అంకురం – రేవతి, శరత్ బాబు, ఓం పూరి, చారుహాసన్, తనికెళ్ల భరణి

సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.

Cast & Crew

రేవతి

కథానాయకురాలు

శరత్ బాబు

కథానాయకుడు

ఓం పూరి

ముఖ్య పాత్రధారి

ఆలీ

నటుడు

బాలయ్య

నటుడు

Directing

ఉమామహేశ్వరరావు.సి

రచన, దర్శకత్వం

Camera

మధు అంబట్

సినిమాటోగ్రఫీ

Sound

హంసలేఖ

సంగీతం

Editing

Fun Facts of Movie

Ankuram – Full Movie | Revathy,Sarath Babu,Om Puri,Ali,Kota Srinivasa Rao,Tanikalla Bharani

  • 1992వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు చలనచిత్రంగా భారత జాతీయ చలన చిత్ర పురస్కారం.
  • 1992వ సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా సి. ఉమామహేశ్వరరావుకు నంది పురస్కారం
  • 1992వ సంవత్సరానికి ఉత్తమనటిగా రేవతికి ఫిలింఫేర్ పురస్కారం

Be the first to review “అంకురం – రేవతి, శరత్ బాబు, ఓం పూరి, చారుహాసన్, తనికెళ్ల భరణి”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.