సలాకార్ || అధికారిక ట్రైలర్ | మౌని ఆర్ | నవీన్ కె | ఫరూక్ కె | ఆగస్టు 8 | జియో హాట్‌స్టార్ స్పెషల్స్

Hotstar Specials : Salakaar | Official Trailer | Mouni R | Naveen K | Faruk K | Aug 8 | JioHotstar

ఓటీటీలో ప్రేక్షకులకు వినోదంతో పాటు, థ్రిల్‌ను పంచుతున్నాయి స్పై థ్రిల్లర్లు. ఆ కోవలోనే మరో వెబ్‌సిరీస్‌ సిద్ధమైంది. జియో హాట్‌స్టార్‌ వేదికగా ‘సలాకార్‌’: ది లెజెండ్‌ ఆఫ్ యాన్‌ ఎక్స్‌టార్డనరీ ఇండియన్‌ స్పై’ సిరీస్‌ రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ ఆగస్టు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు, ఇతర భారత భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో హాట్‌స్టార్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్‌ కథ ‘సలాకార్‌’ అంటూ జియో హాట్‌స్టార్‌ పేర్కొంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సిరీస్‌ ఒక భారతీయ గూఢచారి కథ చుట్టూ తిరుగుతుందని ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. మౌని రాయ్, నవీన్‌ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ‘సలాకార్‌’కు ఫరూక్‌ కబీర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

సౌజన్యం : ఈనాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *