు దుష్ట ఆలోచనలు ఉన్న ఒక మనిషి చేతిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుంది? మన ఇతిహాసాల సాయంతో అలాంటి వ్యక్తిని ఆపగలమా? అనే అంశాలతో సాగే కథే ‘మిరాయ్‌’ అంటున్నారు యువ దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా , మంచు మనోజ్‌ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల విజువల్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
IMDb రేటింగ్ :

మిరాయ్ సినిమా రివ్యూల సమాహారం లింకులు
Featured
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే కథ ఇది. అక్కడి ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే.. దాన్ని వాళ్లు తమ బాస్‌ మహావీర్‌ (జిషు సేన్‌ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్‌ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్‌ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు - షీలావతి కలిసి మొదలు పెట్టిన ఆ వ్యాపారం వాళ్లని ఎన్ని చిక్కుల్లో పడేసింది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.
త‌మిళ‌నాడులో తుపాకీ సంస్కృతిని అల‌వాటు చేసి సొమ్ము చేసుకోవాల‌నేది ఒక సిండికేట్ ప‌న్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్(షబీర్ కల్లరక్కల్) అనే ఇద్ద‌రు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్ర‌క్కుల‌కొద్దీ ఆయుధాల్ని త‌ర‌లిస్తుంది.అవ‌న్నీ ఓ ఫ్యాక్ట‌రీకి చేరుతుండ‌గా ఎన్‌.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేన‌న్‌) నేతృత్వంలోని ఎన్‌.ఐ.ఏ ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్ట‌రీ మొత్తాన్ని పేల్చివేయాల‌నే ఒక ఆప‌రేష‌న్‌కి న‌డుం బిగిస్తుంది ఎన్‌.ఐ.ఎ. అయితే ఈ ఆప‌రేష‌న్ అంత సుల‌భమైన‌దేమీ కాదు. ఒక‌రి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న ర‌ఘురామ్ (శివ‌కార్తికేయ‌న్‌)ను ప్రేమ్‌నాథ్ క‌లుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్క‌చేయ‌ని ర‌ఘురామ్‌ని ఈ ఆప‌రేష‌న్‌లోకి తీసుకు రావాల‌ని  నిర్ణ‌యిస్తాడు. మ‌రి ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యిందా? అస‌లు ర‌ఘురామ్ ఎవ‌రు?అత‌నికి ప్రాణాలంటే లెక్క‌లేని త‌నం ఎందుకు? మాల‌తి (రుక్మిణీ వ‌సంత్‌)తో అత‌నికి ఉన్న సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.
Featured
ఈటీవీ విన్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌స్తున్న మొట్ట మొద‌టి థియేట్రిక‌ల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ‘90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్‌’తో యువతకు చేరువైన మౌళి త‌నూజ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య హ‌స‌న్ దీనికి నిర్మాత కావ‌డం విశేషం. అఖిల్ (మౌళి త‌నూజ్‌) చ‌దువుల్లో అంతంత మాత్ర‌మే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాల‌నుకుంటాడు. కానీ, తండ్రి గోపాల‌రావు (రాజీవ్ క‌న‌కాల‌) మాత్రం లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయ‌ని (శివానీ నాగారం)ది కూడా అదే క‌థే. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే. తమ కూతురిని కూడా డాక్ట‌ర్‌గా చూడాల‌నేది వాళ్ల ల‌క్ష్యం. అందుకే కాత్యాయ‌ని కూడా ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్క‌డే అఖిల్‌, కాత్యాయ‌ని ప‌రిచ‌యమవుతారు. ఆ ప‌రిచ‌యం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ త‌న మ‌న‌సులో మాటని బ‌య‌ట పెడ‌తాడు. అప్పుడు కాత్యాయ‌ని త‌నకు సంబంధించిన ఓ విష‌యాన్ని బ‌య‌ట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమ‌క‌థ‌లో ఓ పెద్ద మ‌లుపు. ఇంత‌కీ కాత్యాయ‌ని చెప్పిన ఆ విష‌యం ఏమిటి?వీళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌కి ఎదురైన స‌మ‌స్య ఏమిటి? ఆ ప్రేమ‌క‌థ కంచికి చేరిందా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్‌ హార్ట్స్‌ – సినిమా రివ్యూలు – లింకులు
తాజా యాక్షన్ సినిమా | తన సోదరులను కాపాడటానికి అన్నీ పణంగా పెడతాడు!
చంద్ర అలియాస్ నీలి (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఒక మిషన్‌లో ఆమె తృటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మూతోన్(మమ్ముట్టి వాయిస్) ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చిరిస్తాడు. దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్‌గా జీవిస్తుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ(నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుని ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ(శాండి మాస్టర్)కి చంద్రపై అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది..? అసలు చంద్ర ఎవరు..? సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు..? గతంలోని ఎలాంటి నిజాలు ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తాయి..? అనేది ఈ సినిమా కథ.
IMDb రేటింగ్: 8.5/10
సిద్ధార్థ్ (నారా రోహిత్‌) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. మూడు ప‌దుల వ‌య‌సు దాటిపోతున్నా స‌రే... అమ్మాయిల్లో త‌నకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ పెళ్లి సంబంధాల్ని తిర‌స్క‌రిస్తుంటాడు. స్కూల్‌లో త‌న‌కు సీనియ‌ర్ అయిన వైష్ణ‌వి (శ్రీదేవి విజ‌య్‌కుమార్‌)లో చూసిన ఆ ఐదు క్వాలిటీస్‌ తనకు కాబోయే భార్య‌లో ఉండాలనేది సిద్ధార్థ్ కోరిక‌. స్నేహితులు, కుటుంబ స‌భ్యులు ఎంత చెప్పినా అందులో రాజీప‌డ‌డు. తీరా ఉద్యోగరీత్యా విదేశాల‌కు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ఐరా (వృతి వాఘాని) సిద్ధార్థ్‌కి ఎదుర‌వుతుంది (Sundarakanda Review). తొలి ప‌రిచ‌యంలోనే ఆమెలో త‌న‌కు న‌చ్చే కొన్ని లక్షణాలను గ‌మ‌నిస్తాడు. దాంతో త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకొని మ‌రీ ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు త‌న కుటుంబంతో క‌లిసి ఐరా ఇంటికి వెళ్లాక అక్క‌డ ఎవరూ ఊహించని విషయం తెలుస్తుంది (Sundarakanda Story). అదేంటీ? చిన్న‌ప్పుడు స్కూల్‌లో తాను ఎంత‌గానో ఆరాధించిన వైష్ణ‌వికి సిద్ధార్థ్ ఎందుకు దూర‌మ‌య్యాడు? మ‌ళ్లీ ఆమె త‌న జీవితంలోకి తిరిగొచ్చాక ఏం జ‌రిగింది? అస‌లు సిద్ధార్థ్‌, ఐరా పెళ్లి జ‌రిగిందా? లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.
డతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. తాను ఆచారాన్ని తప్పలేదని వేడుకున్నా... ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. ఆచారం ప్రకారం ప్రాణాలైనా వదలాలి, లేదంటే తప్పు చేయలేదనైనా నిరూపించుకోవాలని కోరతారు ఊరి ప్రజలు. దాంతో సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సి వస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి?సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?  
కథేంటంటే.. కింగ్‌పిన్‌ లాజిస్టిక్స్‌ అధినేత సైమన్‌ (నాగార్జున) శక్తిమంతమైన డాన్‌. ప్రభుత్వం నుంచి వైజాగ్‌ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్‌ (సౌబిన్‌ షాహిర్‌). సైమన్‌కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్‌ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్‌ (సత్యరాజ్‌) కనిపెట్టిన మొబైల్‌ క్రిమేటర్‌ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్‌.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పని చేయమని కోరతాడు. లేదంటే అతని ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్‌)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ, అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్‌ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్‌) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి? పోర్టులో స్మగ్లింగ్‌ మాటున సైమన్‌ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి? దీనికి విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్‌ ఖాన్‌)కు దీనితో లింకేంటి? ఈ కథలో కాళేశ్‌ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్‌ (రచిత రామ్‌), అర్జున్‌ సైమన్‌ (కన్న రవి)లు ఎవరు? అన్నది చిత్ర కథ.
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి... పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.

ఓటీటీ స్ట్రీమింగ్‌ / సెప్టెంబర్ 4,2025 : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్‌). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్‌) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? అన్నది కీలకం.

కార్తీక మిస్సింగ్ కేసు అనేది ఒక ఉత్కంఠభరితమైన డ్రామా, ఇది తప్పిపోయిన అమ్మాయి కోసం డిటెక్టివ్ మరియు అతని బృందం వెతుకుతున్న తీరును అనుసరిస్తుంది. ఈ ప్రక్రియలో, కార్తీక గురించి వారికి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ఎవరు? ఆమె అధికారం మరియు ఆర్థిక దోపిడీకి ఎలా గురైంది? ఇప్పుడే కనుగొనండి.
IMDb రేటింగ్: 6.4/10
Pratinidhi 2
నిజాన్ని నిర్భ‌యంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్ట్ చే అలియాస్ చేత‌న్ (నారా రోహిత్‌). చిన్న‌ప్పుడు త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆయ‌న గ‌మ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసే చేత‌న్‌ని ఎన్‌.ఎన్‌.సి ఛాన‌ల్ ఏరికోరి సీఈఓగా నియ‌మిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ని చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్ర‌భావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికొనింగ్ కథ || మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ఈ కథ మొదలవుతుంది. ప్రపంచాన్ని సైతం శాసించే శక్తి గల ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాలను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ తాళాలు వాళ్లకు చిక్కకుండా ఎంఐ ఏజెంట్‌ ఈథన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌) దక్కించుకుంటాడు. అయితే, సముద్రగర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్‌ సబ్‌మెరైన్‌లో ఎంటిటీ ఒరిజినల్‌ సోర్స్‌ కోడ్‌ ఉంటుంది. దానిని కనిపెట్టి నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడమని అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్‌ (ఏంజెలా బాసెట్‌) ఈథన్‌కు వాయిస్‌ నోట్‌ పంపుతారు. ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీని అయినా నియంత్రించే శక్తిగల ఎంటిటీని నాశనం చేసేందుకు ఈథన్‌ హంట్‌ చేసిన సాహసం ఏంటి? కంటికి కనిపించని శత్రువుతో అతడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో ఎవరిని కోల్పోయాడు? అన్నది చిత్ర కథ.
IMDb రేటింగ్: 7.3/10
రామ్ అలియాస్ రాబిన్‌హుడ్ (నితిన్‌) ఎవ‌రూ లేని ఓ అనాథ. త‌న‌లాంటి తోటి పిల్ల‌ల‌తో క‌లిసి ఓ అనాథ శ‌ర‌ణాల‌యంలో ఆశ్ర‌యం పొందుతుంటాడు. ఆక‌లి, అవ‌స‌రాల కోసం నేరాల బాట పట్టిన రామ్‌.. తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శ‌ర‌ణాల‌యాల‌కి అండ‌గా నిలుస్తుంటాడు. పెరిగి పెద్ద‌య్యాక కూడా అదే బాట‌లోనే అతడి ప్ర‌యాణం కొన‌సాగుతుంది. బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్ట‌ర్ వ‌ర్ఘీస్ (షైన్ టామ్ చాకో) చేతికి చిక్కిన‌ట్లే చిక్కి త్రుటిలో త‌ప్పించుకున్న రామ్, కొన్నాళ్లు నేరాల‌బాట వీడి ఉద్యోగం చేయాల‌నుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) న‌డుపుతున్న ఇండియాస్ నంబ‌ర్‌వ‌న్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి, ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల‌) ర‌క్ష‌ణ బాధ్య‌త‌ల కోసం రంగంలోకి దిగుతాడు. అస‌లు ఎవ‌రీ నీరా వాసుదేవ్? ఆమె ఇండియాకి ఎందుకొచ్చింది?అంత‌ర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్ర‌గ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది?అపాయంలోఉన్న నీరా వాసుదేవ్‌కి రామ్ ర‌క్ష‌ణ క‌ల్పించాడా లేదా?అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 4.5/10
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేస్తుంటాడు. అతడి సంతానంలో పెద్ద కొడుకు అర్జున్(మొయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్ కారణంగా మందుకు బానిసగా మారుతాడు. ఇక రెండో కొడుకు సాయి(మోహిత్) ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అతడి కూతురు అనుపమ(యశస్విని) పద్దతిగా ఉంటూ మెదులుతుంది. అయితే, ఓ సందర్భంలో అనుపమకు సంబంధించి ఓ నిజం చుట్టుపక్కల వారికి తెలియడంతో అందరూ కృష్ణ కుమార్ అండ్ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. ఇంతకీ అనుపమ గురించి తెలిసిన నిజం ఏమిటి..? ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది..? కృష్ణ కుమార్ కొడుకుల భవిష్యత్తు ఏమవుతుంది..? అనేది సినిమా కథ.
IMDb రేటింగ్: 8.3/10
నిలే, అపరాధ భావనతో బాధపడుతున్న మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, రేడియో జాకీగా మారాడు. ఒక లైవ్ షోలో, తనను కిడ్నాప్ చేశారని ఒక అమ్మాయి నుండి అతనికి కాల్ వస్తుంది. మొదట్లో ఇది ఒక చిలిపి పని అని భావించిన అతను, త్వరలోనే అది నిజమని గ్రహించి, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రత్యక్ష ప్రసారం చేస్తాడు. ఉద్రిక్త పరిస్థితి బయటపడుతుండగా, నిలే గతం నుండి చీకటి రహస్యాలు తిరిగి బయటపడతాయి, కాల్ చేసిన వ్యక్తితో లోతైన సంబంధాన్ని వెల్లడిస్తాయి. పూర్తిగా నిలే దృక్కోణం నుండి చెప్పబడిన ఈ చిత్రం వాయిస్ ఇంటరాక్షన్‌ల ద్వారా ఉత్కంఠను పెంచుతుంది మరియు పట్టుదలగల, ప్రతీకారంతో నడిచే మలుపుతో ముగుస్తుంది.
IMDb రేటింగ్ : 6.2/10
మారేడుకోన గ్రామంలో అనుమానాస్పదమైన రితీలో మరణాలు జరుగుతుంటాయి. అను (అనన్య నాగళ్ల) అనే అమ్మాయి కోసం వెతుక్కొంటూ విక్రమ్ (విజయ్ ధరణ్ దాట్ల) ఆ గ్రామానికి వెళ్తాడు. అయితే అక్కడే పనిచేసే ఎస్ఐ కూతురు (అను)తో విక్రమ్ ప్రేమలో పడుతాడు. తను వెతుక్కొంటూ వచ్చిన అను మరణించిందనే విషయాన్ని తెలుసుకొంటాడు.
విక్రమ్ వెతుక్కొంటూ వచ్చిన డాక్టర్ అను ఎవరు? డాక్టర్ అను ఎలా మరణించింది? గ్రామానికి అను ఎందుకు వచ్చింది? ఎస్ఐ కూతురు అనుతో విక్రమ్ ఎలా ప్రేమలో పడ్డాడు? మారేడుకోనలో పెద్దిరెడ్డి అధిపత్యం, అక్రమాలు ఎలా కొనసాగాయి? అను మరణం వెనుక అసలు కారణాన్ని విక్రమ్ తెలుసుకొన్నాడా? అను మృతికి కారణమైన వ్యక్తికి విక్రమ్ ఎలాంటి శిక్షను వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే అన్వేషి సినిమా కథ.
IMDb రేటింగ్: 6.3 / 10
సోమన్ ప్రకృతితో సామరస్యంగా జీవించడాన్ని నమ్మే వ్యవసాయ అధికారి. అయితే, అతని జీవన విధానం అతనిని తన గ్రామంతో, అతని భార్యతో కూడా విభేదిస్తుంది.
ముగ్గురు న్యూరో సర్జన్ల మిస్టరీ కేసు హత్య దర్యాప్తు కోసం సిబిఐ అధికారిణి ప్రియా కృష్ణ (ప్రియమణి) నగరానికి వస్తుంది. అర్జున్ ఒక థియేటర్ ఆర్టిస్ట్, అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు మరియు ప్రతి 56 నిమిషాలకు ఒక మాత్ర వేసుకోవాల్సి వస్తుంది. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత ప్రియ అర్జున్‌ను అనుమానితుడిగా గుర్తిస్తుంది. ఆ తరహా విశ్వాసులు స్వాగతించే చాలా ఆనందదాయకమైన హత్య మిస్టరీ ఇది.
Leharayi Telugu movie

Showing 1–24 of 78 results