మదరాసి | తెలుగు (తమిళ్ డబ్బింగ్) రివ్యూల సమాహారం

Madaraasi | Telugu (Tamil Dubbed) Reviews Collection

చిత్రం: మదరాసి

నటీనటులు: శివకార్తికేయన్‌, రుక్మిణి వసంత్‌, విద్యుత్‌ జమ్వాల్‌, బిజు మేనన్‌, విక్రాంత్‌; సంగీతం: అనిరుధ్‌; ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఎల్మోన్‌; నిర్మాత: ఎన్‌.శ్రీలక్ష్మీ ప్రసాద్‌; రచన, దర్శకత్వం: ఏఆర్‌ మురుగదాస్‌; విడుదల: 05-09-2025

త‌మిళ‌నాడులో తుపాకీ సంస్కృతిని అల‌వాటు చేసి సొమ్ము చేసుకోవాల‌నేది ఒక సిండికేట్ ప‌న్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్) అనే ఇద్ద‌రు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్ర‌క్కుల‌కొద్దీ ఆయుధాల్ని త‌ర‌లిస్తుంది. అవ‌న్నీ ఓ ఫ్యాక్ట‌రీకి చేరుతుండ‌గా ఎన్‌.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేన‌న్‌) నేతృత్వంలోని ఎన్‌.ఐ.ఏ ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్ట‌రీ మొత్తాన్ని పేల్చివేయాల‌నే ఒక ఆప‌రేష‌న్‌కి న‌డుం బిగిస్తుంది ఎన్‌.ఐ.ఎ. అయితే ఈ ఆప‌రేష‌న్ అంత సుల‌భమైన‌దేమీ కాదు. ఒక‌రి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న ర‌ఘురామ్ (శివ‌కార్తికేయ‌న్‌)ను ప్రేమ్‌నాథ్ క‌లుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్క‌చేయ‌ని ర‌ఘురామ్‌ని ఈ ఆప‌రేష‌న్‌లోకి తీసుకు రావాల‌ని  నిర్ణ‌యిస్తాడు. మ‌రి ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యిందా? అస‌లు ర‌ఘురామ్ ఎవ‌రు?అత‌నికి ప్రాణాలంటే లెక్క‌లేని త‌నం ఎందుకు? మాల‌తి (రుక్మిణీ వ‌సంత్‌)తో అత‌నికి ఉన్న సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

  • ర‌ఘురామ్ పాత్రలో శివ‌కార్తికేయ‌న్ (Sivakarthikeyan) న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న యువ‌కుడిగా అత‌ని న‌ట‌న మెప్పిస్తుంది.
  • శివ కార్తికేయ‌న్‌, రుక్మిణీ వ‌సంత్ మంచి జోడీ అనిపిస్తుంది.
  • మెడికోగా క‌నిపించిన రుక్మిణి (madharasi heroine name) క్యూట్‌గా క‌నిపిస్తూనే, భావోద్వేగాల్నీ ప‌లికించింది.
  • విద్యుత్ జ‌మ్వాల్ స్టైలిష్ విల‌న్‌గా సంద‌డి చేశాడు.
  • చిరాగ్ పాత్ర‌లో క‌నిపించిన ష‌బీర్ కూడా మెప్పిస్తాడు. 
  • ఎన్‌.ఐ.ఏ అధికారిగా బిజూమేన‌న్ న‌ట‌న మెప్పిస్తుంది.
  • విక్రాంత్‌, విమ‌లారామ‌న్ త‌దిత‌రుల పాత్ర‌లూ ఆక‌ట్టుకుంటాయి.
  • సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సుదీప్ విజువ‌ల్స్, అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.
  • నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. 
  • బ‌లాలు
  • + ప్ర‌థ‌మార్ధం
  • శివకార్తికేయ‌న్ న‌ట‌న‌
  • క‌థ‌లోని మ‌లుపులు
  • బ‌ల‌హీన‌త‌లు
  •  ఊహ‌కందే క‌థ, క‌థ‌నం
  • – ద్వితీయార్ధం
  • చివ‌రిగా: మ‌ద‌రాసి… అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకుంటాడు

సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ లింక్

మురుగదాస్ ఎంచుకున్న పాయింటే చాలా పేలవంగా ఉంది. ఆరు ట్రక్కుల్లో అక్రమ ఆయుధాలు స్టేట్ లోకి వచ్చిన తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ కాకుండా ఆపడం కోసం ముక్కూ ముఖం తెలియని వ్యక్తిని ఈ ఆపరేషన్ కోసం ఎంచుకోవడం, అతని మానసిక పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకోవడం ఏ రకంగానూ కన్వెన్సింగ్ గా అనిపించదు. సినిమా ప్రారంభం మొదలు, ముగింపు వరకూ ప్రతి సన్నివేశం కృత్రిమంగా ఉంది. కొత్తదనం ఉన్న సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. రెండు గంటల యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో హై పాయింట్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. దాంతో ఇదసలు మురుగదాస్ డైరెక్ట్ చేసిన మూవీనేనా అనిపిస్తుంది.

ఈ సినిమాను శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ తమ నటనతో కాస్తంత నిలబెట్టే ప్రయత్నం చేశారు. విద్యుత్ జమ్వాల్, షబీర్ తెరపై స్టైలిష్ గా కనిపించారు. క్లయిమాక్స్ ఫైట్ లో విద్యుత్ జమ్వాల్ తన విశ్వరూపం చూపించాడు.

ఎన్.ఐ.ఎ. అధికారిగా బిజూ మీనన్ బాగా చేశాడు.నేపథ్యంలో వచ్చే రెండు పాటల సాహిత్యం అర్థవంతంగా ఉంది. అనిరుథ్ ఆర్.ఆర్. బాగుంది. గన్ కల్చర్ కు ప్రజలను దూరంగా ఉంచాలని చెప్పిన మురుగదాస్ స్టార్టింగ్ టు ఎడింగ్ దాన్నే హైలైట్ చేశారు.శివ కార్తికేయన్ అభిమానులకు ఈ సినిమా కొంత నచ్చవచ్చేమో కానీ మిగిలిన వారికి కష్టమే.

రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: హే మురుగా!

సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ లింక్

త‌న ఫిల్మోగ్ర‌ఫీలో చాలా స్పెష‌ల్ అన‌ద‌గ్గ తుపాకీ-గ‌జినీ చిత్రాల‌నే స్ఫూర్తిగా తీసుకుని.. వాటి నుంచి ఒక మిక్చ‌ర్ పొట్లం లాంటి సినిమా తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడు మ‌ద‌రాసిలో మురుగ‌దాస్. ఒక క్రైమ్ రాకెట్.. దాన్ని న‌డిపించే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్.. అత‌ను చేప‌ట్టిన ప్ర‌మాద‌క‌ర మిష‌న్ ను ఆప‌డానికి పోలీసుల చేతిలో ఆయుధంలా మారిన హీరో. అత‌డికో మాన‌సిక స‌మ‌స్య‌.. ఇదీ బేసిక్ స్టోరీ. హీరోకు ఉన్న మాన‌సిక స‌మ‌స్య చుట్టూ కొంచెం కొత్త‌గా స‌న్నివేశాలు న‌డిపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు మురుగ‌దాస్. అలాగే త‌మిళ‌నాడులో సామాన్యుల చేతుల్లోకి తుపాకీలు ఇచ్చి గ‌న్ క‌ల్చ‌ర్ పెంచాల‌ని చూసే సిండికేట్.. దాని చుట్టూ సెట‌ప్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఈ రెండు పాయింట్ల మీద న‌డిపించిన కొన్ని ఎపిసోడ్లు ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేస్తాయి. కానీ హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ మాత్రం తేలిపోయింది. మామూలుగా సినిమాల్లో హీరోలు ఎవ‌రికో సాయం చేయ‌డం కోసం గొడ‌వ‌ల‌కు వెళ్తే హీరోయిన్లు అడ్డం ప‌డుతుంటారు. వాళ్ల‌కు దూరం అయిపోతుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం హీరో అలా సాయం చేయ‌డానికి తాను అడ్డు అనుకుని హీరోయిన్ అత‌డికి దూరం అవుతుంది. ఇది కొత్త‌ద‌నం అని మురుగ‌దాస్ అనుకున్నాడేమో కానీ.. అదంత లాజిక‌ల్ గా అనిపించ‌దు. దీని మీదే క‌థ మ‌లుపు తిర‌గ‌డంతో అది స‌హ‌జంగా అనిపించ‌క క‌థ గాడి త‌ప్పిన ఫీలింగ్ క‌లుగుతుంది.

ప్ర‌థ‌మార్ధంలో ఉన్నట్లు క‌థ‌లు మ‌లుపులు లేక‌పోవ‌డం.. విల‌న్ పాత్ర వీకైపోవ‌డం.. లాజిక్కులు లేని స‌న్నివేశాల వ‌ల్ల సెకండాఫ్ లో మ‌ద‌రాసి స్థాయి త‌గ్గి చివ‌రికి సోసో సినిమాగా మిగిలిపోయింది. మొత్తంగా చూస్తే శివ కార్తికేయన్ కోసం.. యాక్షన్ సన్నివేశాల కోసం అయితే మదరాసిపై ఒక లుక్ వేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.

  • అనిరుధ్ మ్యూజిక్ మార్కు మిస్ అయింది. బీజీఎం విషయంలోనూ అనిరుధ్ తనకున్న పేరును ఇందులో నిలబెట్టలేక పోయాడు. హీరో థీమ్ మ్యూజిక్ బావున్నా మిగతా స్కోర్ అంతా మామూలుగా అనిపిస్తుంది.
  • సుదీప్ ఎలమాన్ సినిమాటోగ్రఫీ బాగుంది.
  • నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
  • మురుగదాస్ గత చిత్రాలతో పోలిస్తే రచయితగా.. దర్శకుడిగా మెరుగైన పనితనమే చూపించాడు. ఆయన ఎంచుకున్న కథ ఆసక్తికరంగానే ఉంది. స్క్రీన్ ప్లే విషయంలోనూ కసరత్తు చేశాడు. కానీ ఒకప్పటి ఆయన చిత్రాల్లో మాదిరి ఉత్కంఠ రేకెత్తించలేక పోయాడు. ముఖ్యంగా ప్రధాన పాత్రల చిత్రణ కూడా అనుకున్నంత బలంగా లేదు. ద్వితీయార్థంలో మురుగ తన స్పార్క్ చూపించలేకపోయాడు.
  • చివరగా: మదరాసి.. కాస్త మెరిసి..
  • రేటింగ్- 2.25/5

సౌజన్యం : tupaki.com | పూర్తి రివ్యూ లింక్

ప్లస్ పాయింట్స్:

  • ఈ సినిమాలో బాగా ఇంప్రెస్ చేసే అంశాo హీరో శివ కార్తికేయన్ ఊహించని పాత్రని ఎంచుకోవడం ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
  • ఇది వరకు వచ్చిన సినిమాలు అన్నిటికంటే బహుశా రెమో తర్వాత నటుడుగా తన నుంచి ఒక సాలిడ్ రోల్ ఇది అని చెప్పొచ్చు. నటుడిగా ఈ సినిమాలో కొత్త వెర్షన్ ని తన నుంచి చూడవచ్చు. అలాగే తనపై ఫస్టాఫ్ లో ఎమోషన్స్ కానీ ఫుల్ మూవీ లో యాక్షన్ పార్ట్ కాని సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి.
  • విద్యుత్ కి సాలిడ్ రోల్ దక్కింది.
  • ఇక వీరితో పాటుగా డాన్సింగ్ రోజ్ ఫేమ్ షబీర్ కి మంచి పాత్ర దక్కింది. తన నటనా యాక్షన్ పెర్ఫామెన్స్ లు బాగున్నాయి.
  • హీరోయిన్ రుక్మిణీ వసంత్ కి సినిమాలో మంచి రోల్ దక్కింది. తన రోల్ కి ఆమె న్యాయం చేసింది.
  • బిజూ మీనన్, పి సీ 2 గా కనిపించిన నటుడు తదితర ప్రధాన తారాగణం బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

  • మురుగదాస్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ఇది అయినప్పటికీ తన వంతు కొత్తగా అన్నట్టు ఏదో ట్రై చేశారు కానీ అదేమీ అంత కొత్తగా కనిపించదు.
  • అలాగే యాక్షన్, ఎమోషనల్ పార్ట్ కూడా కొంత మేరకు ఓకే అనిపిస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆకట్టుకోలేదు. కొన్ని చోట్ల ఇవి ఫోర్స్డ్ గా కొన్ని చోట్ల నాచురల్ గా అనిపిస్తాయి. సో వీటితో తన నుంచి సాలిడ్ ట్రీట్ ని ఆశించే వారికి కొంచెం మిక్స్డ్ ఫీల్ కలుగుతుంది.
  • అలాగే సెకాండఫ్ లో కథనం కూడా అంత ఎంగేజింగ్ గా సాగలేదు. దాదాపు 40 నిమిషాల వరకు కథనం రెగ్యులర్ గా సాగుతుంది. సో ఇక్కడ సాగదీత ఫీల్ కలుగుతుంది. అలాగే పాటలు కూడా ఒకటీ రెండు తప్ప అంత ఇంప్రెసివ్ గా లేవు పైగా ఎక్కువగా కూడా ఉన్నట్లు అనిపిస్తాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘మదరాసి’ సినిమాలో శివ కార్తికేయన్ సాలిడ్ రోల్ తో ఇంప్రెస్ చేస్తాడు. తనపై యాక్షన్ పలు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే విద్యుత్ జమ్వాల్ కూడా అదరగొట్టాడు. అయితే కొన్ని చోట్ల వరకు కథనం ఓకే కానీ మిగతా కొంతమేర మాత్రం సోసో గానే అనిపిస్తుంది. ఈ సినిమాని చూడాలనుకుంటే మాత్రం కొంచెం తక్కువ అంచనాలే పెట్టుకోండి!

రేటింగ్ : 2.75/5

సౌజన్యం : 123telugu.com | పూర్తి రివ్యూ కోసం లింక్

జబర్దస్త్ మహీధర్ వీడియో రివ్యూ

Barbell Pitch meetings ఛానల్ వీడియో రివ్యూ

Ragadi Review వీడియో రివ్యూ

మూవీ మేటర్స్ రివ్యూ

సినిమా పిచ్చ ఛానల్ వీడియో రివ్యూ

మాన్ అఫ్ ఫిక్షన్ ఛానల్ వీడియో రివ్యూ

గలాట్టా ప్లస్ ఛానల్ రివ్యూ – భరద్వాజ్ రంగన్ ( ఇంగ్లీషులో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *