Featured
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే కథ ఇది. అక్కడి ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే.. దాన్ని వాళ్లు తమ బాస్‌ మహావీర్‌ (జిషు సేన్‌ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్‌ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్‌ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు - షీలావతి కలిసి మొదలు పెట్టిన ఆ వ్యాపారం వాళ్లని ఎన్ని చిక్కుల్లో పడేసింది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.
Featured
ఈటీవీ విన్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌స్తున్న మొట్ట మొద‌టి థియేట్రిక‌ల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ‘90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్‌’తో యువతకు చేరువైన మౌళి త‌నూజ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య హ‌స‌న్ దీనికి నిర్మాత కావ‌డం విశేషం. అఖిల్ (మౌళి త‌నూజ్‌) చ‌దువుల్లో అంతంత మాత్ర‌మే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాల‌నుకుంటాడు. కానీ, తండ్రి గోపాల‌రావు (రాజీవ్ క‌న‌కాల‌) మాత్రం లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయ‌ని (శివానీ నాగారం)ది కూడా అదే క‌థే. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే. తమ కూతురిని కూడా డాక్ట‌ర్‌గా చూడాల‌నేది వాళ్ల ల‌క్ష్యం. అందుకే కాత్యాయ‌ని కూడా ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్క‌డే అఖిల్‌, కాత్యాయ‌ని ప‌రిచ‌యమవుతారు. ఆ ప‌రిచ‌యం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ త‌న మ‌న‌సులో మాటని బ‌య‌ట పెడ‌తాడు. అప్పుడు కాత్యాయ‌ని త‌నకు సంబంధించిన ఓ విష‌యాన్ని బ‌య‌ట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమ‌క‌థ‌లో ఓ పెద్ద మ‌లుపు. ఇంత‌కీ కాత్యాయ‌ని చెప్పిన ఆ విష‌యం ఏమిటి?వీళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌కి ఎదురైన స‌మ‌స్య ఏమిటి? ఆ ప్రేమ‌క‌థ కంచికి చేరిందా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్‌ హార్ట్స్‌ – సినిమా రివ్యూలు – లింకులు
డతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. తాను ఆచారాన్ని తప్పలేదని వేడుకున్నా... ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. ఆచారం ప్రకారం ప్రాణాలైనా వదలాలి, లేదంటే తప్పు చేయలేదనైనా నిరూపించుకోవాలని కోరతారు ఊరి ప్రజలు. దాంతో సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సి వస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి?సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?  
కథేంటంటే.. కింగ్‌పిన్‌ లాజిస్టిక్స్‌ అధినేత సైమన్‌ (నాగార్జున) శక్తిమంతమైన డాన్‌. ప్రభుత్వం నుంచి వైజాగ్‌ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్‌ (సౌబిన్‌ షాహిర్‌). సైమన్‌కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్‌ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్‌ (సత్యరాజ్‌) కనిపెట్టిన మొబైల్‌ క్రిమేటర్‌ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్‌.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పని చేయమని కోరతాడు. లేదంటే అతని ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్‌)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ, అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్‌ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్‌) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి? పోర్టులో స్మగ్లింగ్‌ మాటున సైమన్‌ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి? దీనికి విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్‌ ఖాన్‌)కు దీనితో లింకేంటి? ఈ కథలో కాళేశ్‌ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్‌ (రచిత రామ్‌), అర్జున్‌ సైమన్‌ (కన్న రవి)లు ఎవరు? అన్నది చిత్ర కథ.

ఓటీటీ స్ట్రీమింగ్‌ / సెప్టెంబర్ 4,2025 : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్‌). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్‌) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? అన్నది కీలకం.

Pratinidhi 2
నిజాన్ని నిర్భ‌యంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్ట్ చే అలియాస్ చేత‌న్ (నారా రోహిత్‌). చిన్న‌ప్పుడు త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆయ‌న గ‌మ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసే చేత‌న్‌ని ఎన్‌.ఎన్‌.సి ఛాన‌ల్ ఏరికోరి సీఈఓగా నియ‌మిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ని చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్ర‌భావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Showing all 6 results