SISU: Road to Revenge – Official Trailer
యాక్షన్ లవర్స్ కు ఫుల్ కిక్ ఇచ్చి కలకాలం గుర్తుండి పోయేలా ఎంటర్టైన్ చేసిన చిత్రం సిసు (Sisu). హాలీవుడ్ చిత్రాలను తోసి మరి అల్‌టైమ్ టాప్ నాచ్ యాక్షన్ చిత్రాల్లో ప్రధమ స్థానంలో నిలిచింది ఈ ఫిన్ళాండ్ మూవీ.జోర్మా టోమిలా (Jorma Tommila) హీరోగా నటించిన ఈ సినిమాకు జల్మారి హెలాండర్ (Jalmari Helander) రచన, దర్శకత్వం చేశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ సిసు రోడ్ టు రివేంజ్ (SISU Road to Revenge) తెరకెక్కింది. ఇందులోనూ జల్మారి మెయిన్ లీడ్‌గా నటించగా కొత్తగా అవతార్ విలన్ ఫ్టీఫెన్ లాంగ్ (Stephen Lang), రిచర్డ్ బ్రేక్ (Richard Brake) ఈ మూవీకి జత కలిశారు.
అన్నింటికి మించి ట్రైలర్లో గత సినిమాను మించిన యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో చూసిన వారికి గూస్ బంప్స్ రావడం పక్కా. అంతలా ఆ ట్రైలర్ నిండా పోరాట సన్నివేశాలతో ప్రతీ సీన్ తీర్చదిద్దారు. విజువల్స్ సైతం మైండ్ బ్లోయింగ్‌గా ఉండగా యాక్షన్ కోరియోగ్రఫీ వామ్మో అనేలా జీవితంలో ఇలాంటి యాక్షన్ చూడలేం అనేలా ఉన్నాయి. కాగా ఈ సిసు రోడ్ టు రివేంజ్ (SISU Road to Revenge) సినిమా ఈ ఏడాది నవంబర్ 21న ప్రేక్షకుల ఎదుటకు థియేటర్లలోకి రానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవనుంది.

