మదరాసి – శివకార్తికేయన్ | రుక్మిణి | విద్యుత్ | ఏ.ఆర్.మురుగదాస్ | అనిరుధ్

20252 గం 48 నిUA 16+,

త‌మిళ‌నాడులో తుపాకీ సంస్కృతిని అల‌వాటు చేసి సొమ్ము చేసుకోవాల‌నేది ఒక సిండికేట్ ప‌న్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్(షబీర్ కల్లరక్కల్) అనే ఇద్ద‌రు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్ర‌క్కుల‌కొద్దీ ఆయుధాల్ని త‌ర‌లిస్తుంది.అవ‌న్నీ ఓ ఫ్యాక్ట‌రీకి చేరుతుండ‌గా ఎన్‌.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేన‌న్‌) నేతృత్వంలోని ఎన్‌.ఐ.ఏ ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్ట‌రీ మొత్తాన్ని పేల్చివేయాల‌నే ఒక ఆప‌రేష‌న్‌కి న‌డుం బిగిస్తుంది ఎన్‌.ఐ.ఎ. అయితే ఈ ఆప‌రేష‌న్ అంత సుల‌భమైన‌దేమీ కాదు. ఒక‌రి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న ర‌ఘురామ్ (శివ‌కార్తికేయ‌న్‌)ను ప్రేమ్‌నాథ్ క‌లుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్క‌చేయ‌ని ర‌ఘురామ్‌ని ఈ ఆప‌రేష‌న్‌లోకి తీసుకు రావాల‌ని  నిర్ణ‌యిస్తాడు. మ‌రి ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యిందా? అస‌లు ర‌ఘురామ్ ఎవ‌రు?అత‌నికి ప్రాణాలంటే లెక్క‌లేని త‌నం ఎందుకు? మాల‌తి (రుక్మిణీ వ‌సంత్‌)తో అత‌నికి ఉన్న సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

Cast & Crew

Fun Facts of Movie

  • ర‌ఘురామ్ పాత్రలో శివ‌కార్తికేయ‌న్ (Sivakarthikeyan) న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న యువ‌కుడిగా అత‌ని న‌ట‌న మెప్పిస్తుంది.
  • శివ కార్తికేయ‌న్‌, రుక్మిణీ వ‌సంత్ మంచి జోడీ అనిపిస్తుంది.
  • మెడికోగా క‌నిపించిన రుక్మిణి (madharasi heroine name) క్యూట్‌గా క‌నిపిస్తూనే, భావోద్వేగాల్నీ ప‌లికించింది.
  • విద్యుత్ జ‌మ్వాల్ స్టైలిష్ విల‌న్‌గా సంద‌డి చేశాడు.
  • చిరాగ్ పాత్ర‌లో క‌నిపించిన ష‌బీర్ కూడా మెప్పిస్తాడు. 
  • ఎన్‌.ఐ.ఏ అధికారిగా బిజూమేన‌న్ న‌ట‌న మెప్పిస్తుంది.
  • విక్రాంత్‌, విమ‌లారామ‌న్ త‌దిత‌రుల పాత్ర‌లూ ఆక‌ట్టుకుంటాయి.
  • సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సుదీప్ విజువ‌ల్స్, అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.
  • నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. 
  • బ‌లాలు
  • + ప్ర‌థ‌మార్ధం
  • శివకార్తికేయ‌న్ న‌ట‌న‌
  • క‌థ‌లోని మ‌లుపులు
  • బ‌ల‌హీన‌త‌లు
  •  ఊహ‌కందే క‌థ, క‌థ‌నం
  • – ద్వితీయార్ధం
  • చివ‌రిగా: మ‌ద‌రాసి… అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకుంటాడు
Be the first to review “మదరాసి – శివకార్తికేయన్ | రుక్మిణి | విద్యుత్ | ఏ.ఆర్.మురుగదాస్ | అనిరుధ్”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.