25-ఆగస్టు 2025
కంటెంట్ ప్రధానంగా…

Tribanadhari Barbarik || వర్తమానంలో జరుగుతున్న సంఘటనలకి పౌరాణిక నేపథ్యాన్ని జోడించి రూపొందించిన చిత్రమే ‘త్రిబాణధారి బార్బరిక్’ అంటున్నారు మోహన్ శ్రీవత్స. ఆయన దర్శకత్వంలో సత్యరాజ్, ఉదయభాను, (udayabhanu) వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. విజయ్‌పాల్ రెడ్డి అడిదెల నిర్మాత. వినాయకచవితి కానుకగా ఈ నెల 29న (tribanadhari barbarik release date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కంటెంట్ ప్రధానమైన సినిమా ఇది. హీరో, విలన్ అంటూ ఎవ్వరూ ఉండరు. ఈ కథలోని ప్రతి పాత్రకీ భిన్న పార్శ్వాలుంటాయి. అన్ని పాత్రలకీ అంతర్గతంగా ఓ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత’ అని చిత్ర బృందం చెబుతోంది.
కుటుంబ కథా చిత్రంతో…

Sundarakanda || కథానాయకుడు నారా రోహిత్ సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నటించిన చిత్రం ‘సుందరకాండ’. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృతి వాఘని కథానాయిక. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే రొమ్-కామ్ చిత్రంగా, ప్రతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా జీవితంలో ఉండే అన్ని రకాల భావోద్వేగాల్ని చూపించే విధంగా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల కానుంది.
రొమాంటిక్ కామెడీగా..

Param Sundari || కేరళలోని అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ నాయకానాయికల ప్రేమ ప్రయాణం, కామెడీని మిళితం చేసిన తీర్చిదిద్దిన చిత్రం ‘పరమ్ సుందరి’. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా తెరకెక్కిన చిత్రమిది. తుషార్ జలోటా దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కేరళ అమ్మాయిగా జాన్వీ, దిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ సందడి చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే, సినిమాను వినోదాత్మకంగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.
గ్రామీణ నేపథ్యంలో..

Kanya Kumari || శ్రీచరణ్ రాచకొండ (Sreecharan Rachakonda), గీత్ షైని (Geeth Saini) జంటగా నటించిన చిత్రం ‘కన్యాకుమారి’ . సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది. రైతు పాత్రలో శ్రీచరణ్, ఐటీ ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యమున్న కన్యాకుమారిగా గీత్ అలరించేలా ఉన్నారు.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
- నెట్‌ఫ్లిక్స్
- అబిగైల్ (తెలుగు) ఆగస్టు 26
- మెట్రో ఇన్ డినో (హిందీ) ఆగస్టు 29
- కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్) ఆగస్టు 30
- అమెజాన్ ప్రైమ్
- అప్‌లోడ్ 4 (వెబ్‌సిరీస్) ఆగస్టు 25
- హాఫ్ సీఏ2 (హిందీసిరీస్) ఆగస్టు 27
- సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ) ఆగస్టు 29
- జియో
- రాంబో ఇన్ లవ్ (తెలుగు) ఆగస్టు 29
సౌజన్యం : ఈనాడు

