
వెంకటేశ్ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన అదే జోష్‌తో మరో సినిమాను (Venky77) ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. నేడు షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ రెండు సినిమాలకు వర్క్ చేశారు. వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’లకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే వెంకీ నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ (Trivikram) గత చిత్రాల్లాగే ఇందులోనూ ఇద్దరు నాయికలకు అవకాశమున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్‌తో పాటు రుక్మిణీ వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం బలంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
సౌజన్యం : ఈనాడు