‘ది ప్యారడైజ్‌’ The paradise | ట్రైలర్ | సరికొత్తగా ‘నాని’ పేరు !

The Paradise Glimpse : RAW STATEMENT – Telugu | Nani | Srikanth Odela | Anirudh | SLV Cinemas

విజయవంతమైన ‘దసరా’ తర్వాత కథానాయకుడు నాని – దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మరోసారి ‘ది ప్యారడైజ్‌’ (The paradise) అంటూ విభిన్న కథతో రానున్నారు. తాజాగా ఈ సినిమాలో నాని పేరును ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో నాని డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన ‘జడల్‌’ (Jadal) పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ‘ఇది ఒక అల్లికగా ప్రారంభమై.. విప్లవంగా ముగిసింది’ అని పేర్కొన్నారు.

గతంలో దర్శకుడు ఈ సినిమాలో నాని లుక్‌ గురించి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ‘‘నాని జడల వెనక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ భావోద్వేగం దాగి ఉంది. నా చిన్నతనంలో మా అమ్మ నాకు అలానే జడలు వేసేది. ఐదోతరగతి వరకు జుట్టు అల్లి స్కూల్‌కు పంపేది.  ఈ లుక్‌ సినిమా కథకు ఎలా కనెక్ట్‌ అవుతుందని మాత్రం ఇప్పుడే చెప్పను’’ అని అన్నారు. తిరుగుబాటు, నాయకత్వంతో పాటు తల్లీకొడుకుల అనుబంధం కథకు కీలకంగా నిలవనున్నట్లు ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతోపాటు… మొత్తం 8 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *