సుందరకాండ | తెలుగు | 2025
సిద్ధార్థ్ (నారా రోహిత్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మూడు పదుల వయసు దాటిపోతున్నా సరే... అమ్మాయిల్లో తనకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ పెళ్లి సంబంధాల్ని తిరస్కరిస్తుంటాడు. స్కూల్‌లో తనకు సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్‌కుమార్)లో చూసిన ఆ ఐదు క్వాలిటీస్ తనకు కాబోయే భార్యలో ఉండాలనేది సిద్ధార్థ్ కోరిక. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అందులో రాజీపడడు. తీరా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ఐరా (వృతి వాఘాని) సిద్ధార్థ్‌కి ఎదురవుతుంది (Sundarakanda Review). తొలి పరిచయంలోనే ఆమెలో తనకు నచ్చే కొన్ని లక్షణాలను గమనిస్తాడు. దాంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని మరీ ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు తన కుటుంబంతో కలిసి ఐరా ఇంటికి వెళ్లాక అక్కడ ఎవరూ ఊహించని విషయం తెలుస్తుంది (Sundarakanda Story). అదేంటీ? చిన్నప్పుడు స్కూల్‌లో తాను ఎంతగానో ఆరాధించిన వైష్ణవికి సిద్ధార్థ్ ఎందుకు దూరమయ్యాడు? మళ్లీ ఆమె తన జీవితంలోకి తిరిగొచ్చాక ఏం జరిగింది? అసలు సిద్ధార్థ్, ఐరా పెళ్లి జరిగిందా? లేదా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.







There are no reviews yet.