ఘాటి – అనుష్క శెట్టి | విక్రమ్ ప్రభు | క్రిష్ జాగర్లమూడి | యువి క్రియేషన్స్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే కథ ఇది. అక్కడి ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే.. దాన్ని వాళ్లు తమ బాస్ మహావీర్ (జిషు సేన్ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు - షీలావతి కలిసి మొదలు పెట్టిన ఆ వ్యాపారం వాళ్లని ఎన్ని చిక్కుల్లో పడేసింది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.
Cast & Crew
అనుష్క శెట్టి
విక్రమ్ ప్రభు
Directing
క్రిష్ జాగర్లమూడి
Camera
మనోజ్ రెడ్డి కాటసాని
Sound
సాగర్ నాగవెల్లి
Art
తోట తరణి
Writing
సాయి మాధవ్ బుర్రా
Fun Facts of Movie
- షీలావతిగా పూర్తి రా అండ్ రస్టిక్ లుక్‌లో అనుష్క ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది.
- దేశీరాజు పాత్రకు విక్రమ్ ప్రభు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.
- కుందుల నాయుడుగా చైతన్యరావు విలనిజం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది.
- కాష్టాల నాయుడుగా రవీంద్ర విజయ్ ఫర్వాలేదు.
- జగపతిబాబు, వీటీవీ గణేశ్, జిషు సేన్ గుప్తా, రాజు సుందరం పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
- విద్యాసాగర్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలాన్నిచ్చాయి.
- తూర్పు కనుమల అందాల్ని మనోజ్ తన కెమెరాతో చక్కగా ఒడిసిపట్టారు.
- నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
- బలాలు
- + అనుష్క నటన
- + పోరాట ఘట్టాలు
- + విరామ సన్నివేశాలు
- బలహీనతలు
- – ఊహలకు అందే కథనం
- – కొరవడిన భావోద్వేగాలు
- చివరిగా: ‘ఘాటి’.. అనుష్క యాక్షన్ షో







There are no reviews yet.