పరదా | రివ్యూల సమాహారం

Collection of Parada movie reviews

చిత్రం: పరదా; నటీనటులు: అనుపమ పరమేశ్వరన్‌, దర్శన్‌ రాజేంద్రన్‌, సంగీత, రాగ్‌ మయూర్‌, రాజేంద్ర ప్రసాద్‌, హర్ష వర్థన్‌, గౌతమ్‌ మేనన్‌ తదితరులు; సంగీతం: గోపీ సుందర్‌; సినిమాటోగ్రఫీ: మృదుల్‌ సుజిత్‌ సేన్‌; రచన: పూజిత శ్రీకంటి, ప్రహాస్‌ బొప్పుడి; నిర్మాత: శ్రీనివాసులు, విజయ్‌ డొంకాడ, శ్రీధర్‌ మక్కువ; దర్శకత్వం: ప్రవీణ్‌ కండ్రేగుల; విడుదల: 22-08-2025

ఈనాడు

డతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. తాను ఆచారాన్ని తప్పలేదని వేడుకున్నా… ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. ఆచారం ప్రకారం ప్రాణాలైనా వదలాలి, లేదంటే తప్పు చేయలేదనైనా నిరూపించుకోవాలని కోరతారు ఊరి ప్రజలు. దాంతో సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సి వస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి?సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  గోపీసుంద‌ర్ సంగీతం చిత్రానికి  ప్ర‌ధాన‌బ‌లం. పాట‌లు, సాహిత్యం సినిమాకి బ‌లంగా నిలిచాయి.  మ‌హిళా ఛాయాగ్రాహ‌కురాలు మృదుల్ సుజిత్ సేన్ విజువ‌ల్స్ చిత్రానికి ఓ కొత్త వ‌న్నె తీసుకొచ్చింది. పూజిత శ్రీకంటి, ప్ర‌హాస్ ర‌చ‌న మెప్పించింది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ప్ర‌వీణ్ కండ్రేగుల ఓ కొత్త ప్ర‌య‌త్నం చేశారు. సున్నిత‌మైన అంశాల్ని కూడా ఇందులో బ‌ల‌మైన ప్ర‌భావంతో చెప్పిన తీరు మెప్పిస్తుంది.

  • బలాలు
  • + బలమైన కథ
  • అనుపమ, సంగీత, దర్శన అభియం
  • ప్రథమార్ధం
  • బలహీనతలు
  • – ద్వితీయార్ధం
  • చివరిగా: ఆలోచన రేకెత్తించేలా పరదా 

సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్


ఆంధ్రజ్యోతి

ఈడు వచ్చిన అమ్మాయిలంతా మరణించే దాకా తన కుటుంబ సభ్యులు, భర్తకు తప్ప ఎవరికీ తమ ముఖాన్ని చూపించకూడదు అన్నది ప్రధానాంశం. దానిని మొదటి పది నిమిషాల్లో తోలు బొమ్మలాటతో చెప్పాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ అంతా విలేజ్‌, సుబ్బుకి ఎదురైన, సమస్య, పరిష్కారం ప్రయాణంతో మొదలవుతుంది. సెకెండాఫ్‌లో దర్శన రాజేంద్రన్‌ ఎంట్రీతో కథ కాస్త పరుగులు తీసినా తదుపరి ఇంకేదో మలుపు తిరుగుతుంది అనుకుంటే.. ధర్మశాల ప్రాంతానికి వెళ్ళే మార్గంలో అంతరాయం కలగడం, ఎటూ పోయే దారి లేక అక్కడే బస చేయడం, ట్రెక్‌, అక్కడి అందాలను ఆస్వాదించే క్రమంలో బాహ్య ప్రపంచాన్ని చూసిన సుబ్బు స్వేచ్ఛను కోరుకోవడంతో కథ ట్రాక్‌ తప్పిందనిపిస్తుంది. అక్కడక్కడా తాము వచ్చిన పనిని హింట్‌ ఇచ్చినట్లు దర్శకుడు గుర్తు చేసినా.. ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా లేదు. ఆ ట్రెక్‌ సీన్‌ అంతా సాగదీతలాగా అనిపిస్తుంది. మధ్యలో రాజేంద్రప్రసాద్‌ ఇలా వచ్చి నాలుగు ఇన్‌స్ఫైరింగ్‌ మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్యారెక్టర్‌ అవసరం లేదనిపిస్తుంది.

ట్యాగ్‌లైన్‌: చెదిరిన ‘పరదా’

రేటింగ్‌: 2.25/5

సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్


123తెలుగు.కామ్ సమీక్ష

ప్లస్ పాయింట్స్:

టిల్లు స్క్వేర్ నుంచి ఒక కంప్లీట్ గ్లామరస్ రోల్ తర్వాత అనుపమ నుంచి పూర్తిగా డిఫరెంట్ రోల్ పరదాలో చేసింది అని చెప్పాలి. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మిగా ఆమె మారిన తీరు అలాగే కనబరిచిన నటన చాలా బాగున్నాయి. చాలా సింపుల్ అండ్ సెటిల్డ్ గా అనుపమ తన పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషన్స్ పరంగా ఇతర కీలక సన్నివేశాల్లో అనుపమ బాగా చేసింది.

ఇక తనతో పాటుగా మరో ఇద్దరు అమ్మాయిలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పవచ్చు. దర్శన రాజేంద్రన్ పాత్ర సినిమాలో కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తనకి అనుపమ నడుమ సన్నివేశాలు సినిమాలో వర్కౌట్ అయ్యాయి. ఆమె తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించడమే కాకుండా మంచి కామెడీ టైమింగ్ కూడా కనబరిచి ఆకట్టుకుంది.

అలాగే మరో అమ్మాయి సంగీత క్రిష్ సినిమాలో ఎంతసేపు ఉన్నామని కాదు ఉన్న కొంతలో కూడా ఎంత ప్రభావం చూపించాం అనేది ముఖ్యం అనే మాటకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన పాత్రలో సహజత్వం అంతే సహజమైన నటన ఆమె కనబరిచి ఇంప్రెస్ చేస్తుంది. అలాగే సినిమాల్లో ధర్మస్థల ఎపిసోడ్స్ బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో సంగీతం మంచి ప్రభావం చూపింది.

మైనస్ పాయింట్స్:

మంచి కథ అందుకు తగ్గట్టుగా సెటప్ బాగున్నాయి కానీ నెమ్మదిగా కథనం ముందుకు వెళ్లే కొద్దీ పరిస్థితులు మారడం గమనించవచ్చు. ముఖ్యంగా పాత్రలు వాటిని తీర్చిదిద్దిన విధానం ఇంకాస్త మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది.

అనుపమ రోల్ లో కూడా అంతే. ఆమె పాత్ర చేసే పోరాటంలో అంత డెప్త్ కనిపించలేదు. అలాగే కథనం ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనుకుంటే సెకండాఫ్ లో అసలు సమస్య మొదలవుతుంది. ఇది స్లోగా రిపీటెడ్ గా కొనసాగుతున్న భావన కలుగుతుంది. ఎమోషన్స్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.

ప్రముఖ ముఖాలు రాజేంద్ర ప్రసాద్, గౌతమ్ మీనన్ లాంటి వారు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వినియోగించుకోలేదు. యువ నటుడు రాగ్ మయూర్ రోల్ కూడా అంత ఇంపాక్ట్ కలిగించలేదు. ఇక సెకండాఫ్ లో కోల్పోయిన ఇంట్రెస్ట్ క్లైమాక్స్ వరకు అలా కొనసాగుతుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘పరదా’ చిత్రంలో మహిళలకి సంబంధించిన కొన్ని అంశాలు వారికి కనెక్ట్ అవుతాయి అలాగే ఫస్టాఫ్ వరకు కూడా బాగానే ఉంది కానీ ఒక స్లో సెకండాఫ్, కదలని మూమెంట్స్ ఆడియెన్స్ లో ఉన్న ఉత్సుకతను నీరసపరుస్తాయి. ఇంకా బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే మహిళలు వరకు కొన్ని చోట్ల సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.

2.75/5

సౌజన్యం : 123తెలుగు.కామ్ | పూర్తి రివ్యూ కోసం లింక్


మహీధర్ వైబ్స్ ఛానల్ రివ్యూ


Thyview ఛానల్ రివ్యూ


Cinemapicha ఛానల్ రివ్యూ

Poolachokka ఛానల్ రివ్యూ

FEATU GADI MEDIA రివ్యూ

Movies4u ఛానల్ రివ్యూ






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *