పరదా
పడతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. తాను ఆచారాన్ని తప్పలేదని వేడుకున్నా... ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. ఆచారం ప్రకారం ప్రాణాలైనా వదలాలి, లేదంటే తప్పు చేయలేదనైనా నిరూపించుకోవాలని కోరతారు ఊరి ప్రజలు. దాంతో సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సి వస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి?సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?
Cast & Crew
అనుపమ పరమేశ్వరన్
సంగీత
రాగ్ మయూర్
రాజేంద్రప్రసాద్
హర్ష వర్థన్
గౌతమ్ మేనన్
Directing
ప్రవీణ్ కండ్రేగుల
Camera
మృదుల్ సుజిత్ సేన్
Sound
గోపి సుందర్
Fun Facts of Movie
Paradha Movie | Anupama parameswaran | Darshan Rajendran | Sangeeta







There are no reviews yet.