This week OTT movies

thammudu movie ott || నితిన్ (Nithiin) కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తమ్ముడు’ . ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sitaare Zameen Par ott || ఆమిర్‌ఖాన్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ . ఇటీవల థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ఎమోషనల్ డ్రామాగా మెప్పించింది. అయితే, ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనని ఆమిర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకుతగినట్లుగానే ఆగస్టు 1వ తేదీ నుంచి యూట్యూబ్ వేదికగా అద్దె ప్రాతిపదికన ఈ సినిమా అందుబాటులోకి తెచ్చారు.

Oh Bhama Ayyo Rama ott || సుహాస్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ భామ.. అయ్యో రామ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా కామెడీ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ గోదల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలీ, ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు.

3 BHK Movie ott || సిద్ధార్థ్ (Siddharth), ఆర్.శరత్‌కుమార్ తండ్రీ కొడుకులుగా నటించిన సినిమా ‘3 బీహెచ్‌కే’ . ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) వేదికగా తెలగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సొంతింటి కల నెరవేర్చుకునే క్రమంలో ఓ మధ్యతరగతి కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొందన్న కథాంశంతో శ్రీ గణేశ్ తెరకెక్కించారు.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
- అమెజాన్‌ప్రైమ్ వీడియో
- హౌస్‌ఫుల్ (మూవీ) హిందీ
- సీస్ కడ్డి (మూవీ) కన్నడ
- ఏప్రిల్ మే 99 (మూవీ) మరాఠీ
- ది లెజెండ్ ఆఫ్ ఓచి (మూవీ) ఇంగ్లీష్
- మిల్లర్స్ ఇన్ మ్యారేజ్ (మూవీ) ఇంగ్లీష్
- వార్ ఆఫ్ ది వరల్డ్స్(మూవీ) ఇంగ్లీష్
- డోప్ గర్ల్స్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
- నథింగ్ బట్ లవ్ (వెబ్‌సిరీస్: సీజన్1) తెలుగు, తమిళ్
- ఈటీవీ విన్
- నాన్న (మూవీ) తెలుగు
- రెడ్ శాండిల్ ఉడ్ (మూవీ) తెలుగు
- ఆహా
- అస్త్రం (మూవీ) తమిళ్
- సన్‌నెక్ట్స్
- సురభిలా సుందర స్వప్నం (మూవీ) మలయాళం
- జీ5
- బకేతి (వెబ్‌సిరీస్: సీజన్1)హిందీ, తమిళ్
- జియో హాట్‌స్టార్
- బ్లాక్ బ్యాగ్ (మూవీ) ఇంగ్లీష్
- ఐస్ ఆఫ్ వకండా (వెబ్‌సిరీస్:సీజన్1) ఇంగ్లీష్
- ఎ బ్లడీ లక్కీ డే (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
- ఐయామ్ బిహార్: ట్రైల్స్ టు టేల్ (డాక్యుమెంటరీ సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
- హరికేన్ కత్రినా (డాక్యుమెంటరీ సిరీస్) ఇంగ్లీష్
- బ్యాటిల్ ఆఫ్ కులియకన్ (డాక్యుమెంటరీ సిరీస్) ఇంగ్లీష్
- సూపర్‌సారా (డాక్యుమెంటరీ సిరీస్) ఇంగ్లీష్
- నెట్‌ఫ్లిక్స్
- మై ఆక్స్‌ఫర్డ్స్ ఇయర్ (మూవీ) ఇంగ్లీష్
- డూ లిటిల్ (మూవీ) ఇంగ్లీష్
- ది శాండ్‌మ్యాన్ (వెబ్‌సిరీస్: సీజన్2) ఇంగ్లీష్
- లియాన్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
- అన్ స్పీకబుల్ సిన్స్ (వెబ్‌సిరీస్:సీజన్1) స్పానిష్
- డేత్ ఇన్ (వెబ్‌సిరీస్: సీజన్2) స్పానిష్
- నథింగ్ అన్ కవర్డ్ (వెబ్‌సిరీస్: సీజన్1) కొరియన్
- గ్లాస్ హార్ట్ (వెబ్‌సిరీస్: సీజన్1) జపనీస్
- లెర్నింగ్ టు లవ్ (వెబ్‌సిరీస్: సీజన్1) జపనీస్
- కన్వర్జేషన్స్ విత్ ఎ కిల్లర్ (డాక్యుమెంటరీ సిరీస్) ఇంగ్లీష్
- ట్రైన్‌వ్రిక్: స్ట్రామ్ ఏరియా 51 (డాక్యుమెంటరీ సిరీస్) ఇంగ్లీస్
- డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: అన్‌రియల్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
సౌజన్యం : ఈనాడు | లింక్


