కొత్త లోకం: అధ్యాయం 1: చంద్ర

చంద్ర అలియాస్ నీలి (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఒక మిషన్‌లో ఆమె తృటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మూతోన్(మమ్ముట్టి వాయిస్) ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చిరిస్తాడు. దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్‌గా జీవిస్తుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ(నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుని ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ(శాండి మాస్టర్)కి చంద్రపై అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది..? అసలు చంద్ర ఎవరు..? సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు..? గతంలోని ఎలాంటి నిజాలు ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తాయి..? అనేది ఈ సినిమా కథ.
IMDb రేటింగ్: 8.5/10

Cast & Crew

Fun Facts of Movie

Kotha Lokah Chapter 1: Chandra | Kalyani | Naslen | Dominic Arun

* మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సూపర్‌హీరో సినిమాలు చాలా తక్కువ. ఈ క్రమంలో ఆ లోటును భర్తీ చేసేందుకు మలయాళ సినిమా మేకర్స్ లోక చిత్రంతో మనముందుకు వచ్చారు. టైటిల్ పాత్రలో కళ్యాణి ప్రియదర్శి చాలా ఈజ్‌తో నటించింది. ఆమె తన హావభావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషన్‌తో పాటు యాక్షన్‌లోనూ అదరగొట్టింది.

  • దర్శకుడు డొమినిక్ అరుణ్, నిర్మాత దుల్కర్ సల్మాన్ తీయాలనుకుంటున్న ‘లోక 1: చంద్ర’ యూనివర్శ్ లో ఇది తొలి భాగం మాత్రమే.
  • అందువల్ల జవాబు దొరకని ప్రశ్నలు చాలానే ఉంటాయి. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడితే… మిగిలిన భాగాలను తెరకెక్కించినప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు దొరికే ఆస్కారం ఉంటుంది.
  • కేరళ జానపద గాథలను ఆధునిక సూపర్‌హీరో టెంప్లేట్‌తో ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
  • ఈ మూవీ ప్రథమార్ధం ఆసక్తికరంగా ఉన్నా… ద్వితీయార్థం అంతా కంగాళీగా సాగింది.
  • సెకండ్ హాఫ్ లో టొవినో థామస్ ఎంట్రీ, సౌబిన్ షాహిర్ గెస్ట్ రోల్, క్లయిమాక్స్ లో దుల్కర్ సల్మాన్ కనిపించడం… ఇవి మలయాళీ ప్రేక్షకులకు కొంత ఆనందాన్ని కలిగించొచ్చు కానీ తెలుగువాళ్ళకు వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలాంటి అదనపు ఉత్సాహాన్ని ఇవ్వదు.
  • రొటీన్ చిత్రాలకు కాస్తంత భిన్నంగా ఉన్నదన్న మాట తప్పితే… ‘కొత్త లోక’లో చెప్పుకోదగ్గ కొత్తదనం ఏమీ లేదు.
  • ప్రభాస్ ‘కల్కి’లో కీ-రోల్ ప్లే చేసిన అన్నా బెన్ ఇందులో సన్నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది.
  • ఈ సినిమా మెయిన్ హైలైట్ : యానిక్ బెన్ యాక్షన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ !
  • నిమిష్ రవి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
  • దుల్కర్ సల్మాన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాను తెలుగులో సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు.
  • అయితే సినిమా పబ్లిసిటీలో జరిగినట్టే… తెలుగులో వచ్చిన టైటిల్ కార్డ్స్ లోనూ బోలెడన్ని తప్పులు దొర్లాయి.
  • వాటిని గురించి మేకర్స్ కు ఇసుమంత కూడా పట్టింపులేదనేది అర్థమైంది.

Be the first to review “కొత్త లోకం: అధ్యాయం 1: చంద్ర”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.