శతమానం భవతి

20172hr 33 mntsU

ఆత్రేయపురం అనే ఊర్లోని రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడితే, రాజుగారు మాత్రం తన ఊర్లోనే భార్య జానకమ్మ, మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయి ఎప్పుడూ తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు ఎప్పుడూ కలత చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఓ పథకం వేసి, తన పిల్లలంతా సంక్రాంతికి వచ్చేలా చేస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్), రాజుతో పరిచయం పెంచుకొని అతడితో ప్రేమలో కూడా పడిపోతుంది. సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతుండగానే, రాజుగారు వేసిన పథకం ఆయన భార్యకు తెలిసి గొడవ జరుగుతుంది. కుటుంబంలోనూ పలు విబేధాలు వస్తాయి. రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి? అసలు ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకొని ఆ పథకం వేశాడు? రాజు, నిత్యాల ప్రేమకథ ఏమైంది? అన్నదే సినిమా.

Cast & Crew

Directing

Camera

సమీర్ రెడ్డి

సినిమాటోగ్రఫీ

Sound

మిక్కీ జె మేయర్

సంగీత దర్శకుడు

Production

దిల్ రాజు

నిర్మాత

Fun Facts of Movie

తెలుగు పూర్తి సినిమా 2017 | శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ | సబ్ టైటిల్స్ తో

Be the first to review “శతమానం భవతి”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.