
చిత్రం: కూలీ; నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, ఆమీర్‌ఖాన్ తదితరులు; సంగీతం: అనిరుధ్ రవిచందర్; ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్; సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్; నిర్మాత: కళానిధి మారన్; రచన, దర్శకత్వం: లోకేశ్ కనగరాజ్; విడుదల: 14-08-2025
| లింక్ | వివరాలు | రేటింగ్ |
|---|---|---|
| ఈనాడు | టైటిల్ పాత్రలో రజనీకాంత్ ఆద్యంతం అలరిస్తారు. తన వయసుకు తగ్గ పాత్రలోనే కనిపిస్తూ.. ఎక్కడా తనలోని స్టైల్‌ను, గ్రేస్‌ను మిస్ చేయకుండా ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా, స్టైలిష్ విలన్ సైమన్ పాత్రలో నాగార్జున జీవించేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఆయనలోని విలనిజం పతాక స్థాయిలో కనిపిస్తుంది. దయాల్ పాత్రలో సౌబిన్ షాహిర్ మరో అదనపు బలం. శ్రుతిహాసన్ పాత్ర ఈ కథకు కాస్త ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో ఉపయోగపడింది. సత్యరాజ్, ఉపేంద్ర తెరపై కనిపించేది కొద్దిసేపైనా అందర్నీ ఆకట్టుకుంటారు. ఆమీర్ ఖాన్ పాత్ర పరిచయ సన్నివేశాలు.. తన గెటప్ భలే అనిపిస్తాయి. ఈ సినిమాకి సాంకేతికంగా మెయిన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఆయన అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని పతాక స్థాయిలో నిలబెట్టింది. మోనికా పాట మాస్ ప్రేక్షకుల్ని ఊపేస్తుంది. ఏఐతో రజనీని వింటేజ్ లుక్‌లో చూపించారు. ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సినిమా కోసం పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. | బలాలు + రజనీకాంత్ స్టైలిష్ నటన, యాక్షన్ + ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దుకున్న తీరు + లోకేశ్ మార్క్ స్క్రీన్‌ప్లే, అనిరుధ్ సంగీతం బలహీనతలు – రొటీన్ కథ – ద్వితీయార్ధంలోని సాగదీత చివరిగా: ‘కూలీ’.. రజనీ మార్క్ స్టైలిష్ యాక్షన్ హంగామా! |
| ఆంధ్రజ్యోతి | దేవాగా రజనీకాంత్ తనదైన స్టైల్లో చేసుకెళ్లిపోయారు. డాన్స్‌లు, ఫైట్‌ల విషయంలో పెద్దగా కష్టపెట్టకుండా వయసుకు తగ్గట్టుగా అన్ని సెట్ చేశారు. యాక్షన్, ఎమోషన్స్‌తో మెప్పించారు. సీన్‌కు తగ్గట్టు మౌల్డ్ అయ్యారు. ఆయన కరిజ్మా సినిమాకు ప్లస్ అని చెప్పాలి. నాగార్జున విలన్‌గా మెప్పించారు. లుక్ బావుంది. కానీ ఆయన చెప్పినంతగా సైమన్ పాత్రలో కొత్తేమీ లేదు. ‘మౌనికా’ అంటూ పూజాహెగ్డే ప్రత్యేక గీతంలో మెరిసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. విజువల్‌గా సినిమా బావుంది. | ట్యాగ్‌లైన్: ఊరించి ఉసూరుమనిపించిన ‘కూలీ రేటింగ్: 2.5/5 |
| తుపాకి.కామ్ | * ఏ సినిమా అయినా.. మొదలైన అరగంటకో.. గంటకో.. లేదంటే ఇంటర్వెల్ సమయానికి అయినా కథేంటి.. పాత్రలేంటి అన్నది అర్థం కావాలి. కానీ ‘కూలీ’ సినిమా విషయంలో మాత్రం శుభం కార్డు పడ్డాక కూడా శేష ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి. ఎంతో బిల్డప్ తో మొదలై.. ఏదో చేసేయాలని ప్రయత్నించి.. చివరికి పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ముగిసే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. * రజినీ చేసిన హీరో పాత్ర సహా ఏదీ సరైన ఇంపాక్ట్ వేయదు ‘కూలీ’లో. కథలో కొన్ని కొత్త పాయింట్లు.. కొన్ని ఎలివేషన్ సీన్లు.. స్టైలిష్ టేకింగ్ వల్ల ‘కూలీ’ అక్కడక్కడా ఎంగేజ్ చేస్తుంది కానీ.. రజినీ-లోకేష్ కాంబినేషన్ మీద పెట్టుకున్న అంచనాలకు దరిదాపుల్లో కూడా ఈ సినిమా నిలవదు. * దేవా పాత్రలో ఆయన మ్యాజిక్ చేయలేకపోయారు. రజినీ చేసిన ఫైట్లు ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించవు. చాలా చోట్ల ఆయన పాత్ర నామమాత్రంగా అనిపిస్తుంది. సైమన్ పాత్రలో నాగార్జున కూడా అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయారు. * సినిమాకు తెర వెనుక అనిరుధ్ నీరసంగా సాగే సినిమాలో ఊపు తేవడానికి అతను గట్టి ప్రయత్నమే చేశాడు. తన పాటలు.. నేపథ్య సంగీతం రెండూ హుషారు పుట్టించేలా సాగాయి. మోనికా పాటలో తన మ్యూజిక్ అదిరిపోయినా.. దాని ప్లేస్మెంట్-టేకింగ్ అంత గొప్పగా లేవు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. | చివరగా: కూలీ.. కంటెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ రేటింగ్-2.5/5 |
| ఫిల్మీ బీట్.కామ్ | లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే.. మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందరిలో ఉన్న అభిప్రాయానికి తగినట్టే లోకేష్ తాను నమ్ముకొన్న పాయింట్‌కు ఎమోషన్స్ జోడించి పాత కథనే తిరగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తగా విషయం ఏమీ లేదనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది. ఇమేజ్‌కు భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్‌ను ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయాడు. రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది. చివర్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయాల్ పాత్రలో కనిపించిన సౌబీన్. | రేటింగ్ : 2.5/5 |
బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఛానల్ వీడియో రివ్యూ
రాగడి ఛానల్ వీడియో రివ్యూ
నిప్పు నాగరాజ్ ఛానల్ వీడియో రివ్యూ 😂
థై వ్యూ ఛానల్ అడియో రివ్యూ
మూవీ మేటర్స్ ఛానల్ రివ్యూ 😔
కొత్త ముచ్చట ఛానల్ వీడియో రివ్యూ
హిట్ టివి టాకీస్ ఛానల్ వీడియో రివ్యూ


