గోలీమార్

గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్‌గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు. ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్‌గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్‌ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు.
IMDb రేటింగ్ : 6.3/10

Cast & Crew

Directing

పూరి జగన్నాద్

కథ , మాటలు , దర్శకత్వం

Fun Facts of Movie

Golimaar Telugu Movie | Gopichand | Priyamani 

Be the first to review “గోలీమార్”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.