This week 15-9-2015 – Movies that will be released in theaters.. Interesting web series on OTT

క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’
తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu)తో కలిసి మంచు లక్ష్మి (Lakshmi Manchu) నటిస్తూ, నిర్మించిన సినిమా ‘దక్ష’ (Daksha). సముద్రఖని, చిత్ర శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. వంశీకృష్ణ మల్లా దర్శకుడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో లక్ష్మి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాస్తవ సంఘటనలతో ‘బ్యూటీ’
వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘బ్యూటీ’ (Beauty). అంకిత్ కొయ్య (Ankith Koyya), నీలఖి జంటగా దర్శకుడు శివ సాయి వర్ధన్ రూపొందించారు. సుబ్రహ్మణ్యం రాసిన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధానికీ ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో నరేశ్, వాసుకీ తదితరులు కీలక పాత్రధారులు.

‘స్వర్ణకమలం’ స్ఫూర్తితో..
ఇంద్రాణి దావలూరి ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’. తనికెళ్ల భరణి, ఆదిత్య మేనన్ కీలక పాత్రధారులు. ‘స్వర్ణకమలం’ సినిమా స్ఫూర్తితో ‘అందెల రవమిది’ (andela ravamidi) తెరకెక్కించినట్టు ఇంద్రాణి తెలిపారు. సంగీతం, నాట్యం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది.

యాక్షన్ థ్రిల్లర్‌గా ‘టన్నెల్’
అథర్వ మురళి (Atharvaa Murali), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘టన్నెల్’ (Tunnel). రవీంద్ర మాధవ దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబరు 19న విడుదల కానుంది.

పొలిటికల్ ‘భద్రకాళి’!
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). తమిళంలో ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబరు 19న రాబోతున్న చిత్రం ‘భద్రకాళి’ (Bhadrakaali). రాజకీయ నేపథ్య కథతో దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ సరసన త్రుప్తి రవీంద్ర హీరోయిన్. ఈ మూవీ విజయ్ ఆంటోనీకి 25వ చిత్రం కావడం విశేషం.

సంగీత దర్శకుడి ‘వీర చంద్రహాస’
‘కేజీయఫ్’తో టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు రవి బస్రూర్ (Ravi Basrur). డైరెక్టర్‌గా తన ప్రతిభను నిరూపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తెరకెక్కించిన తొలి సినిమా ‘వీర చంద్రహాస’ (Veera Chandrahasa). ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ సినిమా తెలుగులో ఈ నెల 19న బాక్సాఫీసు ముందుకు రానుంది. యక్షగానం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమాలో శిథిల్ శెట్టి, నాగశ్రీ ప్రధాన పాత్రధారులు. ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథిగా కనిపించనున్నారు.

నవ్వుల ‘జాలీ’
బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఫ్రాంచైజీల్లో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఒకటి. అందులో తెరకెక్కిన మూడో సినిమా ‘జాలీ ఎల్ఎల్బీ 3’ (Jolly LLB 3) శుక్రవారం విడుదల కానుంది. అక్షయ్ కుమార్ (Akshay Kumar), అర్షద్ వార్షి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ కామెడీ లీగల్ డ్రామా మూవీ ఇది. సుభాష్ కపూర్ దర్శకత్వం వహించారు.

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ప్రాజెక్టులివీ..

పోలీస్ పోలీస్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 19
ది ట్రయల్ 2 (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 19


ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 18
ప్లాటోనిక్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 18
బిలియనీర్స్ బంకర్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 19
హాంటెడ్ హాస్టల్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 19
28 ఇయర్స్ లేటర్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 20


హౌస్మేట్స్: సెప్టెంబరు 19

