కన్నప్ప
ఓటీటీ స్ట్రీమింగ్ / సెప్టెంబర్ 4,2025 : అమెజాన్ ప్రైమ్ వీడియో
అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? అన్నది కీలకం.
Cast & Crew
విష్ణు మంచు
ప్రభాస్
మోహన్‌బాబు
మోహన్‌లాల్
అక్షయ్‌కుమార్
ప్రీతి ముకుందన్
కాజల్ అగర్వాల్
ఆర్.శరత్‌కుమార్
బ్రహ్మానందం
ముకేశ్ రుషి
మధుబాల
బ్రహ్మాజీ
Directing
ముకేశ్ కుమార్ సింగ్
Camera
షెల్డన్ చౌ
Sound
స్టీఫెన్ దేవస్సే
Editing
ఆంటోనీ
Acting
మోహన్‌బాబు
Fun Facts of Movie
తెలుగు భక్తి చిత్రం | Telugu Devotional movie | Manchu vishnu, prabhas, Akshaywin kumar, Mohanlal, Mohanbabu
- తిన్నడుగా తనలోని వీరత్వాన్ని చూపించిన మంచు విష్ణు.. భక్తుడిగా మారాక మరింత ఎమోషన్ పంచారు. ఆయన
పలికిన సంభాషణలు, ప్రదర్శించిన హావభావాలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాల్లో ఆయన నటన గొప్ప
భావోద్వేగాల్ని పండించింది. - ప్రభాస్ (Prabhas) రాకతో ఈ సినిమా మరో స్థాయికి వెళుతుంది. కేవలం సంభాషణలతోనే ఆయన విజిల్స్
కొట్టిస్తారు. రుద్ర పాత్ర ప్రభావం అలాంటిది. - శివపార్వతుల్లా అక్షయ్‌కుమార్, కాజల్ కనిపిస్తారు.
- మోహన్‌బాబు, మోహన్‌లాల్ అతిథి పాత్రల్లా కాసేపే మెరిసినా సినిమాపై గొప్ప ప్రభావం చూపిస్తారు.
- శరత్‌కుమార్ పాత్ర, నటన ఆకట్టుకుంటుంది.
- ప్రీతి ముకుందన్ కీలకమైన పాత్రలో కనిపిస్తుంది. నెమలి పాత్రలో ఆమె అందంతోనూ కట్టిపడేస్తుంది. పాటలతో
అందరి దృష్టినీ ఆకర్షించిందామె. - ముఖేష్‌రుషి, మధుబాల, దేవరాజ్ తదితరులు గూడేల పెద్దలుగా కనిపిస్తారు.
- బ్రహ్మానందం చిన్న పాత్రలోనే కనిపిస్తారు.
- సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.
- ఛాయాగ్రాహకుడు షెల్డన్ చౌ విజువల్స్ మెప్పిస్తాయి.
- సింహభాగం సినిమాని న్యూ జిలాండ్‌లో సహజమైన లొకేషన్లలో తీశారు.
- స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన పాటలు మెప్పిస్తాయి.
- భక్తి ప్రధానమైన ఈ సినిమాలో మరీ లోతైన భావాలతో కాకుండా, నవతరం సులభంగా అర్థం చేసుకునేలా మాటలు ఉం టాయి.
- పాటల్లోనూ సాహిత్యం బాగుంది.







There are no reviews yet.