Telugu movie
అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందని, వాటిని సొంతం చేసుకోవడానికి హిట్లర్ కూడా ప్రయత్నించాడనే ఓ ప్రచారం ఉంది. అందుకు చారిత్రక ఆధారాలైతే లేవు. అలాంటి విలువైన జ్ఞాన గ్రంథాలు దుష్ట ఆలోచనలు ఉన్న ఒక మనిషి చేతిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుంది? మన ఇతిహాసాల సాయంతో అలాంటి వ్యక్తిని ఆపగలమా? అనే అంశాలతో సాగే కథే ‘మిరాయ్’ అంటున్నారు యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా , మంచు మనోజ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
IMDb రేటింగ్ :
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్ హార్ట్స్ – సినిమా రివ్యూలు – లింకులు
IMDb రేటింగ్: 8.5/10
ఓటీటీ స్ట్రీమింగ్ / సెప్టెంబర్ 4,2025 : అమెజాన్ ప్రైమ్ వీడియో
అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? అన్నది కీలకం.
IMDb రేటింగ్: 6.4/10
IMDb రేటింగ్: 8.3/10
IMDb రేటింగ్ : 6.2/10
నటీనటులు - అల్లు అర్జున్,పూజా హెగ్డే,
స్క్రీన్ ప్లే-రమేష్ రెడ్డి, దీపక్ రాజ్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్:ఛోటా కె ప్రసాద్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, కళ:రవీందర్,
కథ-మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్,
నిర్మాతలు:దిల్ రాజు & శిరీష్
IMDb రేటింగ్ : 6/10
తన తాత గారి వీలునామా, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులతో తన నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని పాకిస్థాన్ బయలుదేరుతాడు. అందుకోసం హిందూ మతానికి, దేవాలయాలకు ప్రాధాన్యత నిచ్చే శ్రీనిధి(తాప్సీ) సాయం తీసుకుంటాడు. కానీ గౌతమ్ అనుకున్న జర్నీ అంత సులభం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ కి ఆ ప్రోపర్టీ పాకిస్థాన్ టెర్రరిస్ట్ అయిన సుల్తాన్(శక్తి కపూర్) చేతిలో ఉంటుంది. వారందరినీ ఎదిరించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా? అనే అడ్వెంచరస్ డ్రామాని తెరపైనే చూడాలి.
IMDb రేటింగ్: 6.8/10
_పూర్తి కథ కోసం లింక్
అమెజాన్ ప్రైమ్ వీడియో లింక్
IMDb రేటింగ్: 7.4/10
స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10
IMDb రేటింగ్: 7.9/10
IMDb రేటింగ్: 7.3/10
టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పూర్తి కథ కోసం లింక్
IMDb రేటింగ్: 8/10



























