క్లాష్ ఆఫ్ ది గాడ్స్ (2025) | తెలుగు డబ్బింగ్ సినిమా
You Also May Like
Featured
షోలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది! భారతదేశంలో అత్యంత పురాణ చిత్రంగా నిలిచిన ఐదు దశాబ్దాల వేడుక! షోలే (1975) మనకు ఐకానిక్ పాత్రలు, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు నేటికీ ఉదహరించబడే సంభాషణలను అందించింది. బాలీవుడ్ కథను రూపొందించిన ఈ చిత్రం, తరతరాలుగా చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిస్తూ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
రామ్‌గఢ్ గ్రామంలో,రిటైర్డ్ పోలీస్ చీఫ్ ఠాకూర్ బల్దేవ్ సింగ్(సంజీవ్ కుమార్)పేరుమోసిన బందిపోటు గబ్బర్ సింగ్(అమ్జాద్ ఖాన్)ను అంతం చేయడానికి పథకం వేసి ఇద్దరు చిన్న నేరస్థులు, జై(అమితాబ్ బచ్చన్) మరియు వీరు(ధర్మేంద్ర) సహాయం తీసుకుంటాడు. అయితే, గబ్బర్ గ్రామంపై దాడి చేసినప్పుడు, జై మరియు వీరు ఇద్దరు ఠాకూర్ తమకు సహాయం చేయడానికి ఎందుకు ఏమీ చేయలేదని ఆశ్చర్యపోతారు. అతని వద్ద ఆయుధాలు లేవని, గబ్బర్ నరికివేశాడని వారు త్వరలోనే తెలుసుకుంటారు.దీనితో ఆగ్రహించిన వారు, సహాయం చేయడానికి తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు, విజయం సాధిస్తారు.
అమెజాన్ ప్రైమ్ లింక్
టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పూర్తి కథ కోసం లింక్
IMDb రేటింగ్: 8/10
కార్తీక మిస్సింగ్ కేసు అనేది ఒక ఉత్కంఠభరితమైన డ్రామా, ఇది తప్పిపోయిన అమ్మాయి కోసం డిటెక్టివ్ మరియు అతని బృందం వెతుకుతున్న తీరును అనుసరిస్తుంది. ఈ ప్రక్రియలో, కార్తీక గురించి వారికి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ఎవరు? ఆమె అధికారం మరియు ఆర్థిక దోపిడీకి ఎలా గురైంది? ఇప్పుడే కనుగొనండి.
IMDb రేటింగ్: 6.4/10
IMDb రేటింగ్: 6.4/10
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ
కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై
అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్
బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో
ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి...
పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్
అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో
ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో
కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.
తమిళనాడులో తుపాకీ సంస్కృతిని అలవాటు చేసి సొమ్ము చేసుకోవాలనేది ఒక సిండికేట్ పన్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్(షబీర్ కల్లరక్కల్) అనే ఇద్దరు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్రక్కులకొద్దీ ఆయుధాల్ని తరలిస్తుంది.అవన్నీ ఓ ఫ్యాక్టరీకి చేరుతుండగా ఎన్.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేనన్) నేతృత్వంలోని ఎన్.ఐ.ఏ ఆపాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్టరీ మొత్తాన్ని పేల్చివేయాలనే ఒక ఆపరేషన్‌కి నడుం బిగిస్తుంది ఎన్.ఐ.ఎ. అయితే ఈ ఆపరేషన్ అంత సులభమైనదేమీ కాదు. ఒకరి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. సరిగ్గా అదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రఘురామ్ (శివకార్తికేయన్)ను ప్రేమ్‌నాథ్ కలుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్కచేయని రఘురామ్‌ని ఈ ఆపరేషన్లోకి తీసుకు రావాలని నిర్ణయిస్తాడు. మరి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందా? అసలు రఘురామ్ ఎవరు?అతనికి ప్రాణాలంటే లెక్కలేని తనం ఎందుకు? మాలతి (రుక్మిణీ వసంత్)తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
పూరీ మాస్ ట్రీట్మెంట్కి మహేష్ క్లాస్ యాక్షన్ కలిపి తయారు చేసిన కాక్టెయిల్'పోకిరి'సినిమా.పండు(మహేష్‌బాబు)కిరాయి గుండా.'నేనెంత వెధవనో నాకే తెలియదు' అని అంటూ ఒప్పుకున్న పనులను ఎంద మంది ఎదురొచ్చినా సునాయసంగా పూర్తి చేస్తూ వుంటాడు హీరో.శృతి(ఇలియానా) ఎరోబిక్ టీచర్.తండ్రిలేని కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొస్తూ వుంటుంది.పశుపతి(ఆశీష్ విద్యార్థి) అనే పోలీసు ఇన్స్పెక్టర్ ఆమెపై కన్నేసి వెంటపడుతూ వుంటే పండు అండతో తప్పించుకుంటుంది. తర్వాత ప్రేమలో పడి పాటలు పాడుతూ వుంటుంది. మరో పక్క పండు రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి లోకల్ మాఫియా దగ్గర పనిచేస్తూ పక్క గ్రూప్‌తో తగువు పడతాడు. వాళ్లు అతనిపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా సిటీకి కొత్తగా వచ్చిన పోలీసు అధికారి (సాయాజి షిండే) ఈ గ్రూప్‌లను అణచేయాలని అనుకుంటూ వుంటాడు. పండు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు,ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది తెరపై చూడాల్సిందే.ప్రత్యేకంగా పోకిరిగా మహేష్ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.
Fun Facts of Movie
Clash of the Gods (2025) | Telugu Dubbed (English) Full Movie | Hollywood Blockbuster
Be the first to review “క్లాష్ ఆఫ్ ది గాడ్స్ (2025) | తెలుగు డబ్బింగ్ సినిమా” Cancel reply







There are no reviews yet.