కింగ్డమ్ (తెలుగు)
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి... పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.







There are no reviews yet.