మిషన్ ఇంపాజిబుల్ 8 (2025)🔥పూర్తి యాక్షన్ మూవీ HD | టామ్ క్రూజ్ | థ్రిల్లర్ | ఇంగ్లీష్ లో పూర్తి సినిమా

20252 గం 49 నిUA 13+,

మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికొనింగ్ కథ || మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ఈ కథ మొదలవుతుంది. ప్రపంచాన్ని సైతం శాసించే శక్తి గల ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాలను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ తాళాలు వాళ్లకు చిక్కకుండా ఎంఐ ఏజెంట్‌ ఈథన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌) దక్కించుకుంటాడు. అయితే, సముద్రగర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్‌ సబ్‌మెరైన్‌లో ఎంటిటీ ఒరిజినల్‌ సోర్స్‌ కోడ్‌ ఉంటుంది. దానిని కనిపెట్టి నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడమని అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్‌ (ఏంజెలా బాసెట్‌) ఈథన్‌కు వాయిస్‌ నోట్‌ పంపుతారు. ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీని అయినా నియంత్రించే శక్తిగల ఎంటిటీని నాశనం చేసేందుకు ఈథన్‌ హంట్‌ చేసిన సాహసం ఏంటి? కంటికి కనిపించని శత్రువుతో అతడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో ఎవరిని కోల్పోయాడు? అన్నది చిత్ర కథ.
IMDb రేటింగ్: 7.3/10

Cast & Crew

Fun Facts of Movie

Mission Impossible 8 (2025)🔥Full Action Movie HD | Tom Cruise’s Thriller | Full Movie in English

  • ఎంటిటీ ఒరిజినల్‌ సోర్స్‌ కోడ్‌ ఉండే పాడ్‌కోవాను నాశనం చేసేందుకు అవసరమైన కోడ్స్‌ ను సంపాదించే పనిలో మిగిలిన టీమ్‌ చేసే ప్రయత్నాలు అలరిస్తాయి.
  • ఇక ఈథన్‌ హంట్‌ సెవాస్ట్‌పోల్‌ సబ్‌మెరైన్‌లో ప్రవేశించిన తర్వాత వచ్చే ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడుతుంది.
  • నీటి అడుగున తెరకెక్కించిన ఆ సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి.
  • ఎగురుతున్న విమానం మీద జరిగే క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌.
  • అవి వచ్చినప్పుడు థియేటర్‌ ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్‌తో మార్మోగిపోయింది.
  • అదే సమయంలో ఎంటిటీని బంధించడానికి ఈథన్‌ హంట్‌ టీమ్‌ చేసే ప్రయత్నాలు సైతం ఉత్కంఠతో సాగడమే కాదు, భావోద్వేగాలను పంచుతాయి.
  • ప్రస్తుతం టామ్‌ క్రూజ్‌ వయసు 62ఏళ్లు. ఈ వయసులోనూ రియలిస్టిక్‌ స్టంట్స్‌ చేసి తనకు తానే సాటి అని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు.
  • సాంకేతికంగా సినిమా అత్యున్నతంగా ఉంది. ఫ్రేజర్‌ సినిమాటోగ్రఫీ టాప్‌ నాచ్‌. ముఖ్యంగా అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌
  • ఎయిరోప్లేన్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
  • మ్యాక్స్‌ అర్జ్‌, అలైఫ్ గాడ్‌ఫ్రే నేపథ్య సంగీతం, ఎంఐ థీమ్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చినా ప్రేక్షకుడిని హాంట్ చేస్తూనే ఉంటుంది.
Be the first to review “మిషన్ ఇంపాజిబుల్ 8 (2025)🔥పూర్తి యాక్షన్ మూవీ HD | టామ్ క్రూజ్ | థ్రిల్లర్ | ఇంగ్లీష్ లో పూర్తి సినిమా”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.