వేదం – తెలుగు సినిమా | అల్లు అర్జున్ | అనుష్క | మంచు మనోజ్ | దీక్షా సేథ్

20102గం 15నిU/A,

స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10

 

Cast & Crew

అనూష్క

హీరోయిన్

మంచు మనోజ్

ప్రధాన పాత్రధారి

దీక్షాసేథ్

ప్రధాన పాత్రధారిణి

మనోజ్ బాజపేయి

ప్రధాన పాత్రధారి

Directing

రాధాకృష్ణ (క్రిష్)

కథ,దర్శకత్వం

Camera

వి.యస్.జ్ఞాన శేఖర్

సినిమాటోగ్రఫీ

Editing

శర్వన్

ఎడిటింగ్

Fun Facts of Movie

Vedam Telugu Full HD Movie | Allu Arjun | Anushka | Manchu Manoj | Deeksha Seth

Be the first to review “వేదం – తెలుగు సినిమా | అల్లు అర్జున్ | అనుష్క | మంచు మనోజ్ | దీక్షా సేథ్”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.