కూలీ – తెలుగు (తమిళ్ డబ్బింగ్) రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, ఆమీర్‌ఖాన్ తదితరులు
కథేంటంటే.. కింగ్‌పిన్ లాజిస్టిక్స్ అధినేత సైమన్ (నాగార్జున) శక్తిమంతమైన డాన్. ప్రభుత్వం నుంచి వైజాగ్ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్ (సౌబిన్ షాహిర్). సైమన్‌కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్ (సత్యరాజ్) కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పని చేయమని కోరతాడు. లేదంటే అతని ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ, అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి? పోర్టులో స్మగ్లింగ్ మాటున సైమన్ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి? దీనికి విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్ ఖాన్)కు దీనితో లింకేంటి? ఈ కథలో కాళేశ్ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్ (రచిత రామ్), అర్జున్ సైమన్ (కన్న రవి)లు ఎవరు? అన్నది చిత్ర కథ.







There are no reviews yet.