Dadasaheb Phalke Film Festival
‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎప్)- 2025’ అట్టహాసంగా జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), ఉత్తమ నటిగా కృతిసనన్ (Kriti Sanon) అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా ‘కల్కి 2898 ఏడీ’ () ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా, ‘స్త్రీ 2’ (Stree 2) బెస్ట్ మూవీగా నిలిచాయి. 2024గానూ సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ ప్రతిభ చాటిన వారికి పురస్కారాలు దక్కాయి (Dadasaheb Phalke International Film Festival). మరికొందరి విజేతల వివరాలివీ..
- బెస్ట్ డైరెక్టర్: కబీర్‌ఖాన్
- ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్: దినేశ్ విజన్
- క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిల్మ్: లాపతా లేడీస్
- క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్: విక్రాంత్ మస్సే
- క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్: నితాన్షీ గోయెల్
- బెస్ట్ వెబ్‌సిరీస్: హీరామండి
- బెస్ట్ యాక్టర్ (వెబ్‌సిరీస్): జితేంద్ర కుమార్
- బెస్ట్ యాక్ట్రెస్ (వెబ్‌సిరీస్): హ్యుమా ఖురేషి
- ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండియన్ సినిమా: శిల్పాశెట్టి
- అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ: జీనత్ అమన్
- అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ: ఉషా ఉతుప్
- ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్: ఏఆర్ రెహమాన్
సౌజన్యం : ఈనాడు
