మహేష్ బాబు

ఘట్టమనేని మహేష్ బాబు (జననం 9 ఆగస్టు 1975) తెలుగు సినిమాలో పనిచేసే ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత.ఆయన భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం పొందే నటులలో ఒకరు మరియు 2012 నుండి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించారు.ఆయన 25 కి పైగా చిత్రాలలో నటించారు మరియు తొమ్మిది నంది అవార్డులు,ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు,నాలుగు SIIMA అవార్డులు మరియు రెండు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు వంటి అనేక ప్రశంసలను అందుకున్నారు.