ఓజీ – పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా – రివ్యూలు – లింక్స్

OG Reviews & Links

పవన్‌కల్యాణ్‌, ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంక మోహన్‌, అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్‌, తేజ్‌ సప్రు, హరీశ్‌ ఉత్తమన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు; సంగీతం: తమన్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, మనోజ్‌ పరమహంస; నిర్మాత: డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి; రచన, దర్శకత్వం: సుజీత్‌; విడుదల: 25-09-2025

అనగనగా ఒక రాజు. అతనికి రక్షణగా నిలిచిన ఓ యోధుడు. కానీ, శత్రువుల ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు పదేళ్లపాటు కన్నతండ్రిలాంటి రాజుకి దూరమవుతాడు. ఇదే అదనుగా శత్రు మూక చెలరేగిపోతుంది. ఆ రాజుని ఇబ్బందులపాలు చేసి, అతని రాజ్యాన్ని అక్రమ కార్యకలాపాలకి అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రాజుకీ, రాజ్యానికీ కష్టం వచ్చిందని తెలిశాక ఆ యోధుడు మళ్లీ తిరిగొచ్చాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్నదే ఈ కథ. ఇందులో రాజు సత్య దాదా (ప్రకాశ్‌రాజ్‌) అయితే, ఆయనకి రక్షణగా నిలిచిన యోధుడే ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కల్యాణ్‌). సత్య దాదానీ, ఆయన రాజ్యంలాంటి పోర్ట్‌ని కష్టాల పాలు చేసేందుకు వచ్చిన వాడే ఓమి (ఇమ్రాన్ హష్మీ). క్రూరమైన మనస్తత్వమున్న ఓమిని… ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఓమి వెనక ఎవరున్నారు? అసలు ఈ ఓజీ ఎవరు? అతనికీ జపాన్‌లోని సమురాయ్ వంశానికీ సంబంధం ఏమిటి?తన పేరు చెబితే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గడగడలాడిపోతుంది? పదేళ్ల తర్వాత కూడా మళ్లీ శత్రువుల్ని అదే స్థాయిలో భయపెట్టాడా లేదా?) తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  •  పవన్‌ ఇమేజ్‌కి, ఆయన స్వాగ్‌కి తగ్గట్టుగా ఆయుధాలు చేతికందించి… మరింత స్టైలిష్‌గా ఆయన్ని తెరపై ఆవిష్కరిస్తూ… అడుగడుగునా క్లైమాక్స్‌ని మించిపోయే ఎలివేషన్స్‌తో తెరపై అగ్ని తుఫాన్‌ని ఆవిష్కరించారు డైరెక్టర్ సుజీత్.
  • సుజీత్‌లోని అభిమాని కథ, డ్రామా కంటే కూడా ఇతర అంశాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు అనిపిస్తుంది.
  • ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుడిని ఓ కొత్త కథా ప్రపంచంలోకి తీసుకెళతాయి.
  • విరామానికి ముందు, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్.
  • రెండో భాగానికి కావల్సినంత సరంజామా ఈ కథలో ఉంది.
  • పవన్‌కల్యాణ్‌ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించనంత స్టైలిష్‌గా ఇందులో కనిపించారు. ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు కూడా అలరిస్తాయి.
  • ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) కూడా స్టైలిష్‌గా కనిపించినా, కథానాయకుడికి దీటుగా ఆ పాత్రను ఇంకాస్త బలంగా చూపించాల్సింది.
  • కణ్మని పాత్రలో ప్రియాంక మోహన్ (Priyanka mohan) అందంగా కనిపించింది.

సాంకేతికంగా ఈ సినిమాకి ఎక్కువ మార్కులు పడతాయి. ప్రతి విభాగం అత్యుత్తమ పనితీరుని కనబరిచింది. ముఖ్యంగా తమన్‌. ఆయన నేపథ్య సంగీతం సినిమాకి బలమైన హంగు. పాటలు కూడా ఆకట్టుకుంటాయి. రవి కె.చంద్రన్‌, మనోజ్ పరమహంస విజువల్స్ సినిమాకి మరో ఆకర్షణ. ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల పనితీరు మెప్పిస్తుంది. సుజీత్ స్టైలిష్ మేకింగ్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.

  • బలాలు
  • + పవన్‌కల్యాణ్‌
  • హీరోయిజం, ఎలివేషన్స్, యాక్షన్
  • +, నేపథ్య సంగీతం.. విజువల్స్
  • బలహీనతలు
  •  ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • – ఆసక్తి రేకెత్తించని కథనం
  • చివరిగా: ఓజీ… ఫ్యాన్స్ ఖుషీ

సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్

‘ఓజీ’ కోసం సుజీత్ రాసుకున్న కథేమీ కొత్తది కాదు. అయితే… హీరో, విలన్ తో పాటు ఇతర పాత్రలకు సుజీత్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జపాన్ లో కథ మొదలు కావడంతో ఏదో కొత్త విషయాన్ని సుజీత్ చెప్పబోతున్నాడనే భావన ఆడియెన్స్ కు కలుగుతుంది. జపాన్ నుండి ముంబై మహా నగరానికి వచ్చిన తర్వాత సత్యదాదా నేర సామ్రాజ్యాన్ని ఓజీ విస్తరింప చేయడం, పేరరల్ గవర్నమెంట్ ను నడింపించే వరకూ అది వెళ్ళడం ఆసక్తికరంగా ఉంది. రొటీన్ అండర్ వరల్డ్ స్టోరీగా ఇది పైకి కనిపించినా… సుజీత్ తనదైన మార్క్ స్క్రీన్ ప్లే తో లేయర్స్ గా ఈ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సత్యా దాదా కుటుంబానికి ఓజీ దూరం కావడం, అజ్ఞాతంలో అతను గడిపిన జీవితం, భార్యతో అనుబంధం, కూతురు కోసం పరితపించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సాగే బ్లడ్ షెడ్ ఒకింత అసహనానికి గురి చేసినా… షార్ప్ ఎడిటింగ్ కారణంగా అదేమంత పెద్ద అవరోధంగా అనిపించదు. 1993లో ముంబై నగరాన్ని కుదిపేసిన బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ ను జ్ఞప్తికి తెచ్చేలా ఈ కథను సుజీత్ రాసుకున్నాడు. క్యారెక్టర్స్ ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్థ సుజీత్ అండ్ టీమ్ స్టోరీ మీద పెట్టలేదని తెలిసిపోతోంది. కథ మరింత బలంగా ఉండి ఉంటే ‘ఓజీ’ రేంజ్ మరింత పెరిగి ఉండేది.

పవన్ కళ్యాణ్‌ తెర మీద కనిపించే ప్రతి సీన్ ‘హై’ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. అలానే క్లయిమాక్స్ లో చేతిలోకి తీసుకునే ఆయుధానికి ‘జానీ’ పేరు పెట్టడం కూడా ఫాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేదే. ఈ సినిమాలో పవన్ తర్వాత ఖచ్చితంగా మాట్లాడాల్సింది శ్రియారెడ్డి గురించి. సత్యా దాదా కోడలిగా పౌరుషానికి ప్రతీక అన్నట్టుగా శ్రియారెడ్డి… గీత పాత్రను పోషించింది. అండర్ వరల్డ్ డాన్ పాత్ర ప్రకాశ్‌ రాజు మరింత మెచ్యూరిటీతో పోషించారు. ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. ఈ మధ్య వచ్చిన ‘రజాకార్’ మూవీలో సర్దార్ పటేల్ గా నటించిన తేజ్ సప్రూ ప్రధాన ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు. ప్రియాంక అరుల్ మోహన్ కు లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ లభించినా… మెరుగైన నటన ప్రదర్శించింది. ఇతర ప్రధాన పాత్రలను సుదేవ్ నాయర్, అర్జున్ దాస్, అభిమన్యుసింగ్, ‘కిక్’ శ్యామ్, వెంకట్, హరీశ్ ఉత్తమన్, ఉపేంద్ర లిమాయే, శుభలేఖ సుధాకర్ తదితరులు పోషించారు. అజయ్ ఘోష్‌, జీవా, రాహుల్ రవీంద్రన్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మెట గాంధీ కూడా తెర మీద కనిపిస్తారు. జాకీష్రాఫ్‌ ఒకే ఒక్క సీన్ లో మెరుపులా మెరిశాడు.

ట్యాగ్ లైన్: ఓజీ ఊచకోత!

రేటింగ్ : 3/5

సౌజన్యం : చిత్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్

ఐతే కథ సంగతి ఎలా ఉన్నా.. సూపర్ స్టైలిష్ గా కనిపించే పవన్ కళ్యాణ్ కు బలమైన ఎలివేషన్ సీన్లు పడడం.. యాక్షన్ ఎపిసోడ్లు పేలిపోవడంతో ‘ఓజీ’ పవన్ అభిమానులనే కాక మాస్ ప్రేక్షకులనూ ఎంగేజ్ చేస్తుంది. విపరీతమైన బిల్డప్ తర్వాత వచ్చే ఓజాస్ పరిచయ సన్నివేశం బాగానే పేలింది. దాన్ని మించి ఇంటర్వెల్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుంది. సినిమాలో మేజర్ హైలైట్ ఇంటర్వెల్ ఎపిసోడే అనడంలో సందేహం లేదు. ఇలాంటి ఎలివేషన్ సీన్లు కొత్తేమీ కాదు కానీ.. అదేమీ చూడని సన్నివేశం కాదు.. అయినా సరే మాస్ ప్రేక్షకులకు అది పూనకాలు తెప్పిస్తుంది. దర్శకుడు.. కెమెరామన్.. మ్యూజిక్ డైరెక్టర్.. ముగ్గురూ కలిసి తమ బెస్ట్ ఇచ్చారు ఆ ఎపిసోడ్లో.

ద్వితీయార్దంలో ఫాలో అప్ కూడా బాగానే ఉంది. ‘ఓజీ’ ఫస్ట్ టీజర్ గ్లింప్స్ లో చూపించిన పోలీస్ స్టేసన్ ఎపిసోడ్ సినిమాలో మరో హైలైట్. ఇక్కడ దర్శకుడిగా సుజీత్ పనితనం కనిపిస్తుంది.

హీరో ముందు విలన్ పాత్ర అంత బలంగా కనిపించకపోవడం మైనస్. కథలో ఏదైనా గొప్ప ట్విస్టు ఉంటుందేమో అని ఆశిస్తే.. నిరాశ తప్పదు. కొన్ని మలుపులు ఉన్నప్పటికీ అవి అంతగా పండలేదు. ద్వితీయార్ధాన్ని నిలబెట్టేంత డ్రామా కథలో లేకపోయింది.

సినిమాలో ప్రథమార్థంలో ఉన్న వేగం ద్వితీయార్ధంలో కనిపించదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులో టేకింగ్ బాగున్నప్పటికీ.. ఆ ఎపిసోడ్ పేలిపోయే రేంజిలో అయితే లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. పవన్ అభిమానులకు అయితే ‘ఓజీ’ కనువిందుగా అనిపిస్తుంది. ఎలివేషన్లకు.. యాక్షన్ సీక్వెన్సుల్లో మెరుపులకు ఇందులో లోటు లేదు. కానీ అంతకుమించి విశేషంగా ఏముందని చూసే సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఒకింత నిరాశ తప్పదు.

ప్రియాంక అరుల్ మోహన్ బాగా చేసింది. తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా ప్రియాంక తన ప్రాధాన్యతను చాటుకుంది. విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. మరో విలన్ సుదేవ్ నాయర్ ఆకట్టుకున్నాడు. సత్య దాదాగా కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ రాణించాడు. అర్జున్ దాస్ పాత్ర నిరాశపరుస్తుంది. సినిమాలో దాని ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. గీత పాత్రలో శ్రియా రెడ్డి బాగా చేసింది. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ తన ఉనికిని చాటుకుంది. తేజ్ సప్రు.. ఉపేంద్ర లిమాయే.. మిగతా నటీనటులంతా మామూలే.

  • ‘ఓజీ’ సినిమాకు తెర ముందు పవన్ హీరో అయితే.. తెర వెనుక కథానాయకుడు తమనే. బీజీఎంతో అతను తాండవం ఆడేశాడు. సూపర్ స్టైలిష్ గా సాగుతూ.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది స్కోర్. పాటలు.. బీజీఎం అన్ని మిక్స్ అయిపోయి ఒక టెంపోలో సాగుతాయి. ఎలివేషన్ సీన్లలో తమన్ బీజీఎం మోతెక్కిపోయింది.
  • రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణం కూడా సూపర్బ్. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. సుజీత్ అభిరుచికి తగ్గట్లుగా స్లైలిష్ విజువల్స్ తో సినిమాకు మంచి లుక్ తీసుకొచ్చారు రవిచంద్రన్.
  • నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చాలా రిచ్ గా తీశారు.
  • ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సుజీత్.. తన అభిమాన కథానాయకుడిని ఎంత స్టైలిష గా చూపించాలి.. ఎలాంటి ఎలివేషన్లు ఇవ్వాలి అన్న విషయంలో అతను విజయవంతం అయ్యాడు. తన టేకింగ్ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్లు.. ఎలివేషన్ సీన్లు బాగా తీర్చిదిద్దుకున్నాడు.
  • కానీ తన కథలో కొత్తదనం చూపించలేకపోయాడు. కథనం కూడా కొంచెం ఎగుడుదిగుడుగా సాగుతుంది. డ్రామా అనుకున్నంతగా పండలేదు.

చివరగా: ఓజీ.. పీక్ ఎలివేషన్స్.. వీక్ ఎగ్జిక్యూషన్

రేటింగ్ -2.75/5

సౌజన్యం : తుపాకీ.కామ్ | పూర్తి రివ్యూ కోసం లింక్

మహీధర్ వైబ్స్ ఛానల్ వీడియో రివ్యూ

HitTVTalkies

Thyview ఛానల్ వీడియో రివ్యూ

Ragadi

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజి ఒక జంబో బిర్యానీ ప్యాక్ లాంటిది అని చెప్పవచ్చు.

ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా పవర్ స్టార్ తన మార్క్ స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో డైనమిక్ గా స్క్రీన్ పై కనిపించారు.

అలాగే ఓజాస్ కంప్లీట్ గా యాక్షన్ లో దిగాక సీన్స్ కూడా ఫాన్స్ కి ఫీస్ట్ ఇస్తాయి. ఇక తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒకింత ఆశ్చర్య పరుస్తుంది అని చెప్పవచ్చు. తన నటన అయితే ఏమి పవన్ కళ్యాణ్ తో కెమిస్ట్రీ కానీ ఇది వరకు చూసిన ప్రియాంకేనా అన్నట్టు అనిపిస్తుంది.

ఇక వీరితో పాటుగా విలన్ గా ఇమ్రాన్ హష్మీకి సాలిడ్ సీన్స్ పడ్డాయి. ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్ కి మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటి శ్రేయ రెడ్డి కూడా సాలిడ్ రోల్ లో కనిపించి మెప్పిస్తుంది.

ఇక నటుడు ప్రకాష్ రాజ్ సత్య దాదాగా ఎప్పటిలానే మంచి నటన కనబరిచారు. ఇంకా సెకండాఫ్ లో సాలిడ్ స్కోర్ తో సాగే సన్నివేశాలు మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా సుజీత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజ్ కలిగిస్తుంది. ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి. ఈ రెండు పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మొదటి నుంచీ చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఉంది. ఆల్రెడీ అందరికీ తెలిసిన ఒక గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ అందులో హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఈ టెంప్లెట్ ని అంతా ఫిక్స్ అయ్యారు.

అలా ఊహించిన రీతిలోనే ఇందులో ప్లాట్ కూడా కనిపిస్తుంది. సో మరీ కొత్తదనం కోరుకునేవారు డిజప్పాయింట్ అవుతారు. అలాగే పవన్ కి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా అంశాలు మాత్రం చాలా రొటీన్ గా కనిపించాయి అని చెప్పక తప్పదు.

ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ ఫ్లిక్ లో యకూజాలు, సమురాయ్ పాయింట్ తప్పితే ఇంకో అంశం పెద్దగా ఎగ్జైట్ చేయదు. ఇక వీటితో పాటుగా సినిమాలో వావ్ అనిపించే సాలిడ్ ట్విస్ట్ లు టర్నింగ్ లు లాంటివి కూడా కనిపించవు. బలమైన ఘర్షణ, ఇంకా ఏదో మిస్సవుతుంది, ఏదో మిస్సవుతుంది అన్న ఫీల్ లోనే సినిమా కొనసాగుతుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఓజి” పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పాలి. సుజీత్ పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తుంది. తన బ్యాక్ స్టోరీ కానీ తనపై ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీన్స్ గాని ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి. ఈ విషయంలో మాత్రం సుజీత్ సాలిడ్ వర్క్ అందించాడు. ఇక వీటితో పాటుగా థమన్ వర్క్ ఇంకా కెమెరా వర్క్ కూడా సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఒక స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే ‘ఓజి’ ట్రీట్ ఇస్తుంది.

రేటింగ్ : 3.25/5

సౌజన్యం : 123telugu.com పూర్తి రివ్యూ కోసం లింక్

ప్రధమార్ధంలో పాత్రల పరిచయాలు, ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి. ఇంటర్వల్ బ్లాక్ బలంగానే ఉంది. కానీ మొదటి నుంచి డ్రామా పార్ట్ హత్తుకోకుండా పోయింది. హీరో హీరోయిన్ మధ్యన బంధం ప్రేక్షకుల మనసుని తాకేలా ఎస్టాబ్లిష్ కాలేదు.

ఇక ద్వితీయార్ధానికి వస్తే అదే తరహా ఎమోషన్ లేని కథనం, అవసరంలేని పాత్రలు, అవసరానికి మించిన ఎలివేషన్స్, అక్కర్లేని ఉపకథలు. మొత్తం మీద సినిమా మొత్తం కంటిని దాటి మనసుని తాకదు. ఏ పాత్ర చస్తున్నా ఏ ఫీలింగూ కలగదు.

ఇక ఇందులో బాగున్నదేమిటో చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ లుక్, తమన్ సంగీతం.

మొత్తంగా చూస్తే ఈ “ఓజి” ప్రధానంగా ఫ్యాన్స్ కోసం అన్నట్టుగా ఉంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కి ఈ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన సినిమా లేదు. కథగా రాసుకున్నది యావరేజ్ అయితే, సాంకేతికంగా తెరకెక్కించిన విధానం మాత్రం క్లాస్ గా ఉంది. హైప్ కి తగిన విషయం ఉందా అంటే ఉందని మాత్రం అనిపించదు. అంచనాలు పెట్టుకోకపోతే ఏమో కానీ, పెట్టుకుని వెళ్తే మాత్రం ఎలివేషన్, నరుక్కోవడం తప్ప ఏముంది ఇందులో అనిపిస్తుంది. “ఇంకోసారి ఇలా చేస్తే వార్ణింగ్ నీ మొహానికి కాదు, నీ మొండేనికి ఇస్తా..” అనే డైలాగ్ ఫస్టాఫులో బాగా పడింది. కథనంలో పీక్స్ తెప్పించాలంటే కీలకమైన సీన్స్ లో అటువంటి మెరుపులు మరిన్ని ఉండాల్సింది. ఒక సీన్లో మరాఠీలో అరవడం, ఇంకో సీన్లో గన్ పేలుస్తూ ఎమోషనల్ గా కేకలుపెట్టడం కాకుండా సటిల్ గా ఉంటూ, సింగిల్ లైనర్స్ చెప్పుంటే ఓజి పాత్ర రజనీకాంత్ బాషా రేంజులో గుర్తుండిపోయేది. ఆ పంథాలో వెళ్లకుండా ఫక్తు న్యూ జెనెరేషన్ గ్యాంగ్ స్టర్ స్టోరీని తనకు తోచిన రీతిలో చెప్పుకుంటూ పోయాడు దర్శకుడు. సినిమా అంతా అయ్యాక ఎలా ఉంది అని అడిగితే అద్భుతం, అమోఘం అని కాకుండా “ఓకే జీ” అని మాత్రం చెప్పాలనిపించే చిత్రం ఈ “ఓజి”.

బాటం లైన్: ఓకే జీ

సౌజన్యం : గ్రేట్ఆంధ్రా.కామ్ | పూర్తి రివ్యూ లింక్

Nippu Nagaraj ఆడియో రివ్యూ 🙂

Mr B ఛానల్ వీడియో రివ్యూ

Barbell Pitch Meetings వీడియో రివ్యూ 😔

Man Of Fiction వీడియో రివ్యూ

Cinemapicha వీడియో రివ్యూ

Kotha Muchata ఆడియో రివ్యూ

HashtagU తెలుగు











Leave a Reply

Your email address will not be published. Required fields are marked *