లిటిల్ హార్ట్స్ – తెలుగు
ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న మొట్ట మొదటి థియేట్రికల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ‘90స్ మిడిల్‌క్లాస్ బయోపిక్’తో యువతకు చేరువైన మౌళి తనూజ్ ఇందులో కథానాయకుడిగా నటించగా, ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హసన్ దీనికి నిర్మాత కావడం విశేషం.
అఖిల్ (మౌళి తనూజ్) చదువుల్లో అంతంత మాత్రమే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాలనుకుంటాడు. కానీ, తండ్రి గోపాలరావు (రాజీవ్ కనకాల) మాత్రం లాంగ్ టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయని (శివానీ నాగారం)ది కూడా అదే కథే. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. తమ కూతురిని కూడా డాక్టర్‌గా చూడాలనేది వాళ్ల లక్ష్యం. అందుకే కాత్యాయని కూడా ఇంటర్ తర్వాత లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్కడే అఖిల్, కాత్యాయని పరిచయమవుతారు. ఆ పరిచయం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ తన మనసులో మాటని బయట పెడతాడు. అప్పుడు కాత్యాయని తనకు సంబంధించిన ఓ విషయాన్ని బయట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమకథలో ఓ పెద్ద మలుపు. ఇంతకీ కాత్యాయని చెప్పిన ఆ విషయం ఏమిటి?వీళ్లిద్దరి మధ్య ప్రేమకి ఎదురైన సమస్య ఏమిటి? ఆ ప్రేమకథ కంచికి చేరిందా లేదా? అనేది మిగతా కథ.
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్ హార్ట్స్ – సినిమా రివ్యూలు – లింకులు
Cast & Crew
మౌళి తనూజ్
శివానీ నాగారం
రాజీవ్ కనకాల
ఎస్.ఎస్. కాంచి
అనిత చౌదరి
Directing
సాయి మార్తాండ్
Camera
సూర్య బాలాజీ
Sound
సింజిత్ యెర్రమల్లి
Editing
శ్రీధర్ సొంపల్లి
Production
ఆదిత్య హసన్
Fun Facts of Movie
Little hearts – Telugu movie 2025
- ఈనాడు : లిటిల్ హార్ట్స్… ఆద్యంతం నవ్వులే
- ఆంధ్రజ్యోతి : క్లీన్ ఎంటర్టైనర్.. పైసా వసూల్..
- 123telugu.com : రేటింగ్ : 3/5
- తుపాకీ.కామ్ : లిటిల్ హార్ట్స్.. జాలీ రైడ్ -రేటింగ్- 2.75/5
- telugu.greatandhra.com : బాటం లైన్: టీనేజ్ “హార్ట్స్” కి మాత్రమే







There are no reviews yet.