Genie – ABDI ABDI Video Song | AR Rahman | Ravi Mohan | Arjunan Jr. | Kalyani | Krithi Shetty
మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ మొట్టమొదటి విమెన్ సూపర్ హీరోగా మారి లోక సినిమాతో ఆమె అందరినీ మెప్పించింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఒక స్ఫూర్తి నింపింది. ఇక నుంచి కళ్యాణి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపిస్తుందని నెటిజన్స్ సైతం ఎంతో ఆశగా ఎదురుచూసారు. కానీ, కళ్యాణి దానికి విరుద్ధంగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ కనిపించి వారికి షాక్ ఇచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ హీరోగా అర్జునన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జీనీ. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా అబ్ది అబ్ది అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టారు.


