Little hearts reviews – links

నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగారం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, జయకృష్ణ, నిఖిల్ తదితరులు;
సంగీతం: సింజిత్ యెర్రమల్లి; సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ; ఎడిటింగ్: శ్రీధర్ సొంపల్లి; ఆర్ట్: దివ్య పవన్;
నిర్మాత: ఆదిత్య హసన్; దర్శకత్వం: సాయిమార్తాండ్;
సంస్థ: ఈటీవీ విన్ ప్రొడక్షన్; విడుదల సంస్థలు: బన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్;
విడుదల తేదీ: 05-09-2025


అఖిల్ (మౌళి తనూజ్) చదువుల్లో అంతంత మాత్రమే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాలనుకుంటాడు. కానీ, తండ్రి గోపాలరావు (రాజీవ్ కనకాల) మాత్రం లాంగ్ టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయని (శివానీ నాగారం)ది కూడా అదే కథే. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. తమ కూతురిని కూడా డాక్టర్‌గా చూడాలనేది వాళ్ల లక్ష్యం. అందుకే కాత్యాయని కూడా ఇంటర్ తర్వాత లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్కడే అఖిల్, కాత్యాయని పరిచయమవుతారు. ఆ పరిచయం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ తన మనసులో మాటని బయట పెడతాడు. అప్పుడు కాత్యాయని తనకు సంబంధించిన ఓ విషయాన్ని బయట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమకథలో ఓ పెద్ద మలుపు. ఇంతకీ కాత్యాయని చెప్పిన ఆ విషయం ఏమిటి?వీళ్లిద్దరి మధ్య ప్రేమకి ఎదురైన సమస్య ఏమిటి? ఆ ప్రేమకథ కంచికి చేరిందా లేదా? అనేది మిగతా కథ.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సింజిత్ పాటలు చిత్రానికి ప్రధానబలం. కథలో భాగంగా వచ్చే పాటలు కూడా నవ్విస్తూ ఉంటాయి. అదే ఈసినిమా ప్రత్యేకత. విజువల్స్ మెప్పిస్తాయి. బలమైన రచనతో రూపొందిన చిత్రమిది. దర్శకుడు సాయి మార్తాండ్ తెలిసిన కథనే, అందంగా, మంచి హాస్యంతో తెరపైకి తీసుకొచ్చిన తీరు మెప్పిస్తుంది. నిర్మాణంలో లోటుపాట్లేమీ కనిపించవు.
- బలాలు
- + హాస్యం
- + నటీనటులు
- + సంగీతం.. ఛాయాగ్రహణం
- బలహీనతలు
- – ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
- చివరిగా: లిటిల్ హార్ట్స్… ఆద్యంతం నవ్వులే
సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్


విశ్లేషణ..
2015 సమయంలో సాగే కథ ఇది. ఇంట్లో సరిగా చదవని టీనేజర్స్ ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లల ఉన్నతిని కోరుకునే తల్లిదండ్రుల ఆలోచనలు, నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అన్న కథకు రొమాంటిక్ లవ్‌స్టోరీ, వినోదాన్ని జోడించి తీసిన సినిమా ఇది. ఇందులో పెద్ద కథేమీ లేదు. అందరికీ తెలిసిన కథే. ఫస్టాఫ్ అంతా ఎంసెట్ ఎగ్జామ్, లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్, కొత్త పరిచయాలు, స్నేహితుల మధ్య సరదా సన్నివేశాలతో సోసోగా సాగిపోయింది. అమ్మాయితో పరిచయం, ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే సమయానికి హీరోహీరోయిన్‌కి మధ్య ఓ ట్విస్ట్. అక్కడితో ఇంటర్వెల్ ఇచ్చి కథపై మరింత ఆసక్తి కలిగించాడు దర్శకుడు. (ఆ ట్విస్ట్ ఏంటనేది తెరపైనే చూడాలి). అక్కడి నుంచి కథ పరుగులు తీస్తుంది. కథలో ఎంటర్టైన్మెంట్ అంతా సందర్భానుసారంగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టడు. ప్రేమకథ, కామెడీ, సెటైర్లు అన్ని ఆధ్యంతం నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. ఇందులో మౌళి చేసిన మ్యూజిక్ వీడియో భలే ఫన్ క్రియేట్ చేసింది. కాలం, పరిస్థితులతో టీనేజర్స్ ఆలోచనలో ఎలాంటి మార్పులు వస్తాయి? బలవంతపు చదువులు కాకుండా నచ్చింది చేస్తే ఆ కిక్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇందులో చూపిస్తూ చిన్న సందేశం ఇచ్చారు. తెలిసిన కథో సినిమా అనుకున్నప్పుడు తెరకెక్కించే విధానం, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడానికి తగిన జాగ్రత తీసుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు సాయి మార్తండ్ ఫర్ఫెక్ట్గా వర్క్ చేశాడు. తను ఏం చెప్పాలనుకున్నాడో అదే తెరపై చూపించాడు. క్లైమాక్స్‌ను అటు ఇటు చేయకుండా ఓ ఫ్లోలో జాగ్రత్తగా ట్రీట్ చేశాడు.
అఖిల్ పాత్రలో మౌళి ఇరగదీశాడనే చెప్పాలి. నటన పరంగానూ వందకు వంద మార్కులు వేయవచ్చు. హీరోయిన్ శివానీ నాగరం కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అనే చెప్పాలి. మౌళి స్నేహితులుగా నటించిన సాయి(మధు), మిర్చి చైల్డ్ ఆర్టిస్ట్ నిఖిల్ అబ్బూరికి మంచి పాత్రలు దక్కాయి. సాయి కామెడీ టైమింగ్ బావుంది. మరో ఛైల్డ్ ఆర్టిస్ట్ రాజా ప్రజ్వల్ కూడా బాగా చేశాడు. రాజీవ్ కనకాల గోపాలరావుగా చక్కని నటన కనబర్చారు. అలాగే ఎస్ఎస్ కాంచీ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. అనితా చౌదరి, సత్యకృష్ణన్ పరిధి మేరకు నటించారు. దర్శకుడి రాత, తీత కూడా బావుంది. మాటలు ఆకట్టుకున్నాయి. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం ప్లెజంట్‌గా ఉంది. కథకు తగ్గట్టు సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ కూడా బాగా కుదిరింది. ఎడిటర్ శ్రీధర్ ఫస్టాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే అది పరుగులు తీసేది. నిర్మాణ విలువలు బావున్నాయి. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలు తీసుకోవడంతో సినిమా రూపు మారిపోయింది.
పక్కాగా ఈతరానికి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకుని థియేటర్ నుంచి బయటకు రావచ్చు. నిర్మాతకు కాసుల వర్షం కూడా కురిపిస్తుంది.
ట్యాగ్‌లైన్: క్లీన్ ఎంటర్టైనర్.. పైసా వసూల్..
రేటింగ్: 3/5
సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్


ఈ “లిటిల్ హార్ట్స్” ఒక డీసెంట్ టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. మౌళి ఒక డీసెంట్ డెబ్యూ ఇవ్వగా తన కామెడీ ట్రాక్స్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ లు బాగున్నాయి. ముఖ్యంగా యువతకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. లాజిక్స్, ఎమోషన్స్ తో పెద్దగా పని లేదు కేవలం ఫన్ కోసం మాత్రమే అంటే ఈ చిత్రాన్ని ట్రై చేస్తే ఎంటర్టైన్ అవుతారు.
సౌజన్యం : 123telugu.com
రేటింగ్ : 3/5


గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో ‘బిందాస్’ కథల ఊపు పెరిగింది. వాటిలో కథ మీద బుర్రలు బద్దలు కొట్టేసుకోవడం ఏమీ ఉండదు. చాలా సింపుల్ లైన్ తీసుకుంటారు. ఫన్నీ సిచువేషన్లు క్రియేట్ చేస్తారు. ట్రెండీ డైలాగులుంటాయి. ఏ పాత్రా సీరియస్ గా అనిపించదు. అన్నీ ఒక సింక్ లో సాగిపోతుంటాయి. అల్లరల్లరి చేస్తుంటాయి. సెంటిమెంట్లు.. ఎమోషన్లకు ఎక్కడా ఛాన్సే ఉండదు. ఎంత సీరియస్ సిచువేషనైనా నవ్వించడమే ధ్యేయంగా సాగుతాయి సన్నివేశాలు. ఇందులో అసలేం స్టోరీ ఉంది?.. సినిమాలో సీరియస్‌నెస్ ఎక్కడ? పాత్రలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాయేంటి? అని ప్రశ్నలు రేకెత్తిస్తూనే.. వినోదపు మాయలో అవన్నీ మరిచిపోయేలా చేస్తాయి ఆ చిత్రాలు. ఒక జాతిరత్నాలు.. ఒక మ్యాడ్.. ఒక ఆయ్.. ఒక సింగిల్.. ఈ కోవలో వచ్చిన కొత్త చిత్రమే.. లిటిల్ హార్ట్స్. కొంచెం లోతుగా ఆలోచిస్తే.. సొసైటీ కోణంలో చూస్తే ఇది యువత మీద ఇలాంటి సినిమాలు చూపించే ప్రభావం గురించి కొంచెం ఆందోళన కలుగుతుంది కానీ.. అవన్నీ పక్కన పెట్టి కేవలం ఎంటర్టైన్మెంట్ కోణంలో చూస్తే మాత్రం రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా నవ్వుకోవడానికి ‘లిటిల్ హార్ట్స్’లో ఢోకా లేదు.
చివరగా: లిటిల్ హార్ట్స్.. జాలీ రైడ్
రేటింగ్- 2.75/5
సౌజన్యం : తుపాకీ.కామ్ | పూర్తి రివ్యూ లింక్


మౌళి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అమాయకంగా కనిపిస్తూనే ఉన్నంతలో చావు తెలివితేటలు చూపించే పాత్రకి అతని ఫేస్ సరిగ్గా సరిపోయింది. సగటు టీనేజ్ యువకుడి పాత్రని బాగానే మోసాడు. దానికి తోడు నటనలో ఈజ్ ఉండడం వల్ల ఆద్యంతం ఆడియన్స్ ని కూర్చోబెట్టగలిగాడు.
కాత్యాయనిగా కనిపించిన శివాని నాగరం అందంతో ఆకట్టుకుంది. అభినయం విషయంలో కూడా సటిల్ గా ఉంటూ హుందాగా చేసింది. అంబాజీపేట మేరేజ్ బ్యాండ్ తర్వాత మరొక చెప్పుకోదగ్గ పాత్ర ఈమెది.
రాజీవ్ కనకాల చాలా కాలం తర్వాత సినిమాలో చనిపోని పాత్రలో కనిపించాడు. తన టైమింగుతో నవ్వించాడు కూడా. హీరో తల్లిగా అనితా చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. హీరోయిన్ తండ్రిగా కాంచి ఎక్స్‌ప్రెషెన్స్ తోనే నవ్వించాడు. తల్లిగా సత్యకృష్ణన్ సీరియస్ గా కనిపిస్తూ కమెడీ సీన్స్ కి తోడ్పడింది.
హీరో ఫ్రెండ్ మధు పాత్రలో కనిపించిన నటుడు కూడా మంచి పంచులు వేస్తూ కామెడీ చేసాడు.
సినిమా చివర్లో “ఈ చిత్రానికి నెగటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే” అంటాడు హీరో. అలా బెదిరించకపోయినా చెప్పేది ఒక్కటే. ఈ చిత్రం టీనేజ్ మైండ్ సెట్ తో చూస్తే నవ్వించి తీరుతుంది. నవ్వించకపోతే ఆడియన్స్ ఏజ్ బార్ అయినట్టు.
బాటం లైన్: టీనేజ్ “హార్ట్స్” కి మాత్రమే

Barbell pitch meetings ఛానల్ రివ్యూ

RatpacCheck / Telugu ఛానల్ రివ్యూ

Thyview ఛానల్ ఆడియో రివ్యూ

Ragadi ఛానల్ వీడియో రివ్యూ



