బాద్‌షా – తెలుగు | జూ.ఎన్టీఆర్ | కాజల్ అగర్వాల్

డాన్ సాధు భాయ్ (కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా (జూనియర్ ఎన్.టీ.ఆర్) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్ (ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్‍షాకి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాధు భాయ్ బాద్‍షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్ (ఆశిష్ విద్యార్థి), వయోలెంట్ విక్టర్ (ప్రదేప్ రావత్) తో కలిసి బాద్‍షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి (కాజల్ అగర్వాల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా (నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా (బ్రహ్మానందం). అలా సాగుతున్న సమయంలో బాద్‍షాకి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.

Cast & Crew

ప్రకాష్‌రాజ్

ముఖ్య పాత్రధారి

నాజర్

ముఖ్య పాత్రధారి

Directing

Camera

కె.వి. గుహన్

సినిమాటోగ్రఫీ

Sound

తమన్

సంగీతం

Fun Facts of Movie

Badshah – Telugu | Jr. NTR | Kajal Aggarwal

Be the first to review “బాద్‌షా – తెలుగు | జూ.ఎన్టీఆర్ | కాజల్ అగర్వాల్”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.