su from so telugu review: రివ్యూ: సు ఫ్రమ్‌ సో.. కన్నడ సూపర్‌హిట్‌ మూవీ తెలుగులో అలరించిందా?

Su from so telugu review || చిత్రం: సు ఫ్రమ్‌ సో; నటీనటులు: షనీల్‌ గౌతమ్‌, జేపీ తుమినాడ్‌, సంధ్య అరకెరె, ప్రకాశ్‌ తుమినాడ్‌, రాజ్‌ బి.శెట్టి తదితరులు; కథ, దర్శకత్వం: జేపీ తుమినాడ్‌; విడుదల సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌; విడుదల తేదీ: 8-08-2025

ప్రస్తుతం కన్నడ చిత్రసీమలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘సు ఫ్రమ్‌ సో’. రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై.. కన్నడలో ఇప్పటికే రూ.35కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘సు ఫ్రమ్‌ సో’ కథేంటి? ఏ మేర మెప్పించింది?

ఎవరెలా చేశారంటే..

ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా తెలుగు ప్రేక్షకులకు తెలియని ముఖాలే. కానీ, తెరపై ఆ పాత్రల్ని చూస్తున్నంత సేపూ మన ఊళ్లోనే జరుగుతున్న కథన్నట్లుగా వాటితో కనెక్ట్‌ అయిపోతాం. ముఖ్యంగా రవన్న పాత్రలో షానిల్‌ గౌతమ్‌ ఒదిగిన తీరు.. సహజమైన నటనతో కట్టిపడేసిన విధానం ఆకట్టుకుంటాయి. మన ఊళ్లో ఏదోక చోట అలాంటి పాత్రల్ని చూస్తూనే ఉంటాం కదానే అనుభూతి కలుగుతుంది. అలాగే అశోక్‌ పాత్రలో దర్శకుడు జేపీ తుమినాడ్‌ కూడా చక్కటి నటనతో అలరించారు. ఇక గురూజీగా రాజ్‌ బి శెట్టి ఆహార్యం.. హావభావాలు.. డైలాగ్‌ డెలివరీ.. కామెడీ టైమింగ్‌ ప్రతిదీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. వీళ్లకు తోడుగా డ్రింకర్‌ బావ పాత్ర సినీప్రియుల్ని విశేషంగా అలరిస్తుంది. తను కనిపించినప్పుడల్లా.. ‘‘వచ్చాడు వచ్చాడు బావ వచ్చాడు’’ అంటూ బ్యాగ్రౌండ్‌లో వినిపించే పాట కూడా భలే కామెడీగా ఉంటుంది. ఇక జేపీ తుమినాడ్‌ నటుడిగా.. దర్శకుడిగా రెండూ పాత్రలకు వందశాతం న్యాయం చేసే ప్రయత్నం చేశారు. తను రాసుకున్న కథ, స్క్రీన్‌ప్లే, పాత్రల్ని తీర్చిదిద్దుకున్న విధానం ప్రతిదీ ప్రేక్షకుల్ని అలరించింది.

  • బలాలు
  • + కథ, స్క్రీన్‌ప్లే
  • సహజమైన నటనతో కట్టిపడేసే పాత్రలు
  • కథలోని వినోదం, పతాక సన్నివేశాలు
  • బలహీనతలు
  • ద్వితీయార్ధంలో తగ్గిన నవ్వుల డోస్‌
  • చివరిగా: నవ్విస్తూ.. ఆలోచింపజేసే.. దెయ్యం లేని దెయ్యం సినిమా!

సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *