ఏక్షన్
Featured
అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందని, వాటిని సొంతం చేసుకోవడానికి హిట్లర్ కూడా ప్రయత్నించాడనే ఓ ప్రచారం ఉంది. అందుకు చారిత్రక ఆధారాలైతే లేవు. అలాంటి విలువైన జ్ఞాన గ్రంథాలు దుష్ట ఆలోచనలు ఉన్న ఒక మనిషి చేతిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుంది? మన ఇతిహాసాల సాయంతో అలాంటి వ్యక్తిని ఆపగలమా? అనే అంశాలతో సాగే కథే ‘మిరాయ్’ అంటున్నారు యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా , మంచు మనోజ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
IMDb రేటింగ్ :
Featured
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే కథ ఇది. అక్కడి ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే.. దాన్ని వాళ్లు తమ బాస్ మహావీర్ (జిషు సేన్ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు - షీలావతి కలిసి మొదలు పెట్టిన ఆ వ్యాపారం వాళ్లని ఎన్ని చిక్కుల్లో పడేసింది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.
తమిళనాడులో తుపాకీ సంస్కృతిని అలవాటు చేసి సొమ్ము చేసుకోవాలనేది ఒక సిండికేట్ పన్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్(షబీర్ కల్లరక్కల్) అనే ఇద్దరు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్రక్కులకొద్దీ ఆయుధాల్ని తరలిస్తుంది.అవన్నీ ఓ ఫ్యాక్టరీకి చేరుతుండగా ఎన్.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేనన్) నేతృత్వంలోని ఎన్.ఐ.ఏ ఆపాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్టరీ మొత్తాన్ని పేల్చివేయాలనే ఒక ఆపరేషన్‌కి నడుం బిగిస్తుంది ఎన్.ఐ.ఎ. అయితే ఈ ఆపరేషన్ అంత సులభమైనదేమీ కాదు. ఒకరి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. సరిగ్గా అదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రఘురామ్ (శివకార్తికేయన్)ను ప్రేమ్‌నాథ్ కలుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్కచేయని రఘురామ్‌ని ఈ ఆపరేషన్‌లోకి తీసుకు రావాలని నిర్ణయిస్తాడు. మరి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందా? అసలు రఘురామ్ ఎవరు?అతనికి ప్రాణాలంటే లెక్కలేని తనం ఎందుకు? మాలతి (రుక్మిణీ వసంత్)తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
తాజా యాక్షన్ సినిమా | తన సోదరులను కాపాడటానికి అన్నీ పణంగా పెడతాడు!
కథేంటంటే.. కింగ్‌పిన్ లాజిస్టిక్స్ అధినేత సైమన్ (నాగార్జున) శక్తిమంతమైన డాన్. ప్రభుత్వం నుంచి వైజాగ్ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్ (సౌబిన్ షాహిర్). సైమన్‌కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్ (సత్యరాజ్) కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పని చేయమని కోరతాడు. లేదంటే అతని ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ, అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి? పోర్టులో స్మగ్లింగ్ మాటున సైమన్ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి? దీనికి విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్ ఖాన్)కు దీనితో లింకేంటి? ఈ కథలో కాళేశ్ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్ (రచిత రామ్), అర్జున్ సైమన్ (కన్న రవి)లు ఎవరు? అన్నది చిత్ర కథ.
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ
కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై
అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్
బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో
ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి...
పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్
అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో
ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో
కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.
మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికొనింగ్ కథ || మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ఈ కథ మొదలవుతుంది. ప్రపంచాన్ని సైతం శాసించే శక్తి గల ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాలను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ తాళాలు వాళ్లకు చిక్కకుండా ఎంఐ ఏజెంట్ ఈథన్
హంట్ (టామ్ క్రూజ్) దక్కించుకుంటాడు. అయితే, సముద్రగర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్‌లో ఎంటిటీ ఒరిజినల్ సోర్స్ కోడ్ ఉంటుంది. దానిని కనిపెట్టి నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడమని అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్ (ఏంజెలా బాసెట్) ఈథన్‌కు వాయిస్ నోట్ పంపుతారు. ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీని అయినా నియంత్రించే శక్తిగల ఎంటిటీని నాశనం చేసేందుకు ఈథన్ హంట్ చేసిన సాహసం ఏంటి? కంటికి కనిపించని శత్రువుతో అతడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో ఎవరిని కోల్పోయాడు? అన్నది చిత్ర కథ.
IMDb రేటింగ్: 7.3/10
IMDb రేటింగ్: 7.3/10
రామ్ అలియాస్ రాబిన్‌హుడ్ (నితిన్) ఎవరూ లేని ఓ అనాథ. తనలాంటి తోటి పిల్లలతో కలిసి ఓ అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతుంటాడు. ఆకలి, అవసరాల కోసం నేరాల బాట పట్టిన రామ్.. తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శరణాలయాలకి అండగా నిలుస్తుంటాడు. పెరిగి పెద్దయ్యాక కూడా అదే బాటలోనే అతడి ప్రయాణం కొనసాగుతుంది. బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్టర్ వర్ఘీస్ (షైన్ టామ్ చాకో) చేతికి చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్న రామ్, కొన్నాళ్లు నేరాలబాట వీడి ఉద్యోగం చేయాలనుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్రప్రసాద్) నడుపుతున్న ఇండియాస్ నంబర్‌వన్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల) రక్షణ బాధ్యతల కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరీ నీరా వాసుదేవ్? ఆమె ఇండియాకి ఎందుకొచ్చింది?అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది?అపాయంలోఉన్న నీరా వాసుదేవ్‌కి రామ్ రక్షణ కల్పించాడా లేదా?అనేది మిగతా కథ.
IMDb రేటింగ్: 4.5/10
IMDb రేటింగ్: 4.5/10













