వెంకటేష్
Acting
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి. ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశాడు. వెంకటేష్ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు కాగా 2025 సంవత్సరంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సీనియర్ హీరోల్లో 300 కోట్లు సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించాడు.