ఇది కథ కాదు – B&W | కమల్ హాసన్ | చిరంజీవి | జయసుధ | కె బాలచందర్
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.
క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్‌గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.
Cast & Crew
Fun Facts of Movie
Idi Katha Kaadu Telugu Full Movie | Kamal Haasan | Chiranjeevi | Jayasudha | K Balachander
- తమిళంలో నిర్మింపబడ్డ అవర్ గళ్ (వారు) ఈ చిత్రానికి మూలం.
- తమిళంలో నాయికగా సుజాత నటించింది.
- చిరంజీవి పాత్రని తమిళంలో రజినీ కాంత్ పోషించారు.
- మిమిక్రీ కళాకారుడిగా రెండు భాషల్లోనూ కమల్ హాసన్ నటించటం విశేషం !







There are no reviews yet.