మదరాసి – శివకార్తికేయన్ | రుక్మిణి | విద్యుత్ | ఏ.ఆర్.మురుగదాస్ | అనిరుధ్
తమిళనాడులో తుపాకీ సంస్కృతిని అలవాటు చేసి సొమ్ము చేసుకోవాలనేది ఒక సిండికేట్ పన్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్(షబీర్ కల్లరక్కల్) అనే ఇద్దరు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్రక్కులకొద్దీ ఆయుధాల్ని తరలిస్తుంది.అవన్నీ ఓ ఫ్యాక్టరీకి చేరుతుండగా ఎన్.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేనన్) నేతృత్వంలోని ఎన్.ఐ.ఏ ఆపాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్టరీ మొత్తాన్ని పేల్చివేయాలనే ఒక ఆపరేషన్‌కి నడుం బిగిస్తుంది ఎన్.ఐ.ఎ. అయితే ఈ ఆపరేషన్ అంత సులభమైనదేమీ కాదు. ఒకరి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. సరిగ్గా అదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రఘురామ్ (శివకార్తికేయన్)ను ప్రేమ్‌నాథ్ కలుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్కచేయని రఘురామ్‌ని ఈ ఆపరేషన్లోకి తీసుకు రావాలని నిర్ణయిస్తాడు. మరి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందా? అసలు రఘురామ్ ఎవరు?అతనికి ప్రాణాలంటే లెక్కలేని తనం ఎందుకు? మాలతి (రుక్మిణీ వసంత్)తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Cast & Crew
శివకార్తికేయన్
రుక్మిణి వసంత్
విద్యుత్ జమ్వాల్
బిజు మేనన్
విక్రాంత్
Directing
ఏ ఆర్ మురుగదాస్
Camera
సుదీప్ ఎల్మోన్
Sound
అనిరుధ్
Editing
శ్రీకర్ ప్రసాద్
Production
ఎన్.శ్రీలక్ష్మీ ప్రసాద్
Fun Facts of Movie
- రఘురామ్ పాత్రలో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటన ఆకట్టుకుంటుంది. డిజార్డర్‌తో బాధపడుతున్న యువకుడిగా అతని నటన మెప్పిస్తుంది.
- శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ మంచి జోడీ అనిపిస్తుంది.
- మెడికోగా కనిపించిన రుక్మిణి (madharasi heroine name) క్యూట్‌గా కనిపిస్తూనే, భావోద్వేగాల్నీ పలికించింది.
- విద్యుత్ జమ్వాల్ స్టైలిష్ విలన్‌గా సందడి చేశాడు.
- చిరాగ్ పాత్రలో కనిపించిన షబీర్ కూడా మెప్పిస్తాడు.
- ఎన్.ఐ.ఏ అధికారిగా బిజూమేనన్ నటన మెప్పిస్తుంది.
- విక్రాంత్, విమలారామన్ తదితరుల పాత్రలూ ఆకట్టుకుంటాయి.
- సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సుదీప్ విజువల్స్, అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
- నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + ప్రథమార్ధం
- + శివకార్తికేయన్ నటన
- + కథలోని మలుపులు
- బలహీనతలు
- – ఊహకందే కథ, కథనం
- – ద్వితీయార్ధం
- చివరిగా: మదరాసి… అక్కడక్కడా ఆకట్టుకుంటాడు







There are no reviews yet.