బ్యూటీ… మారుతి నిర్మించిన ప్రేమకథా చిత్రం | రివ్యూలు-లింక్స్

Beauty… a love story film produced by Maruthi-Reviews-Links

బ్యూటీ; నటీనటులు: అంకిత్‌ కొయ్య, నీలఖి, నరేశ్‌, వాసుకీ తదితరులు; సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌; కథ, స్క్రీన్‌ప్లే: ఆర్‌.వి. సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: జె.ఎస్‌.ఎస్‌. వర్ధన్‌; విడుదల తేదీ: 19-09-2025

కథేంటంటే: నారాయణ (నరేశ్‌)ది మధ్యతరగతి కుటుంబం. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. తనకు కూతురు అలేఖ్య (నీలఖి) అంటే పంచ ప్రాణాలు. ఆమె అడిగింది కాదనకుండా కొనిస్తూ.. అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. ఇంటర్‌ చదివే నీలఖికి అనుకోకుండా పెట్‌ ట్రైనర్‌ అర్జున్‌ (అంకిత్‌)తో పరిచయం ఏర్పడుతుంది. కొంతకాలానికి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ రోజు అలేఖ్య.. అర్జున్‌తో అసభ్యకరంగా వీడియో కాల్‌ మాట్లాడుతుండగా ఆమె తల్లి (వాసుకీ) చూస్తుంది. దీంతో, ఆమె చేయి చేసుకోగా అలేఖ్య కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అర్జున్‌ ఆమెను తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లడంతో.. వీళ్లిద్దర్నీ వెతుక్కుంటూ నారాయణ కూడా వెళతాడు. మరోవైపు, అమ్మాయిల్ని లైంగికంగా వేధించే ఓ ముఠా కోసం హైదరాబాద్‌ పోలీసులు గాలిస్తుంటారు. ఆ గ్యాంగ్‌లోని ఒకడు అలేఖ్యను వెంబడిస్తూనే హైదరాబాద్‌ వెళతాడు. మరి, వీళ్లంతా హైదరాబాద్‌ చేరుకున్నాక ఏం జరిగింది? ఈ ప్రేమ జంటకు.. ఆ నేర ముఠాతో విరోధమేంటి? వీళ్ల విషయంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? నారాయణ (Naresh)కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? కూతుర్ని కలుసుకున్నాడా? అన్నది మిగతా కథ.

  • బలాలు
  • + నరేశ్, అంకిత్‌ నటన
  • + తండ్రికూతుళ్ల ఎమోషన్‌
  • + సంగీతం
  • బలహీనతలు
  •  కొత్తదనం లేని కథ
  •  ఊహకు అందే స్క్రీన్‌ప్లే
  • చివరిగా: పేరుకే ‘బ్యూటీ’

సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ లింక్

  • ఓ మధ్య తరగతి కుటుంబం, కాస్త ఎఫెక్షన్‌ చూపిస్తే ప్రేమ అని నమ్మే అమ్మాయి, మాయ మాటలతో అమ్మాయిలను ట్రాప్‌ చేసే యువకులు.. దాని ద్వారా ఎదురైన సమస్యలతో క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది.
  • హీరో,హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్‌ సీన్స్‌ బాగా పండాయి. ఫస్టాఫ్‌ అంతా తెలిసిన కథతో సోసోగా సాగింది. ఇదంతా చూశాక కథలో ఏదో ట్విస్ట్‌ ఉంటుంది.. లేకపోతే ఇంత రొటీన్‌ కథతో దర్శకుడు ఫస్టాఫ్‌ మొత్తం ఎలా నడిపిస్తాడు అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్‌ తర్వాత ఓ పెద్ద ట్విస్ట్‌.
  • ఎంతో బలంగా ఉండాల్సిన క్లైమాక్స్‌ తేలిపోయినట్లు అనిపిస్తుంది. తన కూతురు జాడ కోసం తండ్రి పడే తపన నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో నరేశ్‌ భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు. ఎక్స్‌పోజ్‌ లేకపోతే సినిమాలే చూడరు అన్నట్లు తన క్యూట్‌నెస్‌తోనే అలరించిన నీలాఖితో స్కిన్‌ షో చేయించాల్సిన అవసరం లేదనిపించింది.
  • అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమను పంచే అమ్మాయిగా, మధ్యతరగతి తండ్రికి గారాల బిడ్డగా నీలఖి అద్భుతంగా నటించింది. పాత్రకు తగ్గట్టు చక్కని వేరియేషన్స్‌ చూపించింది. క్యూట్‌గా, బబ్లీగా కనిపిస్తూనే గ్లామర్‌ షోతోనూ మెప్పించింది. తెరపై ఆమె కనబర్చిన నటన చూస్తే చిన్న సినిమాలకు ప్రామిసింగ్‌ హీరోయిన్‌ దొరికిన భావన కలుగుతుంది.
  • అర్జున్‌ క్యారక్టర్‌లో అంకిత్‌ కొయ్య ఎనర్జీగా నటించాడు.
  • మధ్య తరగతి తల్లిదండ్రులుగా నరేశ్‌, వాసుకి పాత్రలకు వంద శాతం యాప్ట్‌ అయ్యారు. కూతుర్నే పంచప్రాణాలు గా భావించే తండ్రిగా సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగాలు పండించారు నరేష్. ఆ పాత్రలో నరేష్ కాకుండా ఓ తండ్రి కనిపించారు.
  • సిఐ ‘అన్వర్‌’గా మలయాళ నటుడు నితిన్‌ ప్రసన్న పాత్రకు న్యాయం చేశారు.
  • మురళీధర్‌ గౌడ్‌, ప్రసాద్‌ బెహరా, నాగేంద్ర పరిధి మేరకు నటించారు.
  • సాయికుమార్‌ దార కెమెరా పనితనం న్యాచురల్‌గా ఉంది.
  • విజయ్‌ బుల్గానిన్‌ పాటలు, నేపథ్యం సంగీతం సినిమాను ముందుకు నడిపించింది.
  • ఎడిటింగ్‌ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే రన్‌ ఇంకా షార్ప్‌గా ఉండేది.
  • అక్కడక్కడా సీరియల్‌ చూసిన భావన కలుగుతుంది.
  • నిర్మాణ విలువలు బావున్నాయి.

క్రైమ్‌తో ముడిపెట్టిన రొటీన్‌ ప్రేమ కథ ఇది. ఈ తరహా కథలతో చాలా సినిమాలే చూశాం. కథ పాతదే అయినా ఇప్పటి యూత్‌కి కావలసిన అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు నడిపించిన తీరు బావుంది.

ట్యాగ్‌లైన్‌: రొటీన్‌ బ్యూటీ
రేటింగ్‌: 2.25/5

సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్

‘‘ఎప్పుడన్నా నేను నిన్ను కోప్పడితే.. నన్ను అలా వదిలిపెట్టి వెళ్లిపోకే.. నిన్ను వదిలేయడమంటే ఊపిరి వదిలేయడమే కన్నా’’.. ఈ ఒక్క డైలాగ్ చాలు. ఇది ఖచ్చితంగా నిబ్బా నిబ్బీ స్టోరీనే అని ‘బ్యూటీ’కి సర్టిఫికేట్ ఇచ్చేయడానికి.

  • ప్యూర్ నిబ్బా నిబ్బీ స్టోరీతో తండ్రిని గొప్ప యోధుడిగా చూపించిన బోల్డ్ అంటెప్ట్ ‘బ్యూటీ’. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన సందేశాత్మక చిత్రంగానూ బ్యూటీని లెక్కకట్టొచ్చు. ప్రపంచం మొత్తం నీ మీద పగపట్టినా.. నీకోసం ప్రాణం పెట్టి పోరాడే వాడు ఒకడుంటాడు. తను ఖచ్చితంగా నాన్నే అయ్యి ఉంటాడు. నాన్నను మించిన యోధుడు లేడు. నాన్నను మించిన దేవుడు లేడు అనే మెసేజ్ కూడా ఇచ్చేశారు.
  • సినిమా అంటే అద్భుతాలు ఆవిష్కృతం కానక్కర్లేదు. చిన్న సినిమాలైతే ఓ మోస్తరుగా మెప్పించినా కూడా మంచి మార్కులే పడతాయి. ‘బ్యూటీ’ కూడా అలాంటి కథే. రోజు చూసే కథ.. చాలామంది జీవితాల్లో జరిగే కథ. పక్క వీధిలోనూ.. ఎదురింట్లోనూ.. తెలిసిన బంధువుల ఇళ్లలోనూ జరిగిన కథే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కాలేజ్‌కి పంపిన 18 ఏళ్లు కూడా నిండని నిబ్బా కూతురు.. ప్రేమలో పడుతుంది. దాని వల్ల కన్న తల్లితండ్రులు ఎంత బాధపడ్డారు? లేచిపోయిన కూతురు ఎలాంటి ఇబ్బందుల్లో పడిందీ అని కళ్లకి కట్టే కథ ఇది.
  • కథని చెప్పిన విధానం, పాత్రల తీరుతెన్నులతో కట్టిపడేశారు.
  • ఈ నిబ్బా నిబ్బీ కథకి ప్రాణం అంటే.. ఇందులోని పాత్రలే. సాధారణంగా సినిమా కథ అంటే.. హీరో, హీరోయిన్‌లతో మొదలుపెడుతుంటారు. కానీ ఈ కథని హీరోయిన్ తండ్రితో మొదలుపెట్టడమే భావ్యం. ఎందుకంటే ఈ కథకి హీరో.. హీరోయిన్ తండ్రి నారాయణే. ఈ పాత్రలో సీనియర్ నటుడు నరేష్.. యోధుడిలా పెద్ద పోరాటమే చేశాడు. 
  • తన కూతుర్ని చూడకూడని స్థితిలో చూసిన సీన్‌లో కానీ.. నరేష్ నటన అద్భుతం అనే చెప్పాలి. కూతుర్ని కన్న ప్రతి తండ్రి గుండె ఆ పాత్రను చూస్తే విలవిల్లాడిపోతుంది. అంత అద్భుతంగా చేశారు. చాలాచోట్ల ఎమోషన్స్‌తో కట్టిపడేసి ఏడిపించేశాడు.
  • ఇక హీరోయిన్ తల్లిగా చేసిన వాసుకి అయితే.. మధ్యతరగతి గృహిణి పాత్రకి వన్నెతెచ్చింది.
  • ఇక హీరో అంకిత్ కొయ్య విషయానికి వస్తే.. ఈ కథ చెప్పినప్పుడు కథకి తానే కథానాయకుడు అని అనిపిస్తే చేయడానికి ముందుకొస్తారు. కానీ.. ఆ కథకి తండ్రి పాత్ర (నరేష్) హీరో అని చెప్పినప్పుడు కూడా ఈ కథ చేశాడంటే.. హీరో కథని ప్రేమించాడనే అర్థం.
  • పెట్ లవర్ అర్జున్ పాత్రకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెచ్యూర్డ్ నటనను చూపించాడు.
  • ఇక ఈ కథలో హీరోయిన్ నీలిఖి పత్ర (Nilakhi Patra) అలేఖ్య పాత్రే కీలకం. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిపోయే ప్రతి నిబ్బా పిల్లకీ ఈ పాత్ర అంకితం అనేట్టుగానే ఉంది.
  • భలే ఉన్నాడే సినిమాతో దర్శకుడుగా మెప్పించలేకపోయిన జెఎస్ఎస్ వర్ధన్‌కి ఈ సినిమాతో పిలిచి అవకాశం ఇచ్చారు మారుతి. ఆర్.వి. సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్ ప్లే సహకారం అందించడంతో జెఎస్ఎస్ వర్ధన్‌.. ప్యూర్ నిబ్బా నిబ్బీ స్టోరీతో బోల్డ్ అటెంప్ట్ చేశారు.
  • రొటీన్ కథని డిఫరెంట్ స్క్రీన్ ప్లే ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా మలిచాడు. కథని మొదలుపెట్టిన తీరు.. ముందుకు తీసుకుని వెళ్లిన విధానం.. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
  • బేబీ సినిమాని తన పాటలతో నిలబెట్టి బ్లాక్ బస్టర్ అందించిన విజయ్ బుల్గానిన్ తన మ్యూజిక్ సెన్స్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాని హైప్ పిచ్‌కి తీసుకుని వెళ్లారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. కన్నమ్మా సాంగ్ అయితే అదిరింది.
  • సినిమా మొత్తం వైజాగ్, హైదరాబాద్ సిటీలోని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడంతో చాలా నాచురల్‌గా అనిపిస్తాయి.
  • ఓవరాల్‌గా ‘బ్యూటీ’ వాటే బ్యూటిఫుల్ అని అనిపించకున్నా అగ్లీ అయితే కాదు.
  • కాలేజ్‌కి వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిలు చూడాల్సిన సినిమా. తెలిసీ తెలియని వయసులో వాళ్లు ఎలాంటి తప్పులు చేస్తుంటారో.. వాళ్లకి అర్థమయ్యే రీతిలోనే చూపించారు.
  • పేరెంట్స్‌కి కూడా ఇదో హెచ్చరిక లాంటిదే కాబట్టి.. ఫ్యామిలీతోనూ చూడొచ్చు.

సౌజన్యం : telugu.samayam.com | పూర్తి రివ్యూ కోసం లింక్

ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో యువ నటీనటులు బాగానే షైన్ అయ్యారని చెప్పవచ్చు. యంగ్ హీరో అంకిత్ కొయ్య ఇన్ని రోజులు కొంచెం ఎంటర్టైనింగ్ పాత్రల నుంచి ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. తనలోని రెండు షేడ్స్ ని తాను బాగా హ్యాండిల్ చేసాడు. అలాగే యంగ్ నటి నిలఖి పాత్రా తన రోల్ లో బాగా చేసింది. తమ ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి.

ఇక సీనియర్ నటుడు నరేష్ మరోసారి తన వెర్సటాలిటీ చూపించారు. తన కూతురు విషయంలో తాను పడే తపన, పలు ఎమోషన్స్ ఎంతో జెన్యూన్ గా కనిపిస్తాయి. అలాగే ఒక మిడిల్ క్లాస్ తల్లిగా వాసుకి బాగా చేశారు. అలాగే సెకండాఫ్ లో ఓ ట్విస్ట్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో కనిపించే లైన్ ప్రస్తుత జెనరేషన్ కి సంబంధించిందే అయినప్పటికీ దీనిని తెరకెక్కించిన విధానం మాత్రం సినిమా చూసే వీక్షకులకు నిరుత్సాహాన్ని మిగులుస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ని బాగా సాగదీసి వదిలారు.

ఇక సెకండాఫ్ లో ఆ ట్విస్ట్ తర్వాత కథనం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అనుకుంటే అది ఉండదు. సన్నివేశాలు అసహజంగా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. కథనంలో ట్విస్ట్ చోటు చేసుకునేటప్పటికే ఆడియెన్స్ కి సినిమాకి కనెక్షన్ తెగిపోతుంది.

అలాగే నటుడు ప్రసాద్ బెహరా రోల్ కూడా సినిమాలో ఏమంత ఇంపాక్ట్ చూపించదు. అలాగే హీరోయిన్ పై కూడా పలు సన్నివేశాలు చాలా ఇరిటేటింగ్ గా కూడా ఉంటాయి.

సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. శ్రీ సాయి కుమార్ కెమెరా వర్క్ కూడా పర్వాలేదు. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు వర్ధన్ విషయానికి వస్తే.. తాను ప్రస్తుత జెనరేషన్ కి రిలేటెడ్ లైన్ ని తీసుకున్నారు కానీ దానిని ఆసక్తికరంగా నడపడంలో మాత్రం విఫలం అయ్యారని చెప్పాలి. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ వరకు ఓకే కానీ లీడ్ జంట నడుమ సన్నివేశాలు, వారి ట్రాక్ ని బెటర్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది.

తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “బ్యూటీ” చిత్రం ఒక బోరింగ్ అండ్ సిల్లీ లవ్ డ్రామా అని చెప్పాలి. ఒక సిల్లీ లవ్ ట్రాక్, పేలవమైన స్క్రీన్ ప్లే ఈ చిత్రం చూసే ఆడియెన్స్ ని నిరుత్సాహ పరుస్తాయి. అందరికీ కనెక్ట్ అయ్యే లైన్ ని దర్శకుడు మెప్పించే విధంగా తెరకెక్కించలేకపోయారు. వీటితో ఈ వారాంతానికి మరో సినిమా ఎంచుకుంటే మంచిది.

రేటింగ్ : 2.25/5

సౌజన్యం : 123telugu.com | పూర్తి రివ్యూ కోసం లింక్

Thyview ఛానల్ ఆడియో రివ్యూ

FEATU GADI MEDIA ఛానల్ ఆడియో రివ్యూ

Mahidhar Vibes ఛానల్ వీడియో రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *